ఇక మిగిలింది వీళ్లేనా? వీళ్లూ మారక తప్పదా?

తెలుగుదేశం పార్టీ చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నప్పుడు విర్ర వీగారు. వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు. వారిలో కొందరికి మంత్రి పదవులు కూడా అప్పగించారు. దీంతో పాటు వైసీపీని [more]

Update: 2020-03-13 08:00 GMT

తెలుగుదేశం పార్టీ చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నప్పుడు విర్ర వీగారు. వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు. వారిలో కొందరికి మంత్రి పదవులు కూడా అప్పగించారు. దీంతో పాటు వైసీపీని అన్ని నియోజకవర్గాల్లో వీక్ చేయడానికి అనేక చోట్ల కొత్త ప్రయోగాలు చేశారు. శత్రువులను కలిపారు. సుదీర్ఘకాలంగా శత్రువులను ఏకం చేస్తే ఇక తమకు తిరుగుండదని, ఆ నియోజకవర్గంలో ఎప్పటికీ టీడీపీ జెండా ఎగురుతుందని చంద్రబాబు అంచనా వేశారు. కానీ ఆ అంచనాలన్నీ ఇప్పుడు క్రమంగా తారు మారవుతున్నాయి. ప్రయోగాలు విఫలమవుతున్నాయని తేలిపోయింది.

జమ్మలమడుగులో…..

జమ్మలమడుగు నియోజకవర్గాన్ని తీసుకుంటే అక్కడ ఫ్యాక్షన్ రాజకీయాలు నడుపుతున్న రెండు కుటుంబాలను చంద్రబాబు కలిపారు. రామసుబ్బారెడ్డి, ఆదినారాయణ రెడ్డి కుటుంబాల మధ్య దశాబ్దకాలంగా హత్యారాజకీయాలు నడుస్తున్నాయి. జమ్మలమడుగును పర్మినెంట్ నియోజకవర్గంగా చేసుకోవాలని భావించిన చంద్రబాబు వారిద్దరినీ ఏకం చేశారు. ఒకరికి ఎమ్మెల్సీ పదవి, మరొకరికి మంత్రి పదవి ఇచ్చారు. ఎన్నికల్లో ఇద్దరూ ఓటమి పాలయ్యారు. ఇప్పుడు ఇద్దరూ చెరో పార్టీని చూసుకున్నారు. చంద్రబాబును వదిలేసి వెళ్లిపోయారు.

కరణం వర్సెస్ గొట్టిపాటి…..

ఇక ప్రకాశం జిల్లాలో అద్దంకి నియోజకవర్గంలో కరణం బలరాం, గొట్టిపాటి కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ తగాదాలున్నాయి. 2014 ఎన్నికల వరకూ రెండు కుటుంబాలు వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేశాయి. అయితే 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వైసీపీ నుంచి గెలిచిన గొట్టిపాటి రవికుమార్ ను పార్టీలోకి తీసుకొచ్చారు. కరణం బలరాంకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ కరణం బలరాం ఫ్యామిలీ వైసీపీలో చేరింది. ఇప్పుడు మళ్లీ అద్దంకి నియోజకవర్గంలో షరా మామూలుగా మారింది.

కోట్లతో కేఈ ఫ్యామిలీ…..

మరో పగలు, సెగలు కక్కు కుటుంబాలు కేఈ, కోట్ల. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు వీరిద్దరినీ ఒకటి చేశారు. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి కర్నూలు ఎంపీటిక్కెట్ ఇచ్చారు. కేఈ ఫ్యామిలీకి కూడా ప్రాధాన్యత ఇచ్చారు. రెండు కుటుంబాలు ఎన్నికల్లో ఓటమి పాలయ్యాయి. అయితే ప్రస్తుతానికి వీరిద్దరూ ఒకటిగానే ఉంటున్నా పెద్దగా సఖ్యత ఏమీ లేదంటున్నారు. కుటుంబాలు ఒక్కటైనా క్యాడర్ మాత్రం ఏకం కాకపోవడం వల్లనే ఓటమి తప్పలేదంటున్నారు. చంద్రబాబు చేసిిన ప్రయోగంలో ఈ కుటుంబం మాత్రమే ఇంకా పార్టీలో కొనసాగుతుండటం విశేషం. అయితే తాజాగా కేఈ ప్రభాకర్ పార్టీకి రాజీనామా చేశారు. కర్నూలు కార్పొరేషన్ ఎన్నికల్లో కోట్ల వర్గీయులకు సీట్లు ఎక్కువగా ఇచ్చారని ఆయన పార్టీకి రాజీనామా చేశారు. కేఈ కృష్ణమూర్తి రాజకీయాల నుంచి తప్పుకున్నారు. కేఈ ప్రభాకర్ పార్టీని వీడటంతో ఇది కూడా విఫలమయినట్లేనని చెబుతున్నారు.

Tags:    

Similar News