యుద్ధం మొదలవ్వకముందే దెబ్బ పడిందా?

చంద్రబాబు టీడీపీ ప్రెసిడెంట్ అయ్యాక మైనారిటీ వర్గాలు పూర్తిగా మద్దతు ఇవ్వడం మానుకున్నాయి. అంతకు ముందు అన్న నందమూరికి మైనారిటీలలో ఉన్న ఆదరణ చంద్రబాబు నేత్రుత్వంలో లేదనే [more]

Update: 2020-03-12 05:00 GMT

చంద్రబాబు టీడీపీ ప్రెసిడెంట్ అయ్యాక మైనారిటీ వర్గాలు పూర్తిగా మద్దతు ఇవ్వడం మానుకున్నాయి. అంతకు ముందు అన్న నందమూరికి మైనారిటీలలో ఉన్న ఆదరణ చంద్రబాబు నేత్రుత్వంలో లేదనే చెప్పాలి. దానికి తోడు చంద్రబాబు పదే పదే బీజేపీతో పొత్తులు పెట్టుకోవడం, ఓట్ల రాజకీయం కోసం ఏమైనా చేయాలనుకోవడం వంటివి చూసిన మైనారిటీలలోని పెద్ద సెక్షన్ ఎపుడూ దూరంగానే ఉండిపోయింది. ఇదిలా ఉండగా ఉన్న మైనారిటీలను కూడా దూరం చేసుకోవడంలో చంద్రబాబు చేయాల్సినదంతా చేస్తున్నారు. ఇక వైఎస్సార్, జగన్ ఈ ఇద్దరు నాయకులు ఏపీ రాజకీయాల్లో బలమైన శక్తులుగా మారాక మైనారిటీలు పెద్ద ఎత్తున అటువైపుగా మళ్ళిపోయారు. కాంగ్రెస్ పునాదులు దాదాపుగా కదిలించేసిన జగన్ ఆ ఓటు బ్యాంకుని కూడా తనవైపు తిప్పుకున్నాడు. దీంతో ముస్లిం మైనారిటీ వర్గం ఇపుడు వైసీపీకి పెద్ద దన్నుగా ఉంది.

చెప్పుకోవడానికేరీ….?

ఇక మరో వైపు చంద్రబాబు వైపు ఉన్న పెద్ద ముస్లిం నాయకులలో కోస్తా జిల్లాకు చెందిన లాల్ జాన్ భాషా రోడ్డు ప్రమాదంలో మరణించాక చంద్రబాబుకు ఆ వైపున గట్టిగా చెప్పుకునే నేత లేకుండా పోయారు. అదే టైంలో రాయలసీమ నుంచి ఎస్ ఎం ఫరూక్, గోదావరి జిల్లాల నుంచి శాసనమండలి చైర్మన్ షరీఫ్, ఉత్తరాంధ్రా జిల్లాల నుంచి మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత డాక్టర్ ఎస్ ఎ రహమాన్ వంటి వారు కనిపించారు. ఇపుడు వారు సైతం చంద్రబాబు పోకడలతో విసుగెత్తారని అంటున్నారు. అందరిలో ముందుగా విశాఖ జిల్లాకు చెందిన ఎస్ ఎ రహమాన్ టీడీపీని వీడి వైసీపీ బాట పట్టడం చంద్రబాబుకు గట్టి షాక్ అని చెప్పాలి.

జగనే కరెక్ట్ …..

మైనారిటీల హక్కులను పరిరక్షించడంలో జగన్ కరెక్ట్ అని ఎస్ ఎ రహమాన్ అంటున్నారు. జగన్ మైనారిటీ పక్షపాతి అని ఆయన కితాబు ఇస్తున్నారు. తాను నమ్మిన వారి కోసం ఎందాకైనా వెళ్ళి వారి హక్కులను కాపాడే సత్తా జగన్ కే ఉందని అంటున్నారు. చంద్రబాబుది రెండు నాలుకల ధోరణి అని, ఆయనకు రాజకీయమే ముఖ్యం తప్ప మరేమీ కాదని కూడా ఎండగట్టేశారు. బాబు జాతకం మొత్తం తన దగ్గర ఉందని చెబుతున్న రహమాన్ వైసీపీలో చేరడం ద్వారా ఆ పార్టీకి అతి పెద్ద ఆయుధంగా మారుతున్నారు.

భారీ దెబ్బ….

ఏపీలోనే అతి పెద్ద నగరంగా ఉన్న విశాఖలో జీవీ ఎంసీ ఎన్నికలు జరుగుతున్నాయి. మేయర్ పీఠాన్ని గెలుచుకోవడం టీడీపీ కల, మూడున్నర దశాబ్దాలుగా ఆ పీఠం టీడీపీకి దక్కడంలేదు. ఇపుడు కూడా మరోసారి జారిపోయేలా కనిపిస్తోంది. దానికి నాందిగా టీడీపీలో ఉన్న ఉత్తరాంధ్రా జిల్లాల ముస్లిం మైనారిటీ అసోసియేషన్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్ ఎ రహమాన్ టైం చూసి మరీ వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. జగన్ సమక్షంలో ఆయన పార్టీలో చేరిపోయారు. విశాఖతో పాటు ఉత్తరాంధ్రా జిల్లాలలో ముస్లిం మైనారిటీ వర్గాలలో పూర్తి పలుకుబడి కలిగిన నేతగా రహమాన్ ఉన్నారు. ఇక రహమాన్ వంటి బడా మైనారిటీ నాయడు రాకతో ఆయా వర్గాలన్నీ వైసీపీ వైపుగా కదిలే అవకాశాలు ఉన్నాయి. టీడీపీ సిటీ ప్రెసిడెంట్ గా కూడా రహమాన్ పనిచేశారు. దాంతో ఆయనతో పాటు మరింతమంది వైసీపీ వైపుగా జరుగుతాయని అంటున్న్నారు. ఓ విధంగా అసలు యుధ్ధం మొదలుకాకముందే చంద్రబాబు కి పెద్ద దెబ్బ పడిందని అంటున్నారు.

Tags:    

Similar News