సైకిల్ రిపేర్ల కోసం…?

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఓడిన చోటనే గెలుపు కోసం వెతుక్కోవాలనుకుంటున్నారు. అందుకోసం జిల్లా టూర్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తూర్పు గోదావరి జిల్లాతో పర్యటనలు [more]

Update: 2019-10-04 12:30 GMT

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఓడిన చోటనే గెలుపు కోసం వెతుక్కోవాలనుకుంటున్నారు. అందుకోసం జిల్లా టూర్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తూర్పు గోదావరి జిల్లాతో పర్యటనలు మొదలుపెట్టిన బాబు విశాఖ జిల్లాలో అక్టోబర్లో పర్యటిస్తారని పార్టీ వర్గాల భోగట్టా. విశాఖ వంటి పెద్ద జిల్లా, టీడీపీకి కంచుకోటగా ఉన్న ప్రాంతంలో సైకిల్ కి అలా ఇలా దెబ్బలు పడలేదు. మొత్తం 15 అసెంబ్లీ సీట్లు ఉంటే అందులో కేవలం నాలుగు సీట్లు మాత్రమే ఆ పార్టీకి దక్కాయి. అలాగే మూడు ఎంపీ సీట్లు కూడా వైసీపీ పరం అయ్యాయి. దాంతో విశాఖ జిల్లాలో టీడీపీ పరిస్థితిని చక్కదిద్ది స్థానిక ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు చంద్రబాబు ఈ టూర్ పెట్టుకున్నారని అంటున్నారు.

సమీక్షలే సమీక్షలు….

ఇక చంద్రబాబు తన పాత పద్ధతిలో ప్రతీ నియోజకవర్గంలో సమీక్షలు నిర్వహిస్తారని అంటున్నారు. రెండు రోజుల పాటు విశాఖలో బస చేయనున్న చంద్రబాబు గ్రౌండ్ లెవెల్ రిపోర్టుల కోసం చంద్రబాబు ప్రయత్నం చేస్తారట. పార్టీ ప్రస్తుతం ఎలా ఉంది. నాయకులు ఎంతవరకూ రీఛార్జి అయ్యారు. ఓటమి నుంచి ఇంకా బయటకు రానివారెవరు అన్న అంశాలతో పాటు అసలు పార్టీలో ఎంతమంది ఉంటారు, ఎంతమంది వెళ్తారు అన్నది కూడా చంద్రబాబు పర్యటన ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారుట. మొత్తం పదిహేను అసెంబ్లీ, మూడు పార్లమెంటు నియోజకవర్గాల్లో పూర్తిస్థాయిలో సమీక్షలు ఉంటాయని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ నాయకులు తప్పనిసరిగా హాజరుకావాలని ఇప్పటికే అందరికీ సందేశాలు వెళ్లాయి.

గంటా బ్యాచ్ వైఖరి తేలుతుందా?

ఇక పార్టీ ఓడిన దగ్గర నుంచి కనీసం పార్టీ ఆఫీస్ ముఖం చూడకుండా గడుపుతున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైఖరి ఏంటన్నది కూడా చంద్రబాబు పర్యటనలో తేలుతుందని అంటున్నారు. అదే సమయంలో ఆయన వర్గంగా ఉన్న వారి కధ కూడా తెలుస్తుందని ప్రత్యర్ధి వర్గం అంటోంది. నిజానికి గంటా పార్టీకి అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు. ఆయన కనుక చంద్రబాబు మీటింగులకు వస్తే కొన్నాళ్ల పాటైనా టీడీపీలో ఉంటారని భావించాలని, అలా కాకుండా డుమ్మా కొడితే మాత్రం టీడీపీకి డేంజర్ బెల్స్ మోగినట్లేనని కూడా రాజకీఎయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా చినబాబు విశాఖ టూర్ వేస్తే స్వయంగా అయ్యన్న పాత్రుడు తమ్ముడు పార్టీని వీడిపోయారు. ఇపుడు పెదబాబు చంద్రబాబు వస్తే ఎంతమంది ఏరు దాటేస్తారో అన్న కంగారు కూడా పసుపు శిబిరంలో ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News