గొప్పల‌కు పోయిన త‌మ్ముళ్లు.. గోతిలో ప‌డ్డారా?

ఉట్టికి ఎగ‌ర‌లేన‌మ్మ స్వర్గానికి ఎగురుతుంద‌ని తాము చెబితే న‌మ్మి తీరాల‌ని అంటున్నారు టీడీపీ నాయ‌కులు. నిజానికి 23 మంది ఎమ్మెల్యేల‌ను మాత్రమే గెలిపించుకుని, వారిలోనూ ఇద్దరిని పోగొట్టుకుని [more]

Update: 2020-03-04 03:30 GMT

ఉట్టికి ఎగ‌ర‌లేన‌మ్మ స్వర్గానికి ఎగురుతుంద‌ని తాము చెబితే న‌మ్మి తీరాల‌ని అంటున్నారు టీడీపీ నాయ‌కులు. నిజానికి 23 మంది ఎమ్మెల్యేల‌ను మాత్రమే గెలిపించుకుని, వారిలోనూ ఇద్దరిని పోగొట్టుకుని అల‌మ‌టి స్తున్నది టీడీపీ కాక‌పోయి ఉంటే.. ఎలా ఉండేది ? అనే విష‌యాన్ని ప‌క్కన పెట్టి భారీ ఎత్తున వ్యాఖ్యలు సంధిస్తున్నారు. త‌మ నాయ‌కుడు చంద్రబాబును ప్రజ‌లు ప‌క్కన పెట్టిన విష‌యాన్ని త‌మ్ముళ్లు పూర్తిగా మ‌రిచి పోయిన‌ట్టు క‌నిపిస్తోంది. ఇంకా చంద్రబాబును వారు హైప్ చేసుకునేందుకు ప్రయ‌త్నిస్తూనే ఉన్నారు.

ట్రంప్ పర్యటనను కూడా…

ఈ క్రమంలోనే చంద్రబాబును పార్టీ సీనియ‌ర్లు, జూనియ‌ర్లు కూడా వివిధ రూపాల్లో కొనియాడుతున్నారు. మా చంద్రబాబే సీఎంగా ఉండి ఉంటేనా ?.. అంటూ స్వోత్కర్షల‌కు తెర‌దీశారు. ఈ క్రమంలో తాజాగా దేశంలో జ‌రిగిన ప‌రిణామాల‌ను తెర‌మీదికి తెచ్చారు. అమెరికా అధినేత ట్రంప్ భార‌త్‌కు వచ్చారు. ఆయ‌న మూడు రాష్ట్రాల్లో సుడిగాలి ప‌ర్యట‌న చేశారు. ఢిల్లీ, యూపీ, గుజ‌రాత్‌ల్లో ఆయ‌న చ‌కాచ‌కా తిరిగి.. ప‌ర్యట‌న‌ను ముగించుకుని వెళ్లిపోయారు. అనుకున్న షెడ్యూల్ ప్రకారం అంతా ముగిసిపోయింది.

ఐదు నెలల క్రితమే….

అయితే, టీడీపీ నాయ‌కులు మాత్రం త‌మ చంద్రబాబు అధికారంలో ఉండి ఉంటే.. ట్రంప్‌ను ఏపీకి తెచ్చి ఉండేవార‌ని చెప్పుకొస్తున్నారు. కోత‌లు కోయ‌డానికి కూడా ఓ హ‌ద్దు ఉంటుంద‌నే విష‌యాన్ని ఈ నాయ‌కులు మ‌రిచి పోతుండ‌డ‌మే వివాదానికి, వ్యంగ్యాస్త్రాల‌కు కూడా కార‌ణ‌మ‌వుతోంది. ట్రంప్ షెడ్యూల్ దాదాపు 5 నెల‌ల కింద‌టే నిర్ణయం అయిపోయింది. ఆయ‌న రెండు రోజుల ప‌ర్యట‌న ఐదు నెల‌ల కిందట మోడీ ప‌ర్యట‌న సంద‌ర్భంలోనే ఖ‌రారు చేసుకున్నారు. ఈ క్రమంలో లిమిటెడ్ గానే ఆయ‌న షెడ్యూల్ ఇచ్చారు. నిజానికి మోడీ స‌మ‌యం కేటాయించి ఉంటే.. క‌ర్ణాట‌క‌కు తీసుకురావాల‌ని అక్కడి బీజేపీ ప్రభుత్వం ప్ర‌యత్నించింది.

ఏం చూపించాలనో?

అయినా ఏపీకి తీసుకువ‌చ్చి ట్రంప్ కు చంద్రబాబు ఏం చూపిస్తారో నాయ‌కులు చెప్పాలి. ఇంకా మొద‌లే కాని అమ‌రావ‌తి, స‌గంలో ఆగిపోయిన పోల‌వ‌రం వంటివి చూపిస్తారా ? లేక విభ‌జ‌న హామీల‌ను నెర‌వేర్చుకోలేక పోయాం అని చెబుతారా ? ప్రత్యేక హోదాను వ‌దులుకున్నాం అని ఆయ‌న ముందు క‌న్నీరు పెట్టుకుంటారా ? ఏపీకి తీసుకువ‌చ్చి .. ఆయ‌న ముందు కూడా ఏపీ ప‌రువు దీస్తారా ? అని నెటిజ‌న్లు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి గొప్పల‌కు పోయిన త‌మ్ముళ్లు గోతిలో ప‌డ్డట్టుగా మారింది ప‌రిస్థితి.

Tags:    

Similar News