ఆయన డైరెక్షన్ లోనే ఇక బాబు

చంద్రబాబు రాజకీయం ముందు ఆధునిక భారతంలో సరిసాటి ఎవరూ ఉండరన్నది తమ్ముళ్ళ నమ్మకం. బాబు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని గొప్పగా చెబుతారు. ఇక చంద్రబాబు వ్యూహాలు, [more]

Update: 2020-02-14 06:30 GMT

చంద్రబాబు రాజకీయం ముందు ఆధునిక భారతంలో సరిసాటి ఎవరూ ఉండరన్నది తమ్ముళ్ళ నమ్మకం. బాబు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని గొప్పగా చెబుతారు. ఇక చంద్రబాబు వ్యూహాలు, రాజకీయ చాణక్యం మీద కూడా టీడీపీన కాదు, మిగిలిన పార్టీలు కూడా గట్టి నమ్మకంతో ఉంటాయి. అటువంటి చంద్రబాబు వ్యూహాలు వరసగా బెడిసికొడుతున్నాయి. ఆయన గత రెండేళ్ళుగా వేసుకున్న అంచనాలు అన్నీ రివర్స్ అవుతున్నాయి. దాంతో చంద్రబాబు ఎన్నడూ లేనంతగా రాజకీయ పతనావస్థలో ఉన్నారు. దాని నుంచి బయటపడేందుకు దారులు వెతుకుతున్నారు. మరో వైపు తమ్ముళ్ళకు కూడా చంద్రబాబు వ్యూహాల మీద, రాజకీయ చాతుర్యం మీద క్రమంగా విశ్వసనీయత సడలుతోందని అంటున్నారు.

అరువు తెచ్చుకున్నారా?

ఈ నేపధ్యంలో చంద్రబాబు తన మెదడుకు పదును తగ్గిందనుకున్నారో లేక ఇప్పటి తరానికి కనెక్ట్ కాలేకపోతున్నానని గ్రహించారో తెలియదు కానీ తనకూ ఒక వ్యూహకర్త అవసరం ఉందని మాత్రం గట్టిగా భావిస్తున్నారుట. అందుకే ఏపీ ఎన్నికల్లో తన ప్రత్యర్ధి వైసీపీని వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ని డైరెక్ట్ గా పిలిపించుకోకుండా అయన శిష్యుడు రాబిన్ శర్మని దగ్గరపెట్టుకోవాలనుకుంటున్నారుట. రాబిన్ వర్మ కూడా ఎన్నికల వ్యూహ రచనలో ఆరితేరిన వారేనని అంటున్నారు. పైగా అయన గతంలో ప్రధాని మోడీ ప్రచార బాధ్యతలు చూసిన అనుభవం ఉందని చెబుతున్నారు. దాంతో ఆయన్ని వ్యూహకర్తగా నియిమించుకుని టీడీపీని పట్టాల మీదకు తీసుకురావాలని చంద్రబాబు గట్టి నిర్ణయం తీసుకున్నారుట.

లోకల్ నుంచే…

ఇపుడు ఏపీలో అర్జంట్ గా లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి. అందువల్ల ముందుగా అక్కడ నుంచే కధ మొదలుపెట్టాలని చంద్రబాబు రాబిన్ శర్మను కోరినట్లుగా చెబుతున్నారు. రాబిన్ శర్మ ఇప్పటికే తన పనిలోకి దిగిపోయాడని కూడా తెలుస్తోంది. మూడు రాజధానుల విషయంలో జనాల స్పందన, కులాలు, ప్రాంతాల వారీగా వైసీపీ సర్కార్ మీద జనంలో ఉన్న అభిప్రాయాలు, టీడీపీ మీద ఉన్న ఒపీనియన్. ప్రతిపక్ష పార్టీకి చేయాల్సిన మరమ్మతులు వంటివి రాబిన్ శర్మ అజెండాగా చేసుకుని గ్రౌండ్ రియాలిటీస్ కనుక్కునే పనిలో పడ్డారట.

శిష్యుడు గెలుస్తాడా…?

ఎట్టిపరిస్థితుల్లోనూ 2024 నాటికి టీడీపీని అధికారంలోకి తేవాలన్నది చంద్రబాబు టార్గెట్. అందుకోసం ముందుగా లోకల్ ఫైట్ ని ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక్కడ గెలిచి ముందు పార్టీ వారికి ధైర్యం చెప్పాలని, ఆ తరువాత రానున్న నాలుగేళ్ళ కాలంలో వైసీపీ వైఫల్యాలను ఎండగడుతూ జనంలో ఉండాలని చంద్రబాబు యాక్షన్ ప్లాన్ రూపొందించు కున్నారట. చంద్రబాబుకు ఎప్పటికపుడు క్షేత్ర స్థాయిలో పరిస్థితులపైన రిపోర్టులను అందించడం, అటు పార్టీలో మార్పులతో పాటు, బాబు ఉపన్యాసాలు, బాబు తీరు కూడా మార్చెలా రాబిన్ శర్మ డిజైన్ చేయబోతున్నారుట. తొందరలోనే గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ఒకటి చంద్రబాబుకు ఆయన ఇస్తారని చెబుతున్నారు. రానున్న రోజుల్లో శర్మ డైరెక్షన్ లోనే చంద్రబాబు యాక్షన్ ఉంటుందని, దాంతో కొత్త బాబుని జనం చూస్తారని కూడా టీడీపీ శిబిరం నుంచి వినిపిస్తున్న మాట.

Tags:    

Similar News