అదే నిజ‌మైతే.. తొమ్మిది మాసాల్లోనే అక్కడ వ్యతిరేక‌త వ‌చ్చిందా..?

విశాఖ ప‌ర్యట‌న‌కు వెళ్లిన చంద్రబాబుకు తీవ్ర ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఎదురైంది. అక్కడ విమానాశ్ర‌యానికి ఆయ‌న చేరుకోగ‌లిగినా.. త‌ర్వాత అక్కడి నుంచి ఆయ‌న అడుగు కూడా బ‌య‌ట‌కు పెట్టలేక [more]

Update: 2020-03-07 09:30 GMT

విశాఖ ప‌ర్యట‌న‌కు వెళ్లిన చంద్రబాబుకు తీవ్ర ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఎదురైంది. అక్కడ విమానాశ్ర‌యానికి ఆయ‌న చేరుకోగ‌లిగినా.. త‌ర్వాత అక్కడి నుంచి ఆయ‌న అడుగు కూడా బ‌య‌ట‌కు పెట్టలేక పోయారు. ప్రజాగ్రహం నేప‌థ్యంలో చంద్రబాబునే అక్కడి పోలీసులు వెన‌క్కి తిప్పి పంపారు. అయితే, ఈ ప‌రిణామంపై చంద్రబాబు కోణం చంద్రబాబుకు ఉంటే.. అధికార ప‌క్షం వైసీపీ కోణం వైసీపీకి ఉంది. కానీ, ఈ మ‌ధ్యలో మ‌రో కోణం తెర‌మీదికి వ‌చ్చింది. అది చంద్రబాబును ఒకింత ఇబ్బందికి గురిచేసేదే కావ‌డం గ‌మ‌నార్హం. అదేంటంటే.. చంద్రబాబు టీడీపీ నేతల వాద‌న ప్రకారం.. వైసీపీ నాయ‌కులు, కార్యక‌ర్తలు చంద్రబాబును విమానాశ్రయం వ‌ద్ద అడ్డుకున్నారు.

వైసీపీ కార్యకర్తలే…

ఈ క్రమంలో వైసీపీ నాయ‌కులు భారీ ఎత్తున ప్రజ‌ల‌ను డ‌బ్బులు, మందు, చికెన్ బిర్యానీ వంటివి పెట్టి ఈ కార్యక్రమానికి తీసుకువ‌చ్చారు. అందుకే చంద్రబాబు వెన‌క్కి వ‌చ్చారు. ఈ విష‌యంలో వైసీపీ నేత‌ల‌దే త‌ప్పని టీడీపీ చెబుతోంది. అయితే, ఇక్కడే కీల‌క విష‌యాన్ని వారు మ‌రిచిపోతున్నారు. టీడీపీ చెబుతున్నట్టు చంద్రబాబు కార్యక్రమానికి అడ్డుత‌గిలింది.. విశాఖ ఉత్తర నియోజకవర్గం ప్రజ‌లే. ఈ నియోజ‌క‌వ ర్గంలోని 13 వార్డుల నుంచి వార్డుకు 50 మంది చొప్పున అంటే.. 800 మంది(ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుంది) వ‌చ్చారు. అదేవిధంగా విశాఖ తూర్పు నియోక‌వ‌ర్గం నుంచి వార్డుకు 50 మంది మ‌హిళ‌లు వీరు కూడా 800 మంది ఉన్నార‌ని టీడీపీ ఆరోపించింది.

రెండు నియోజకవర్గాల నుంచే….

అంతేకాదు, బిర్యానీ పొట్లాలు పంచుతున్నారంటూ.. టీడీపీ అనుకూల మీడియాలో ఫొటోలు కూడా వ‌చ్చా యి. ఇదే నిజ‌మ‌ని అనుకుంటే.. ఈ రెండు నియోజ‌వ‌క‌ర్గాల్లోనూ గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీ విజ‌యం సాధించింది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ హ‌వా ఉన్నప్పటికీ విశాఖ‌లో నాలుగు స్థానాల‌ను సైకిల్ ఎక్కించుకుంది. మ‌రి ఇంత‌లోనే ఓ రెండు నియోజ‌క‌వ‌ర్గాల నుంచి 1600 మంది మ‌హిళ‌లు టీడీపీపై వ్యతిరేక చూపార‌ని, అది కూడా చంద్రబాబుపై కోడిగుడ్లు, ట‌మాటాలు వేసేందుకు రెడీ అయ్యార‌ని అనుకోవాల్సి ఉంటుంది. నిజానికి ఆ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ టీడీపీకి కీల‌క‌మైన నాయ‌కులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు.

బాబును వ్యతిరేకించింది….

వారి మాట కూడా కాద‌ని మ‌హిళ‌లు చంద్రబాబును వ్యతిరేకించేందుకు విమానాశ్రయానికి వ‌చ్చి కోడిగుడ్లు, నిర‌స‌న బ్యాన‌ర్లు చేత ప‌ట్టుకున్నారంటే.. ఇదేదో ఆలోచించాల్సిన విష‌య‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎన్నిక‌లు జ‌రిగి ప‌ది మాసాలు కూడా కాకుండానే ఇంత‌లా వ్యతిరేక‌త వ‌చ్చిందంటే.. టీడీపీ నేత‌ల్లో దౌర్బల్యమైనా కార‌ణం అయి ఉండాలి. లేదా విశాఖ‌ను రాజ‌ధానిగా వ్యతిరేకిస్తున్న చంద్రబాబుపై ఆగ్రహ‌మైనా కార‌ణం అయి ఉండాలి. నిన్న నే ఓటేసి గెలిపించిన ప్రజ‌లు ఇప్పుడు టీడీపీని వ‌ద్దనుకునే స్థాయికి వ‌చ్చారంటే.. ఇది నిజంగా అంత‌ర్మథ‌నం చేసుకోవాల్సిన త‌రుణం అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.

Tags:    

Similar News