అదుపులో పెట్టుకోకుంటే?

అవును.. ఇది హుందా అయిన రాజకీయ భాషే మరి. ఎందుకంటే తెలుగు వారి సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబంగా పెట్టిన తెలుగుదేశం పార్టీ అధినాయకులు వాడే భాష ఇది. [more]

Update: 2020-02-06 03:30 GMT

అవును.. ఇది హుందా అయిన రాజకీయ భాషే మరి. ఎందుకంటే తెలుగు వారి సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబంగా పెట్టిన తెలుగుదేశం పార్టీ అధినాయకులు వాడే భాష ఇది. గతంలో అప్పటి దేశ ప్రధాని రాజీవ్ గాంధీని కుర్ర కుంక అంటూ నాటి ముఖ్యమంత్రి హోదాలో ఎన్టీఆర్ దూషించారు. ఇపుడు ఆయన గారి అల్లుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ ని పిల్ల కుంక అంటున్నారు. ఆ విషయంలో మామా అల్లుళ్ళు డిటో..డిటో.. నాడు అన్న గారు రాజకీయాలకు కొత్త. ఆయనది తెలిసీ తెలియని ఆవేశం. అప్పటివరకూ సినీ హీరోగా పొగడ్తలే తప్ప విమర్శలు ఎరుగని ఎన్టీఆర్ రాజీవ్ గాంధీ మీద అలా నోరు పారేసుకున్నారు. మరి ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు ఇలా మాట్లాడవచ్చా..

హుందా రాజకీయమా?

చంద్రబాబు ఏ కారణంగా తాను ఓటమి పాలు అయ్యారన్నది గమనించడంలేదు. ఆయన అహంకారమే ఆయన్ని దెబ్బతీసింది, గద్దె దింపింది. జగన్ ని నాడు కనీసం నాయకుడిగా కూడా గుర్తించడానికి ఇష్టపడని ఆయన అహంభావ వైఖరే ఇలా కొంపముంచింది. ఇపుడు జగన్ ని పట్టుకుని పిల్ల కుంక అంటున్నారు. మరి అంతకంటే చిన్నవాడు అయిన తన కుమారుడు లోకేష్ కి అయిదు కీలక మంత్రిత్వ శాఖలు అప్పగించినపుడు ఆయన వయోవృధ్ధుడు అయ్యాడా? మేధా సంపన్నుడు అయ్యాడా? హుందాతో కూడిన రాజకీయాలు చేస్తానని పదే పదే చెప్పే చంద్రబాబు నోట ఇలాంటి మాటలు రావడం దారుణమే.

అసహనమే….

విపక్ష నేతగా చంద్రబాబుకు అసహనం బాగా ఎక్కువ అవుతోందని అంటున్నారు. ఆయన ఫార్టీ యియర్స్ అనుభవానికి ఎదురుదెబ్బ తగిలిందని అవమాన భారంతో రగుతులున్నారు. ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన హావభావలే కాదు, మాటలు కూడా చెప్పేస్తున్నాయి. అయితే మన ప్రజాస్వామ్యం 18 ఏళ్ళు నిండితే ఓటేసే హక్కు ఇచ్చింది. పాతికేళ్ళు నిండితే పోటీ చేసే హక్కూ ఇచ్చింది. ఆ విధంగా చూసుకున్నపుడు అదృష్టం పండి జనాదరణ ఉండే వారు ఎవరైనా చిన్న వయసులోనే ముఖ్యమంత్రి కావచ్చు. అంత మాత్రం చేత వారు పిల్ల కుంకలు అయిపోతారా. అది రాజ్యాంగాన్ని అవమానపరస్తున్నాట్లు కాదా.

అపుడు బాబు కూడా…..

చంద్రబాబు అన్నగారిని వెన్నుపోటు పొడిచి అధికారం సంపాదించుకున్నపుడు ఆయన వయసు కూడా నాలుగున్నర పదులే మరి. నాడు ఆయన యువ ముఖ్యమంత్రిగా దేశమంతా చాటింపు వేసుకుని తిరిగారు. తాను ఆధునిక భావాల రాజకీయ ప్రతినిధిని అని గొప్పలు చెప్పుకున్నారు. నాడు అయన కంటే రాజకీయంగా తలపండిన నేత పీవీ నరసింహారావు కేంద్రంలో ప్రధానిగా ఉన్నారు. మరి ఆయన చంద్రబాబుని ఎపుడూ పిల్ల కుంక అనలేదే. ఏపీలో చూస్తే కోట్ల విజయభాస్కరరెడ్డి వంటి ఉద్దండులు ఉన్నారు. వారు కూడా నోరు ఇలా జారలేదే. ముఖ్యమంత్రి సీట్లో ఎవరు కూర్చున్నా కూడా వారు పెద్దవారే. తండ్రి సమానులే. బాబు ఇవన్నీ తెలిసి కూడా అనవసర వాచాలత్వంతో పరువు పోగొట్టుకుంటున్నారు. ఎదుటి వారిని విమర్శిస్తే పెద్దవారు అయిపోరుగా. చంద్రబాబు జనాలను మంచి చేసుకుంటే మళ్ళీ సీఎం కావచ్చునేమో. ఆ దిశగా ఆలోచనలు చేయకుండా వ్యక్తిగత విమర్శలు చేయడం ఆయనకూ, ఆయన పార్టీకి కూడా మంచిది కాదన్నది గుర్తించాలి మరి.

Tags:    

Similar News