ఏమీ లేని సమయంలో అందివచ్చాయా?

రాజ‌కీయంగా తాను వేసే ప్ర‌తి అడుగును ఆచితూచి వేస్తాన‌ని చెప్పుకొనే చంద్ర‌బాబుకు ఈ ద‌ఫా ఎన్నిక‌ల‌కు ముందు, ఎన్నిక‌ల్లోనూ జ‌రిగిన ప‌రాభ‌వం ఏ రేంజ్‌లో ఉందో తెలుస్తోంది. [more]

Update: 2019-09-22 05:00 GMT

రాజ‌కీయంగా తాను వేసే ప్ర‌తి అడుగును ఆచితూచి వేస్తాన‌ని చెప్పుకొనే చంద్ర‌బాబుకు ఈ ద‌ఫా ఎన్నిక‌ల‌కు ముందు, ఎన్నిక‌ల్లోనూ జ‌రిగిన ప‌రాభ‌వం ఏ రేంజ్‌లో ఉందో తెలుస్తోంది. అయితే, కింద‌ప‌డ్డా పైచేయి నాదే అనే వారిలో ఫ‌స్టుండే రాజ‌కీయ నాయ‌కుడిగా చంద్ర‌బాబు గుర్తింపు సాధించారు. ఈ క్ర‌మంలోనే ఆయన ప‌ట్టుమ‌ని మూడు మాసాలు కూడా పూర్తికాక ముందుగానే జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డుతున్నారు. అప్ప‌టి వ‌ర‌కు తాను, త‌న పార్టీ ఎందుకు విఫ‌ల‌మ‌య్యామో కూడా తెలియ‌ద‌ని చెప్పిన చంద్ర‌బాబు.. ఆ వెంట‌నే ప్ర‌భుత్వంపై దాడి చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

ఓటమి తర్వాత….

ముఖ్యంగా పార్టీ ఓట‌మి క‌న్నాకూడా చంద్ర‌బాబును తీవ్రంగా బాధ‌పెట్టిన ఘ‌ట‌న‌లు చాలానే ఉన్నాయి. రాజ‌కీయాల్లో ఓట‌ములు, గెలుపులు తెలియ‌ని నాయ‌కుడు అని చంద్ర‌బాబును అనుకోలేం. కానీ, ఎన్నిక‌ల త‌ర్వా త ఆయ‌న‌కు అండ‌గా నిలిచిన త‌మ్ముళ్లు చాలా త‌క్కువ మంది క‌నిపించారు. ఎంతో మంది పార్టీ ఫిరాయిం చారు. ఇంకొంద‌రు ఇప్ప‌టికీ.. జంపింగుల‌కు బేర‌సారాలు చేసుకుంటున్నారు.(గంటా శ్రీనివాస‌రావు పేరు ముందు వ‌రుస‌లో వినిపిస్తోంది., అదేవిధంగా రాయ‌పాటి కుటుంబం, జేసీ ఫ్యామిలీ కూడా బాబును వ‌దిలేయాల‌ని దాదాపు రెడీ అయ్యారు.కానీ, ఊగిస‌లాట‌లో ఉండ‌డం గ‌మ‌నార్హం.) దీంతో దాదాపు చంద్ర‌బాబు శ‌కం ముగిసింద‌నే వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో భారీగా వినిపించాయి.

రెండు అంశాలపైనే….

ఈ స‌మ‌యంలోనే చంద్ర‌బాబు రెండు విష‌యాల‌ను త‌న‌కు, పార్టీకి కూడా అనుకూలంగా మార్చుకునేందు కు ప్ర‌య‌త్నించారు. వాటిలో ప్ర‌ధానమైంది గుంటూరు జిల్లా ఆత్మ‌కూరు ద‌ళితుల ఇష్యూ. రెండోది.. కోడెల శివ‌ప్ర‌సాద‌రావు బ‌ల‌వ‌న్మ‌ర‌ణం. ఈ రెండు విష‌యాల్లోనూ రాజ‌కీయంగా చంద్ర‌బాబు త‌న ల‌బ్ధి చూసుకున్నార‌నే వ్యాఖ్య‌లు బాహాటంగా టీడీపీలో వినిపిస్తున్నాయి. వాస్త‌వానికి చంద్ర‌బాబు అనుకూల మీడియా చెప్పిన దాని ప్ర‌కారం ఆత్మ‌కూరులో ద‌ళితుల ర‌గ‌డ ఈ నాటిది కాదు. టీడీపీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు ఎన్టీఆర్ స‌మ‌యంలోనూ ఉంది. అప్ప‌టి నుంచి ర‌గులుతున్న దానిని ఇప్పుడు జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ముడిపెట్టి రాద్ధాం తం చేసినా.. పెద్ద‌గా చంద్ర‌బాబుకు మార్కులు ప‌డ‌లేదు.

ఫెయిలా? సక్సెస్సా..?

ఇక‌, కోడెల విష‌యంలోనూ ఆయ‌న ఆత్మ హ‌త్య చేసుకోక ముందు వ‌ర‌కు కూడా ఆయ‌న‌ను స‌మ‌ర్ధించ‌ని చంద్ర‌బాబు క‌నీసం అప్పాయింట్ మెంట్ కూడా ఇవ్వ‌ని చంద్ర‌బాబు ( ఈ విష‌యం టీడీపీ వాళ్లే చ‌ర్చించుకుంటున్నారు…. వ‌ర్ల రామ‌య్య కోడెల‌పై విమ‌ర్శ‌లు చేయ‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌నం) .. ఇప్పుడు వెనుకేసుకు రావ‌డం, భారీ ఎత్తున శ‌వ‌యాత్ర‌కు జ‌నాల‌ను స‌మీక‌రించ‌డం వంటివి సింప‌తీ క‌న్నా.. స‌మ‌స్య‌ల‌నే సృష్టిస్తున్నాయి. ఈ రెండు విష‌యాల్లోనూ చంద్ర‌బాబు వేసుకున్న మూడు అంచ‌నాలు.. జ‌గ‌న్‌ను డీకొట్ట‌డం, పార్టీని బ‌లోపేతం చేసుకోవ‌డం, తానేంటో నిరూపించుకోవ‌డం అనే విష‌యాల్లో పూర్తిగా విఫ‌ల‌మ‌య్యార‌ని అంటున్నారు విశ్లేష‌కులు. ఆత్మ‌కూరు, కోడెల ఘ‌ట‌న‌ల్లో పార్టీని ఏకం చేయాల‌ని, సెంటిమెంటుతో పార్టీని బ‌లోపేతం చేయాల‌ని భావించారు. కానీ, నాయ‌కులు పెద్ద‌గా క‌లిసి వ‌చ్చిన ప‌రిస్థితి ఎక్క‌డా క‌నిపించ‌దు. మ‌రి చంద్ర‌బాబు స‌క్సెస్ అయ్యారా? విఫ‌ల‌మ‌య్యారా ? అన్న‌ది కాల‌మే చెపుతుంది.

Tags:    

Similar News