సీన్ ముందే తెలిసిపోయిందా? అందుకే ఈ హైరానానా?

జగన్ కి ఒక్క ఛాన్సే, గుర్తు పెట్టుకోండి. మళ్ళీ నెత్తికెక్కించుకోకండి. లోకల్ బాడీ ఎన్నికల్లో చంద్రబాబు చేస్తున్న ప్రచారం ఇది. ఒక్క ఛాన్స్ ఇస్తేనే రాష్ట్రాన్ని సర్వనాశనం [more]

Update: 2020-03-12 11:00 GMT

జగన్ కి ఒక్క ఛాన్సే, గుర్తు పెట్టుకోండి. మళ్ళీ నెత్తికెక్కించుకోకండి. లోకల్ బాడీ ఎన్నికల్లో చంద్రబాబు చేస్తున్న ప్రచారం ఇది. ఒక్క ఛాన్స్ ఇస్తేనే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు, లోకల్ బాడీలో తొంబై శాతం సీట్లు ఇస్తే ఇక వీళ్ళను పట్టగలమా. అందుకే ఆవేదనతో వేడుకుంటున్నా. ఇదీ చంద్రబాబు లోకల్ ఫైట్. నిజంగా దీన్ని చూసిన వారికి చంద్రబాబు ఫైట్ చేస్తున్నారా లేక నిర్వేదంలో ఉన్నారా అన్నది అర్ధం కాని పరిస్థితి. అన్నీ సీట్లూ గెలుచుకుని ఏం చేస్తారు అంటూ వైసీపీ నేతలను అమాయకంగా ప్రశ్నిస్తున్నారు. బెదిరించి గెలుచుకుంటారా. మాకు ఇన్ని తెలివితేటలు లేవా. అధికారంలో ఉన్నపుడు మేము చేయలేకనా, ఇలా ఉక్రోషంతో చంద్రబాబు వైసీపీ మీద ధ్వజమెత్తుతున్నారు.

ఒప్పేసుకుంటున్నారా?

వైసీపీ భయపెడుతోంది. బెదిరిస్తోంది. అధికార యంత్రాంగం మొత్తం దుర్వినియోగం చేస్తోంది. ఎన్నికలు కావు ఇవి. ఒక ఫార్స్. ఒక ప్రహసనం, ఇలాంటి ఎన్నికలను నా జీవితంలో అసలు చూడలేదు. ఇదేనా ప్రజాస్వామ్యం, ప్రజలకు ఓట్లు వేయాలని ఉండదా, ఏకగ్రీవాలేంటి. ఇలా సాగుతోంది చంద్రబాబు గారి ఆక్రోశం. ఇదంతా ఎపుడు చెబుతారు, ప్రత్యర్ధి మీద ఎపుడు కస్సుబుస్సులాడుతారు. ఏం చేయలేమనుకున్నపుడు. ఏం చేసినా అడ్డుకోలేనని భావించినపుడు. టీడీపీ ఇపుడు ఆ విధమైన పరిస్థితి ఉందా?

ప్రజలదే బాధ్యతట….

ఎన్నికల్లో అక్రమాలకు వైసీపీ సర్కార్ పాల్పడుతోంది, ఆ పార్టీ నేతలు దౌర్జన్యాలకు దిగుతున్నారు, ఎక్కడికక్కడ టీడీపీని అడ్డుకుంటున్నారు. ఇలా ఉంది చంద్రబాబు గారి బాధ. ఇంకా ఎన్నికలే మొదలుకాలేదు, పెద్ద ఆరోపణలకు టీడీపీ దిగిపోతోంది, చంద్రబాబు బండలు వేస్తున్నారు. సాధారణంగా ఎన్నికలు అయిపోయి పోలింగ్ సరళి చూశాక నేతల వెంట రావాల్సిన మాటలు ఇవి. ముందే ఇలా చంద్రబాబు మాట్లాడుతున్నారంటే ఆయన సర్వేలు పచ్చి నిజం, మింగలేని చేదు నిజం చెబుతున్నట్లుగానే లెక్క. మరో వైపు ప్రజలే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరడం ద్వారా సీన్ నుంచి తమకు తాము తప్పుకుంటున్నట్లుగా చంద్రబాబు చెబుతున్నట్లుగా ఉంది.

తమ్ముళ్ళకూ….

ప్రతీ చోటా తమ్ముళ్ళు పోటీ చేయాలి, ఎవరూ ఇంట్లో కూర్చోవద్దు, విత్ డ్రాలు అసలు చేయవద్దు. తుదివరకూ పోరులో ఉండండని కూడా చంద్రబాబు తమ్ముళ్ళకు పిలుపు ఇస్తున్నారు. అలా ఎవరైనా పోటీ చేయకుండా ఉంటే వారిని అసమర్ధులుగా గా భావిస్తామని ఆయన హెచ్చరిస్తున్నారు. ఓ వైపు బేలతనంలో అధినేత మాట్లాడుతూ మరో వైపు తమ్ముళ్ళ మీద తప్పు తోస్తున్నారని ఆ పార్టీలోనే చర్చ సాగుతోంది. ఎన్నికలు అంటే అన్నీ ఉంటాయి. ఎపుడు ఎన్నికలు సజావుగా సాగాయి. అధికార పార్టీ అన్న తరువాత ఆ మొగ్గు ఉంటుంది. జనం పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తే ఏమో కానీ లేకపోతే లోకల్ బాడీ ఎన్నికల్లో అధికార పార్టీయే విధిగా గెలుస్తుంది. ఇపుడు చంద్రబాబు చెబుతున్న సుద్దులు, తీస్తున్న దీర్ఘాలు చూస్తే ఓటమిని ముందే అంగీకరించారనుకోవాలేమో. లేకపోతే ఒక్క ఛాన్స్ ఇచ్చారు జగన్ కి మళ్ళీ ఇవ్వవద్దు అని అడ్డం పడడం ఎందుకు. జనాలు మళ్ళీ మళ్ళీ జగన్ కే ఓటేస్తున్నారని చంద్రబాబుకు ముందే తెలిసిపోతోందా. పసుపు పార్టీ హైరానా చూస్తే అదే నిజమనిపిస్తోంది.

Tags:    

Similar News