పూర్తిగా మార్చేయాలని డిసైడ్ అయ్యారా?

తెలంగాణ టీడీపీకి ఇక సరైన నాయకత్వం లేనట్లే కన్పిస్తుంది. ప్రస్తుత అధ్కక్షుడు ఎల్ రమణ నాయకత్వం పట్ల కూడా చంద్రబాబు సంతృప్తికరంగా లేరు. ఇదే విషయాన్ని చంద్రబాబు [more]

Update: 2020-03-11 09:30 GMT

తెలంగాణ టీడీపీకి ఇక సరైన నాయకత్వం లేనట్లే కన్పిస్తుంది. ప్రస్తుత అధ్కక్షుడు ఎల్ రమణ నాయకత్వం పట్ల కూడా చంద్రబాబు సంతృప్తికరంగా లేరు. ఇదే విషయాన్ని చంద్రబాబు ఎల్.రమణ ఎదుటే చెప్పడంతో ఆయన రాజీనామాకు సిద్ధపడినట్లు సమాచారం. అయితే కొత్త అధ్యక్షుడు వచ్చేంత వరకూ బాధ్యతలను చూడాలని చంద్రబాబు ఎల్.రమణను కోరినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ టీడీపీకి నూతన జవసత్వాలు తేవాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు.

వారంలో ఒకరోజు….

వారంలో ఒక రోజు తెలంగాణ టీడీపీకి కేటాయిస్తున్నారు. ముఖ్యనేతలను కలుసుకుంటున్న చంద్రబాబు వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే తెలంగాణ ప్రస్తుత అధ్యక్షుడు ఎల్.రమణపై అనేక మంది చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఎల్.రమణ అసలు పార్టీ కార్యక్రమాలను పట్టించుకోవడం లేదని, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు కూడా చంద్రబాబు వచ్చిన రోజే వస్తారని కొందరు ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు.

తొలుత స్ట్రాంగ్ గా ఉన్నా…..

2014 ఎన్నికల తర్వాత కూడా తెలంగాణలో కొంత స్ట్రాంగ్ గా కన్పించిన తెలుగుదేశం ఆ తర్వాత క్రమంగా బలహీన పడుతూ వస్తుంది. టీఆర్ఎస్ పూర్తిగా బలపడటంతో అనేక మంది నేతలు టీఆర్ఎస్ తో పాటు ఇతర పార్టీల కండువాను కప్పేసుకున్నారు. పార్టీలో తొలి నుంచి ఉన్న నేతలు సయితం పార్టీని వీడారు. దీంతో క్యాడర్ ఉందిలే అన్న ధైర్యంతో ఉన్న కొద్ది మంది నేతలకూ ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటీకి దిగకపోవడంతో వారు కూడా జెండాను పక్కన పడేసి వెళ్లిపోయారు.

నాయకత్వం విఫలం కారణంగానే….

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల చెంతకు వెళ్లడంలో ఇక్కడి నాయకత్వం పూర్తిగా విఫలమయిందని చంద్రబాబు భావిస్తున్నారు. ఏపీలో విపక్షాలపై కక్ష సాధింపులు చేపడుతున్నా ఒంటరిగా టీడీపీ పోరాడుతున్న వైనాన్ని ఇక్కడి నేతలకు గుర్తు చేశారు. ఇక్కడ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగడం లేదని, అయినా పార్టీ నాయకత్వం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకపోవడాన్ని చంద్రబాబు తప్పు పట్టారు. దీంతో పార్టీ నాయకత్వాన్ని మార్చాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడుతున్నారు. మేలో జరిగే మహానాడు సమయానికి తెలంగాణ పార్టీ నాయకత్వాన్ని మార్చేసే అవకాశముంది.

Tags:    

Similar News