తేల్చుకోలేక…తేల్చలేక….?

రాష్ట్ర వ్యాప్తంగా ప‌లు జిల్లాల్లో నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇంచార్జుల‌ను నియ‌మించిన టీడీపీ అధినేత‌ చంద్రబాబు కొన్ని కీల‌క నియోజ‌క‌వ‌ర్గాలను మాత్రం పెండింగ్‌లో పెట్టడం సంచ‌ల‌నంగా మారింది. చంద్రబాబు పెండింగ్‌లో [more]

Update: 2020-02-26 05:00 GMT

రాష్ట్ర వ్యాప్తంగా ప‌లు జిల్లాల్లో నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇంచార్జుల‌ను నియ‌మించిన టీడీపీ అధినేత‌ చంద్రబాబు కొన్ని కీల‌క నియోజ‌క‌వ‌ర్గాలను మాత్రం పెండింగ్‌లో పెట్టడం సంచ‌ల‌నంగా మారింది. చంద్రబాబు పెండింగ్‌లో పెట్టిన నియోజ‌క‌వ‌ర్గాల్లో స‌త్తెన‌ప‌ల్లి కూడా ఉంది. కీల‌క‌మైన స‌త్తెన‌ప‌ల్లి విష‌యంలో మాత్రం నిర్ణయం తీసుకోలేక పోయారు. ఇక్కడ నుంచి 2014 ఎన్నికల్లో విజ‌యం సాధించిన కోడెల శివ‌ప్రసాద‌రావు న‌వ్యాంధ్ర తొలి స్పీక‌ర్‌గా ప‌నిచేశారు. 2019లో ఘోరంగా కోడెల అంబ‌టి రాంబాబు చేతిలో ఓడిపోయారు. అనంత‌రం ఆయ‌న‌పై జ‌గ‌న్ ప్రభుత్వం కేసులు పెట్టడం, టీడీపీ నుంచి ఆయ‌న‌కు మ‌ద్దతు ల‌భించ‌క‌పోవ‌డం ఈ నేప‌థ్యంలో మాన‌సికంగా కుంగిపోయిన కోడెల హైద‌రాబాద్‌లో ఆత్మహ‌త్యకు పాల్పడ్డారు.

రాయపాటి కోసం….

దీంతో స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో ఇంచార్జ్ సీటు ఖాళీగా ఉంది. ఈ నేప‌థ్యంలో ఇటీవ‌ల ప‌లు నియోజ‌క వర్గాల‌కు ఇంచార్జుల‌ను నియ‌మించిన చంద్రబాబు ఈ క్రమంలోనే స‌త్తెన‌ప‌ల్లికి కూడా ఇంచార్జ్‌ను నియమిస్తార‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ ఆయ‌న నిర్ణయం తీసుకోలేక పోయారు. నిజానికి ఈ నియోజ క‌వ‌ర్గం కోసం మాజీ ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు కుమారుడు రంగారావు ఎదురు చూస్తున్నారు. అయి తే, సిట్టింగ్ సీటైన దీనిని త‌మ‌కు కేటాయించ‌కుండా రాయ‌పాటికి కేటాయిస్తే.. కోడెల కుమారుడు శివ‌రామ్ ఫీల‌వుతాడ‌నేది చంద్రబాబు ఆలోచ‌న‌.

నరసరావుపేట కూడా….

ఈ రెండు కుటుంబాల‌ను స‌మ‌న్వయం చేయ‌డం అంత తేలిక‌కాదు. ఇరు వ‌ర్గాలు కూడా స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గాన్నే కోరుకుంటున్న నేప‌థ్యంలో ఎవ‌రిని కాద‌న్నప్పటికీ.. ఇబ్బంది త‌ప్పదు. పైగా టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే ఉన్న కోడెల రాజ‌కీయ వార‌సుడు శివ‌రాంను కాద‌ని రాయ‌పాటికి ఇస్తే ఇదేనా కోడెల కుటుంబానికి చంద్రబాబు ఇచ్చిన విలువ అనే ప్రశ్న ఎదురయ్యే అవ‌కాశం ఉంది. ఇదే టైంలో కోడెల పాత నియోజ‌క‌వ‌ర్గం అయిన న‌ర‌సారావుపేట‌లో ఇప్పటికే బీసీ అభ్యర్థికి ఛాన్స్ ఇచ్చినందున‌.. అక్కడ చ‌ద‌ల‌వాడ అర‌వింద‌బాబును త‌ప్పిస్తే మ‌ళ్లీ విమ‌ర్శలు వ‌చ్చే ఛాన్స్ ఉంది.

కోడెలకు ఇస్తే…..?

ఇక న‌ర‌సారావుపేట మాజీ ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు ఇక రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటోన్న నేప‌థ్యంలో ఆయ‌న వార‌సుడు సైతం స‌త్తెన‌ప‌ల్లి సీటుపై క‌న్నేశారు. స‌త్తెన‌ప‌ల్లి కోడెల వార‌సుడికి ఇస్తే రాయ‌పాటి కుటుంబం టీడీపీకి దూర‌మైన ఆశ్చర్యపోన‌క్కర్లేదు. ఈ నేప‌థ్యంలోనే చంద్రబాబు ఈ విష‌యంలో ఎటూ తేల్చలేక పోతున్నార‌ని అంటున్నారు. మొత్తంగా చూస్తే.. ఈ ఒక్కటి చంద్రబాబుకు కంట్లో న‌లుసుమాదిరిగా వేధిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఎప్పటికి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Tags:    

Similar News