సెలక్షన్ దగ్గరకు వచ్చే సరికి?

ఏపీలో మూడు రాజధానుల అంశం తెరమీదకు రావడంతో తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ కూడా ఆలస్యం అవుతోంది. నిజానికి మహానాడుకు ప్రక్రియ మొత్తం పూర్తయి కొత్త [more]

Update: 2020-02-09 11:00 GMT

ఏపీలో మూడు రాజధానుల అంశం తెరమీదకు రావడంతో తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ కూడా ఆలస్యం అవుతోంది. నిజానికి మహానాడుకు ప్రక్రియ మొత్తం పూర్తయి కొత్త కార్యవర్గం ఏర్పడాల్సి ఉంది. గ్రామస్థాయి నుంచి మండల, జిల్లా స్థాయి కమిటీల విషయంలో జాప్యం జరుగుతుంది. దీనికి కారణం మూడు రాజధానులే. ఇప్పటికే చంద్రబాబు రోజుకొక కార్యక్రమాన్ని ఇస్తుండటంతో దానికే తమ్ముళ్లు సమయాన్ని వెచ్చిస్తున్నారు. దీంతో ఎన్నికల ప్రక్రియ కొంత ఆలస్యమయ్యేటట్లుగానే కన్పిస్త్తుంది.

మహానాడు నాటికి…..

నిజానికి మహానాడు నాటికి అధ్యక్షుడి ఎన్నిక పూర్తి కావాల్సి ఉంటుంది. ఇప్పటికే అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకట్రావును తప్పిస్తారని బలంగా ప్రచారం జరుగుతోంది. కళా వెంకట్రావు స్థానంలో అచ్చెన్నాయుడు, బీద రవిచంద్ర పేర్లు ప్రముఖంగా విన్పిస్తున్నాయి. వీరిద్దరిలో ఒకరికి అధ్యక్ష పదవి ఇవ్వాలన్న యోచనలో చంద్రబాబు ఉన్నారు. అచ్చెన్నాయుడు ఇప్పటికే శానసనసభపక్ష ఉప నేతగా ఉండటంతో దీనిపై కొంత ఆలోచనలో పడ్డారు. మండలి రద్దు కావడంతో బీద రవిచంద్ర పేరును చంద్రబాబు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

తెలుగు యువత అధ్యక్షుడిగా….

తెలుగు మహిళ అధ్యక్షురాలిగా ఇప్పటికే వంగలపూడి అనితను చంద్రబాబు నియమించారు. తెలుగు యువత అధ్యక్ష పదవిని కూడా భర్తీ చేయాల్సి ఉంది. దేవినేని అవినాష్ వైసీపీలోకి వెళ్లడంతో ఈ పదవిని వీలయినంత త్వరగా భర్తీ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే విపక్షంలో ఉండటంతో అనేక కార్యక్రమాలను చేపట్టాల్సి ఉన్నందున తెలుగుయువత అధ్యక్షుడు ముఖ్య భూమికను పోషించాల్సి ఉంది. ఈ పదవి కోసం రెండు పేర్లను చంద్రబాబు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు కుమారుడు విజయ్ పాత్రుడు, లేదా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త వాసు పేర్లను పరిశీలిస్తున్నారు.

సామాజిక వర్గాల సమతూకంతో….

అయితే అచ్చెన్నాయుడుకి రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కితే వాసుకు యువత అధ్యక్షుడిగా నియమించే అవకాశం లేదు. ఇద్దరూ ఒకే కుటుంబానికి చెందిన వారు. ఇక చింతకాయల విజయ్ కి ఇవ్వాలన్నా ఒకే కులానికి చెందిన వారు కావడంతో కొంత ఆలోచనలో పడినట్లు తెలిసింది. పదవుల భర్తీలో చంద్రబాబు సామాజిక వర్గాల సమతూకాన్ని పాటిస్తారు. అందుకే ఈ రెండు పదవుల మీద చంద్రబాబు గట్టి కసరత్తే చేస్తున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News