ఎమ్మెల్సీలను టోకుగా బాబు?

చంద్రబాబు రాజకీయం తెలిసిన వారికి అసాధ్యం, అనూహ్యం అన్న మాటలను వల్లించాల్సిన పనిలేదు. చంద్రబాబు తరచూ చెప్పే ఊతపదం ఒకటి ఉంది. అలా ముందుకు పోదామని. రాజకీయాల్లోనూ [more]

Update: 2020-01-30 13:30 GMT

చంద్రబాబు రాజకీయం తెలిసిన వారికి అసాధ్యం, అనూహ్యం అన్న మాటలను వల్లించాల్సిన పనిలేదు. చంద్రబాబు తరచూ చెప్పే ఊతపదం ఒకటి ఉంది. అలా ముందుకు పోదామని. రాజకీయాల్లోనూ చంద్రబాబు ముందుకే పోతారు, దానికోసం ఆయన ఎందాకైనా కూడా తెగిస్తారన్న పేరు ఎపుడో సంపాదించుకున్నారు. ఇపుడు శాసనమండలిని కాపాడుకోవడానికి చంద్రబాబు ఒక కొత్త ఆయుధాన్నే ప్రయోగించబోతున్నాడుట. అదేంటి అంటే బీజేపీకి టోకున తన పార్టీ ఎమ్మెల్సీలను ఫణంగా పెట్టడం, మండలిలో టీడీపీని బీజేపీలో విలీనం చేయడం. ఆ విధంగా చేయడం ద్వారా కమలధారులలో కొత్త ఆశలు పుట్టించి మండలిని కాపాడుకోవడం అన్న ఎత్తుగడలో చంద్రబాబు బిజీగా ఉన్నారట.

మెజారిటీ అటువైపుగా….

తన కొడుకు లోకేష్ తో పాటు మరి కొద్ది మంది కీలక నేతలను తప్ప మిగిలిన వారిని బీజేపీ వైపుగా నడిపించాలని చంద్రబాబు గట్టిగా డిసైడ్ అయినట్లుగా ప్రచారం సాగుతోంది. సరిగ్గా ఇలాంటి ట్రిక్ నే చంద్రబాబు రాజ్యసభలో చేసి తన నలుగురు ఎంపీలను బీజేపీలోకి పంపారు. ఆ విధంగా కమలం పార్టీలో పరోక్ష వాటా సంపాదించి నైతికంగా కొంత బలం సంపాదించుకున్న చంద్ర బాబు ఇపుడు సేమ్ టూ సేమ్ మండలిలోనూ చేయాలనుకుంటున్నారుట.

రాజకీయ లాభమే…

కోరకుండాకే కొడుకు పుడితే సంబరమే కదా. బీజేపీకి ఏపీ మండలిలో ఇద్దరు ఎమ్మెల్సీలు తప్ప పెద్దగా బలం లేదు. అటువంటి పార్టీకి మెజారిటీ టీడీపీ ఎమ్మెల్సీలను అందించి మండలిలో ప్రధాన ప్రతిపక్షంగా రాజకీయ కత్తి చేతికి ఇస్తే ఎవరైనా కాదంటారా. పైగా ఏపీలో అధికారంలోకి రావాలని ఉవ్విళ్ళూరుతున్న పార్టీకి ఇంత పెద్ద ఎత్తున ఎమ్మెల్సీలు వచ్చి చేరితే ఆ ఊపే వేరుగా ఉంటుందని సంబరపడకుండా ఉంటుందా. ఇక మండలిలో ప్రధాన పక్షంగా బీజేపీకి క్యాబినేట్ హోదా దక్కుతుంది. జనంలోనూ పాజిటివ్ రెస్పాన్స్ ఉంటుంది. మొత్తానికి చంద్రబాబు ఈ ఎత్తు, పొత్తు బీజేపీకి పెద్ద రాజకీయ లాభమేనని అంటున్నారు.

లోకేష్ కోసమే….

ఈ మొత్తం ఎత్తుగడ వెనక లోకేష్ భవిష్యత్తు ఉంది. తన కొడుకు లోకేష్ పదవీ కాలం 2023 వరకూ ఉంది. ఇపుడే మండలి రద్దు అయితే రాజకీయ నిరుద్యోగి అయిపోతాడు. జనంలో కాదు, పార్టీలోనూ తలెత్తుకోలేడు. దాంతో ఆకాశం భూమినీ కలిపైనా లోకేష్ ఉద్యోగం నిలబెట్టాలని చంద్రబాబు అనుకుంటున్నారుట. ఇక బీజేపీకి మండలిలో బలం ఉన్నా అక్కడ ఉండేది కూడా తన ఎమ్మెల్సీలే కాబట్టి తాను అనుకున్నట్లుగానే కధ సాగుతుంది. పైగా బీజేపీ కూడా టీడీపీకి మరింత చేరువ అవుతుంది. జగన్ ని కేంద్ర స్థాయిలోనూ ఎడం చేసి రాజకీయ ఇబ్బందులు పెట్టవచ్చు. ఇలా బహుముఖంగా చంద్రబాబు ఆలోచనలు చేసి మరీ ఈ మాస్టర్ ప్లాన్ వేశారని అంటున్నారు. ఇదే కనుక జరిగితే చంద్రబాబు చేతిలో జగన్ మరో మారు చిత్తు కావడం ఖాయమే మరి.

Tags:    

Similar News