ఆయన కూడా కటీఫ్ చెప్పేశారటగా

చంద్రబాబు రాజకీయం యూజ్ అండ్ త్రో. అంటే వాడుకుని వదిలేయ్. ఇలా రాహుల్ గాంధీని ఆయన వాడుకున్నారు. ఫలితం రాలేదు, వదిలేశారు. మరి ఇంతలా గబ్బు రాజకీయం [more]

Update: 2020-02-07 11:00 GMT

చంద్రబాబు రాజకీయం యూజ్ అండ్ త్రో. అంటే వాడుకుని వదిలేయ్. ఇలా రాహుల్ గాంధీని ఆయన వాడుకున్నారు. ఫలితం రాలేదు, వదిలేశారు. మరి ఇంతలా గబ్బు రాజకీయం వంటబట్టని కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీ చంద్రబాబు మార్క్ పాలిట్రిక్స్ మీద గరం గరంగా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. నిజానికి కాంగ్రెస్ పరిస్థితి ఈ రోజు దేశంలో ఏ మాత్రం బాగాలేదు. అయితే రేపోమాపో మోడీని ఢీ కొట్టాలంటే ఇదే కాంగ్రెస్ అవసరం అన్నది అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ ఈ దేశంలో ఓ రాజకీయ పార్టీగా కాదు, ఓ వ్యవస్థలా ఆసేతు హిమాచలం పాతుకుపోయింది. అందువల్ల దానికి నాయకత్వంతో సంబంధం లేకుండా తిరిగి పునరుజ్జీవం అయ్యే శక్తియుక్తులు ఉన్నాయని హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర ఫలితాలు ఇప్పటికే నిరూపించాయి. మరి కాంగ్రెస్ లేచేందుకు కొంత సమయం పడుతుంది. ఇంతలో చంద్రబాబు లాంటి వారు పల్టీలు కొట్టడాన్ని చూసి రాహుల్ గుస్సా అవుతున్నారుట.

మోడీకి తొత్తేనా….?

ఏపీలో మూడు ప్రధాన పార్టీలు ఉన్నాయి. అవి అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, కొత్తగా ఏర్పాటైన జనసేన, బీజేపీ కూటమి. ఇందులో మూడవది పక్కన పెడితే మిగిలిన రెండూ కూడా మోడీకి వత్తాసు పలికే పార్టీలేనని రాహుల్ అభిప్రాయపడుతున్నారుట. వైసీపీ విషయంలో రాహుల్ అభిప్రాయం ఇలాగే ఉంటుంది. ఎందుకంటే అది జాతి వైరం కాబట్టి. కాంగ్రెస్ ని కొట్టి జగన్ బయటకు వచ్చాడు కాబట్టి అది అలా కొనసాగుతుంది. ఇక చంద్రబాబు విషయంలో రాహుల్ తన అభిప్రాయాన్ని మార్చుకోవడమే విడ్డూరం. చంద్రబాబు గత ఏడాది వరకూ కాంగ్రెస్ తో చెట్టాపట్టాలు వేసుకున్న వారే. ఆయన రాహుల్ ఇంటికి వెళ్ళి దోస్తీ చేసిన వారే. తెలంగాణాలో పొత్తులు పెట్టుకున్న వారే. మరి ఇలా చంద్రబాబుని మోడీ తొత్తు అని రాహుల్ ఎలా అనేశారు.

అదీ కధ…..

ఎన్నికలు అయిపోగానే చంద్రబాబు రంగులు మార్చేశారు. ఊసరవెల్లిలా మళ్ళీ మోడీ జపం చేస్తున్నారు. మోడీ సర్కార్ ని బంగాళాఖాతంలో కలిపేస్తామంటూ గర్జించిన చంద్రబాబు ఇపుడు మోడీ శరణం గచ్చామీ అంటున్నారు ఆయన కనీసం కాంగ్రెస్ ఊసు తలవడంలేదు. మర్యాదకైనా రాహుల్ పేరు చెప్పడంలేదు. అంటే ఆయనకు కాంగ్రెస్ అవసరం లేదని చెప్పేశారు. టీడీపీ మరీ ఇంత పచ్చిగా విషయం ఉంటే రాహుల్ కి మాత్రం కధ ఎందుకు అర్ధం కాదూ. అందుకే ఆయన తనను కలసిన ఏపీ పీసీసీ నాయకులు శైలజానాధ్, తులసీరెడ్డిలతో చంద్రబాబుతో జాగ్రత్త అని హెచ్చరించారట. ఆయన మోడీకి దాసోహం అయ్యారని కూడా నిందించారట. ఏపీలో బీజేపీకి వ్యతిరేకంగా నిలిచే పార్టీ ఒక్క కాంగ్రెస్ మాత్రమేనని కూడా రాహుల్ చెప్పారట. తాను తొందరలోనే ఏపీలో టూర్ చేస్తానని అక్కడ ప్రాంతీయ పార్టీలు, బీజేపీకి వ్యతిరేకంగా సమరశంఖం పూరిస్తానని కూడా అన్నారట. అంటే రాహుల్ వద్ద చంద్రబాబు పరువూ పరపతీ పాయేనని హస్తిన తాజా టాక్.

రేవడి అయ్యారే……

చంద్రబాబు రాజకీయం ఎల్లకాలం సాగదేమో. ఒకసారి రౌండ్ వేసి అందరితో పొత్తులు నెరిపారు. మళ్ళీ పాత వారికీ కటీఫ్, కొత్త వారికి వెల్ కం అంటూ చంద్రబాబు వరకూ పాడుకోవచ్చు. కానీ ఒకసారి తమను దెబ్బేసిన చంద్రబాబుని మళ్ళీ చేరదీసేందుకు బీజేపీ ఇపుడు రెడీగా లేదుగా. మోడీ, అమిత్ షా అక్కడ ఉన్నారు. వారితో చేతులు కలిపినా విడిపోయినా కూడా ఒక లెక్కలో ఉంటుంది. ఇక చంద్రబాబుని నమ్మని బీజేపీ అలా ఒక వైపు ఉంటే, బాబుతో దోస్తీ కట్ అంటూ రాహుల్ మరో వైపు చెప్పేశారు. అంటే 2024లో ఒక వేళ మోడీ గ్రాఫ్ పడిపోయి కాంగ్రెస్ నేత్రుత్వంలో విపక్షాలు జట్టు కట్టినా కూడా చంద్రబాబుకి దక్కేది సున్నాయేనన్నమాట. అందుకే అంటారు రాజకీయాల్లో విశ్వసనీయత ముఖ్యమని. ఏ ఎండకు ఆ గొడుగు పట్టాలనుకుంటే మిగిలేది చేదు ఫలితాలేనని.

Tags:    

Similar News