అభాసుపాలవుతున్నారే ?

చంద్రబాబు పేరుకు ముందు ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ అన్న విశేషణం ఉంటుంది. ఆయన తరచూ తన అనుభవాన్ని చాలా గొప్పగా చెప్పుకుంటారు. మరి ఇంతటి అనుభవశాలి మాటలలో, [more]

Update: 2020-02-27 06:30 GMT

చంద్రబాబు పేరుకు ముందు ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ అన్న విశేషణం ఉంటుంది. ఆయన తరచూ తన అనుభవాన్ని చాలా గొప్పగా చెప్పుకుంటారు. మరి ఇంతటి అనుభవశాలి మాటలలో, చేతలలో అవి మచ్చుకైనా కనిపిస్తున్నాయా అంటే సమాధానం డౌటే. చంద్రబాబు తనను జనం నమ్మలేదని ఇపుడు గట్టిగానే అనుకుంటున్నారు. అందుకే అనుకూల మీడియాని సాక్ష్యంగా ముందుకు తెస్తున్నారు. ఇపుడు వాటిని కూడా నమ్మడంలేదని జాతీయ మీడియాను తెస్తున్నారు. కానీ వారు రాసినా వీరు అచ్చేసినా కూడా అసలు నిజం జనాలకు పూర్తిగా తెలుస్తుందన్నది చంద్రబాబుకు అర్ధం కాకనే తరచూ అభాసుపాలు అవుతున్నారు.

క్రెడిబిలిటీ జీరో…..

ఇక చంద్రబాబుని వెనకేసుకురావడంలోనే అర్ధం, పరమార్ధాన్ని చూసుకుంటున్న అనుకూల మీడియా ఆ క్రమంలో పూర్తిగా తన క్రెడిబిలిటీని పోగోట్టుకోవడం విషాద‌పరిణామం. ఈ మీడియా పోటీలో ప్రత్యర్ధి వర్గాలు కూడా పరుగులు పెడుతూండడంతో అక్కడా రాజ‌కీయ విభజన జరిగిపోయింది. దాంతో ఏది నమ్మాలో తెలియక మొత్తం మీడియానే జనం అనుమానంగా చూస్తున్నా రోజులు వచ్చేశాయి. ఇక ఏపీలో చెడు జరిగిందని అనుకూల మీడియా నిజాలు వండి వార్చినా పట్టించుకోని స్థితిలో ప్రజలు పడిపోయారు. దాంతో జాతీయ మీడియా పేరిట హంగామాను టీడీపీ మొదలెట్టింది.

అదిగో పులి….

ఇది ఎలా ఉందంటే జాతీయ మీడియా పెద్దలు ఎక్కడో వేరే రాష్ట్రాల్లో ఉంటారు. వారు ఇంగ్లీష్ లో అచ్చేసిన దాన్ని తీసుకువచ్చి జనాల ముందు పెట్టి ఇదిగో వైసీపీ సర్కార్ ఇలా చేసిందంటూ రెచ్చిపోవడం చంద్రబాబుతో పాటు, తమ్ముళ్ళకూ అలవాటు అయిపోయింది. ఈ నేపధ్యంలో క్షేత్ర స్థాయిలో నిజాలు తెలియక జాతీయ మీడియా అల్లిన తప్పుల తడకలనే జనం ముందు పెట్టి పసుపు పార్టీ తమ్ముళ్ళు తరచూ అభాసుపాలవుతున్నారు. అందుకు మచ్చు తునకలు నిన్నటి కియా తరలింపు, విశాఖ రాజధానిపైన నేవీ అధికారుల అభ్యంతరాల వార్తలు.

నాలిక్కరచారా…?

రాయిటర్స్ అనే పేరు మోసిన జాతీయ మీడియా ఒకటి కియా పరిశ్రమ తమిళనాడుకు తరలిపోతోందని వార్త రాశారు. దాన్ని పట్టుకుని చంద్రబాబు అండ్ కో నానా యాగీ యధాప్రకారం చేశారు. తీరా ఇపుడు తాము ఎక్కడికీ తరలిపోవడం లేదని కియా స్వయంగా వివరణ ఇచ్చింది. తాము రాసిన దాని మీద రాయిటర్స్ వివరణ ఇచ్చుకుంది. దానో పసుపు శిబిరం సిగ్గు పోయినంత పనైంది. సరే అక్కడితో కధ ఆగలేదు తాజాగా విశాఖలో రుషికొండ వద్ద రాజధాని వద్దంటూ నేవీ అభ్యంతరం పెట్టిందని ఓ ఇంగ్లీష్ పత్రికలో కధనం వచ్చింది. దాన్ని పట్టుకుని మళ్ళీ టీడీపీ పెద్దలు వీరంగం వేశారు. తీరా చూస్తే తాము అలా ఏమీ అనలేదని, వైసీపీ సర్కార్ కి ఎటువంటి అభ్యంతరాలు పెట్టలేదని నేవీ అధికారికంగా గట్టి రిప్లై ఇచ్చింది. దాంతో మళ్ళీ తమ్ముళ్ళ గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. ఇలా జాతి మీడియాను దాటి జాతీయ మీడియాను కూడ ఎంత వాడుకోవాలని చూసినా ఎప్పటికపుడు కధ అడ్డం తిరుగుతోంది. అయినా తమ్ముళ్ళు తాము విశ్వసనీయతను కోల్పోవడమే కాదు, మీడియాను భ్రష్టు పట్టిస్తున్నారన్న నిందలు మోస్తున్నారు. ఇదే ఇలా కొనసాగితే ముందు ముందు నిజాలు రాసినా జనం అసలు పట్టించుకోరన్న సంగతి పచ్చ నేతలకు అర్ధమయ్యేదెపుడో.

Tags:    

Similar News