వెర్రి ముదిరితే…?

అడిగేవాడు లేక‌పోతే స‌రి! అన్నట్టుగా ఉంది రాష్ట్రంలో టీడీపీ నాయ‌కుల ప‌రిస్థితి. అంతేకాదు, వారికి మ‌ద్ద తిస్తున్న కొన్ని మీడియా చానెళ్ల ప‌రిస్థితి కూడా అలానే ఉంది. [more]

Update: 2020-02-25 12:30 GMT

అడిగేవాడు లేక‌పోతే స‌రి! అన్నట్టుగా ఉంది రాష్ట్రంలో టీడీపీ నాయ‌కుల ప‌రిస్థితి. అంతేకాదు, వారికి మ‌ద్ద తిస్తున్న కొన్ని మీడియా చానెళ్ల ప‌రిస్థితి కూడా అలానే ఉంది. రెండో సారి కూడా తామే అధికారంలోకి రావాల‌ని టీడీపీ నాయ‌కులు భావించారు. అయితే, వారి ఊహ‌లను ప్రజ‌లు తిప్పికొట్టారు. దీంతో అధికారం కోల్పోయి.. ప్రజాక్షేత్రంలో ఎదురీదుతున్నారు. అఖండ మెజారిటీతో జ‌గ‌న్ త‌న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే, ఈ వాస్తవాన్ని మ‌రిచిపోయి పెడ‌బొబ్బలు పెడుతున్న టీడీపీ నాయ‌కులు ప్రజ‌ల‌కు ఏదో అన్యాయం జ‌రిగిపోతోంద‌ని విరుచుకుప‌డుతున్నారు.

దివాళా తీయించి…..

రాష్ట్రాన్ని దివాళా తీయించిన స్థితిలో వ్యవ‌హ‌రించిన చంద్రబాబు ఇప్పుడు రాష్ట్రంలో ఆర్థిక క‌ష్టాల్లో ఉంద‌ని క‌ల్లబొల్లి క‌బుర్లు చెబుతున్నారు. ఎన్నిక‌ల‌కు కేవ‌లం నెల రోజుల ముందు రెండు వేల కోట్ల రుణం అది కూడా హ‌ద్దులు మీరి తీసుకుని ఎవ‌రికి పంచారో ఆయ‌నే చెప్పాలి. అనుభ‌వ‌జ్ఞుడు అయి ఉంటే నేడు జ‌గ‌న్ అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌ను ఆయ‌నే ఎందుకు అమ‌లు చేయ‌లేక పోయారో ఆత్మ విమ‌ర్శ చేసుకోవాలి. ఐదు రూపాయ‌ల‌కు అన్నం పెట్టి పుసుపు-కుంకుమ‌లు పంచి ఓట్లు రాబ‌ట్టుకునేందుకు చంద్రబాబు చేయ‌ని జిమ్మిక్కులేద‌నే విష‌యం ప్రతి ఒక్క‌రికీ తెలిసిందే. అయితే, చంద్రబాబు ఇవ‌న్నీ మ‌రిచిపోయారు.

మోడీ జోక్యం చేసుకోవాలంటూ…..

తానేదో పెద్ద మేథావిన‌ని అంటూ ప్రస్తుతం రాష్ట్ర ప‌రిధిలో ఉన్న విష‌యాల‌పై, రాష్ట్రం చేతుల్లో ఉన్న విష‌యాల‌పై కేంద్రం జోక్యం చేసుకోవాల‌ని, ప్రధాని మోడీ నేరుగా జ‌గ‌న్‌ను తిట్టాల‌ని, రాష్ట్రంలో ఆయ‌న క‌నుస‌న్నల్లోనే పాల‌న జ‌ర‌గాల‌ని కోరుకోవ‌డం ఇంత క‌న్నా మ‌తిచెడిన నిర్ణయం ఉంటుందా? అంటున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా మాజీ ఎంపీ, గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో భీమిలి నుంచి పోటీ చేసి డిపాజిట్ కూడా ద‌క్కించుకోలేక పోయిన‌ స‌బ్బం హ‌రి స‌హా టీడీపీ మ‌ద్దతు దారులు ఇప్పుడు ఏపీలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై మోడీ జోక్యం చేసుకోవాల‌ని అంటున్నారు.

గతంలో ఇలా……

గ‌తంలో వీరే కేంద్రం ఎలా రాష్ట్ర విష‌యాల్లో జోక్యం చేసుకుంటుంద‌ని మీటింగులు పెట్టి విమ‌ర్శించారు. చంద్రబాబును విమ‌ర్శించే అర్హత మోడీకి లేద‌న్నారు. కానీ, ఇప్పుడు మాత్రం జ‌గ‌న్ ప్రభుత్వం విష‌యంలో మోడీ జోక్యం చేసుకోవాల‌ట‌. వెర్రిముదిరితే ఇలానే ఉంటుంద‌న్న విమ‌ర్శలు టీడీపీ నేత‌ల‌పై సాధార‌ణ జ‌నాలు, మీడియా, రాజ‌కీయ వ‌ర్గాల నుంచి జోరుగా వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News