పరువు మొత్తం తీశారుగా

నానాయాగీ చేస్తే అంతే మరి. తన పార్టీకి ముగ్గురు ఎంపీలు ఉంటే వారి చేత లోక్ సభలో అల్లరి చేయాలని, వైసీపీ సర్కార్ ని అక్కడ బదనాం [more]

Update: 2020-02-04 09:30 GMT

నానాయాగీ చేస్తే అంతే మరి. తన పార్టీకి ముగ్గురు ఎంపీలు ఉంటే వారి చేత లోక్ సభలో అల్లరి చేయాలని, వైసీపీ సర్కార్ ని అక్కడ బదనాం చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. మరి 22 మంది ఎంపీలు కలిగిన వైసీపీ ఊరుకుంటుందా. ఇంతకు ఇంత అన్నట్లుగా ఏకంగా అదే పార్లమెంటులోనే టీడీపీని, బాబుని కడిగిపారేసింది. ఇప్పటివరకూ లోకానికీ, జాతీయ మీడియాకు తెలియని అనేక వాస్తవాలను నిండు సభలో ఆ పార్టీ నాయకుడు మిధున్ రెడ్డి గట్టిగానే ఎండగట్టారు. చంద్రబాబు జమానాలో ఏపీ ఏ విధంగా ముందుకు పోయిందీ కూడా లెక్కలతో సహా వివరించారు.

అమరావతి పెద్ద స్కాం….

అమరావతి రాజధాని పేరిట చంద్రబాబు అతి పెద్ద స్కాం కి పాల్పడ్డారని మిధున్ రెడ్డి లోక్ సభలో చెప్పడంతో ముగ్గురు ఎంపీ తమ్ముళ్ళు సభలో తలెత్తుకోలేకపోయారనే చెప్పాలి. అమరావతిలో ఒక చదరపు అడుగుకు 11 వేల రూపాయలను ఖర్చు పెట్టారని, ఇది దేశంలో ఎక్కడైనా ఉందా అధ్యక్షా అంటూ మిధున్ రెడ్డి ప్రశ్నించేసరికి తెల్లబోవడం సభ్యుల వంతు అయింది. అక్కడ తెల్లకార్డుదారులకు కూడా కోట్ల విలువ చేసే భూములు ఉన్నాయంటే ఆ స్కాం ఎలా సాగిందో చూడాలని అన్నపుడు కూడా సభ ఉలిక్కిపడింది. ఇన్ సైడర్ ట్రేడింగ్ పేరిట చంద్రబాబు తన వాళ్ళకు ముందుగా సమాచారం అందించి భూములు పెద్ద ఎత్తున కొనిపించారని, అలా నాలుగు వేల ఎకరాలు టీడీపీ వారే స్వయంగా కొన్నట్లుగా సీఐడీ లెక్కలు తేల్చిందని మిధున్ రెడ్డి చెప్పారు. దీని మీద సీబీఐ విచారణ జరిపించి నిగ్గు తేల్చాలని కూడా ఆయన మోడీ సర్కార్ ని డిమాండ్ చేశారు.

పోలవ‌రం ఓ ఏటీఎం…

ఇక పోలవరం విషయంలోనూ గత టీడీపీ సర్కార్ పాల్పడిన అవినీతిని సభ దృష్టికి మిధున్ రెడ్డి తెచ్చారు. అక్కడే అంచనాలకు మించి రెట్టింపు డబ్బు ఖర్చుకు టెండర్లు పిలిచారని, ఫలితంగా అది పసుపు తమ్ముళ్ళు పంచుకునే ఏటీఏం అయిపోయిందని ఘాటు విమర్శలు చేసారు. తమ ప్రభుత్వం దానిమీద రివర్స్ టెండరింగ్ కి వెళ్టే ఒక్క ప్రాజెక్టులోనే 800 కోట్ల రూపాయలు ఆదా జరిగిందని ఆయన సభకు వివరించారు. ఇలా ప్రతీ నీటిపారుదల ప్రాజెక్టులోనూ అవినీతి కోటలు దాటిందని కూడా ఆయన వివరించారు. స్వయంగా ప్రధాని మోడీ పోలవరం చంద్రబాబుకు ఏటీఎం గా మారిందని అన్న మాటలను కూడా ఉటంకిస్తూ మిధున్ రెడ్డి చేసిన ప్రసంగంతో పసుపు ఎంపీ తమ్ముళ్ళు ముగ్గురూ తెల్లబోవాల్సివచ్చింది.

ఇదీ రాజకీయం…

ఇక చంద్రబాబు మార్క్ రాజకీయాన్ని కూడా మిధున్ రెడ్డి సభలో ఏకేశారు. వ్యూహాత్మకంగా ఆయన మోడీ ప్రస్తావన తెచ్చారు. మోడీని ఇంటికి పంపుతామని ఇదే చంద్రబాబు కంకణం కట్టుకుని నాడు ఊరూరా తిరిగారని, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ తో కూడా కలసి రాజకీయం చేశారని గుర్తు చేశారు. చివరికి ఓడిపోవడంతో ఇపుడు చేసేది లేక కాంగ్రెస్ వదిలేసి మళ్ళీ ఈ వైపు చూస్తున్నాడంటూ ఇదీ చంద్రబాబు రంగులు మార్చే రాజకీయమంటూ పార్లమెంట్ సాక్షిగా కడిగేశారు. మొత్తానికి పార్లమెంట్ లో రచ్చ చేయమని ,ందకనబాబు గారు తన ఎంపీలను ఆదేశిస్తే వైసీపీ గట్టి రిటార్ట్ ఇవ్వడమే కాదు, చంద్రబాబు పరువు జాతీయ స్థాయిలో తీసేసింది. టిట్ ఫర్ టాట్ అంటే ఇదేనేమో.

Tags:    

Similar News