ఆయింట్ మెంట్ పూస్తే చాలా? చికిత్స లేదా?

చంద్రబాబు కి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూసుకోవడానికి సమయం చాలడం లేదు. గతంలో ఏపీ ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్న కారణంగా చంద్రబాబు కి తెలంగాణ లో పార్టీ పరిస్థితిని [more]

Update: 2020-03-01 11:00 GMT

చంద్రబాబు కి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూసుకోవడానికి సమయం చాలడం లేదు. గతంలో ఏపీ ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్న కారణంగా చంద్రబాబు కి తెలంగాణ లో పార్టీ పరిస్థితిని మెరుగుపరుచుకునేంత తీరిక లేకుండా పోయింది. ఎలాగైనా ఏపీ లో తిరిగి అధికారంలోకి వస్తే అప్పుడు టిటిడిపి సంగతి చూద్దాం లే అనుకున్న చంద్రబాబు కి వైసిపి పెద్ద షాక్ ఇచ్చేసింది. అఖండ మెజారిటీ తో అధికారంలోకి వచ్చేసి ఆయన అన్ని ఆశలపై నీళ్ళు చల్లేసింది ఫ్యాన్ పార్టీ. దాంతో ఇక రెండు తెలుగురాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీని పటిష్టం చేసే ఛాన్స్ లభించింది అనుకున్న దశలో చంద్రబాబు డ్రీమ్ ప్రాజెక్ట్ అమరావతి రాజధాని ప్రాజెక్ట్ ను జగన్ సర్కార్ ముక్కలు చేసేసింది.

చేతులు కట్టేసిన అమరావతి …

జగన్ మూడు రాజధానుల ప్రకటన నాటినుంచి చంద్రబాబు కి ఎక్కడికి కదలలేని వాతావరణం లేకుండా పోయింది. రెండున్ననర నెలలుగా ఆయన అమరావతి ఉద్యమానికి ముందు, వెనుక అన్ని తానై చూసుకోవాలిసి వస్తుంది. దీంతో బాటు అమరావతి కి మద్దతుగా 13 జిల్లాలు మద్దతు సేకరించే పనిలో తలమునకలైపోయారు చంద్రబాబు. ఈ క్రమంలోనే చంద్రబాబు విశాఖ వెళ్లడం అక్కడ పోలీసులు ఆయన్ను హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కించడంతో తెలంగాణ లో పార్టీ పరిస్థితి మీద దృష్టి పెట్టే తీరిక లభించింది. ఈ నేపథ్యంలో ఎలాగూ హైదరాబాద్ లో ఖాళీగా ఉండటం దేనికని టి టిడిపి తో కీలక భేటీ ఏర్పాటు చేసి పార్టీలో ఉన్నదెవరు పోయినవారు ఎవరో ఒకసారి తలకాయలు లెక్కపెట్టేశారు చంద్రబాబు. ఇక మీడియా లో మాత్రమే కాకుండా ప్రజల్లో తిరగండి తమ్ముళ్ళు అంటూ దిశా నిర్దేశం చేసేసారు.

పటిష్ట నాయకులు ఏరి …?

తెలంగాణ రాష్ట్ర సమితి హవా ఎంత ఉన్నా ఓటుకు నోటుకు కేసుకు ముందు వరకు తెలుగుదేశానికి బలమైన క్యాడర్ పెట్టని కోటగా ఉండేది. అయితే ఓటుకు నోటు తరువాత బాబు దుకాణం సర్దేసి అమరావతి కి మకాం మార్చడం నుంచి టిటిడిపి కి వరుస కష్టాలు మొదలు అయిపోయాయి. ఆ తరువాత గులాబీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి, బిజెపికి బలమైన నేతలు తరలిపోవడంతో టిడిపి బలహీనపడుతూ వచ్చింది. ఎపి లో ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం టి టిడిపి కి ఆర్ధిక లోటు లేకుండా చంద్రబాబు చూసుకోవడంతో పార్టీ ఉనికి ఎంతోకొంత వుంటూ వచ్చేది.

పార్టీ ఓటమి తర్వాత….

అయితే గత ఏడాది పార్టీ ఘోర ఓటమి తరువాత తెలంగాణ శాఖకు నిధుల ప్రవాహం కూడా తగ్గుముఖం పట్టిందని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. దాంతో మరింత నీరసంగానే పార్టీ కార్యక్రమాలు కిందిస్థాయికి పడిపోయాయి అంటున్నారు. ఈ నేపథ్యంలో తమ పార్టీ అనుకూల మీడియా ల్లో వున్న అతికొద్దిమంది మౌత్ పీస్ లు గా వుంటూ కాలం నెట్టుకొస్తున్నారు. తెలంగాణ లో పార్టీ బలహీనపడటానికి ప్రధాన కారణం చంద్రబాబే నని ఆయన తమపై ఆ నిందలు వేయడం దేనికని అంతర్గతంగా మధన పడుతున్నారు. తమ్ముళ్ళ ఆవేదన అధినేతకు అర్ధం అయినా తన మోటివేషన్ క్లాస్ లో ఇవేమి ప్రస్తావించకుండా పై పై ఆయింట్ మెంట్ పూసి మమ అనేశారు చంద్రబాబు.ఈ నేపథ్యంలో టి టిడిపి గాయాలు తగ్గుతాయా రేగుతాయా అన్నది కాలమే తేల్చాలి.

Tags:    

Similar News