భ‌లేగా ఉంది బాబూ

రాజ‌కీయాల్లో సిద్ధాంతాలు, వాదాలు, అజెండాలు కామ‌నే. ఎప్పటిక‌ప్పుడు ఏ అవ‌స‌రానికి ఆ అవ‌స‌రం కింద సిద్ధాంతాలు మార్చుకునే ప‌రిస్థితులు కామ‌న్‌. అయితే, ఇప్పుడు ఏపీలో ఏర్పడిన జ‌గ‌న్ [more]

Update: 2020-01-29 08:00 GMT

రాజ‌కీయాల్లో సిద్ధాంతాలు, వాదాలు, అజెండాలు కామ‌నే. ఎప్పటిక‌ప్పుడు ఏ అవ‌స‌రానికి ఆ అవ‌స‌రం కింద సిద్ధాంతాలు మార్చుకునే ప‌రిస్థితులు కామ‌న్‌. అయితే, ఇప్పుడు ఏపీలో ఏర్పడిన జ‌గ‌న్ ప్రభుత్వం కొంత మేర‌కు ఈ విష‌యంలో ఎక్కడా బెస‌గ కుండా ముందుకు సాగుతోంది. ఎన్ని క‌ష్టాలు, న‌ష్టాలు వ‌స్తున్నా.. ముందుకు సాగుతున్నారు. దీంతో మ‌ళ్లీ రాజ‌కీయాల్లో సిద్ధాంతాల‌పైనా, నాయ‌కులు మాట త‌ప్పక‌పోవ‌డంపైనా ప్రజల‌లో కొంత మేర‌కు ఆశ‌లు చిగురిస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. స‌రే… ఈ విష‌యం ఇలా ఉంచితే తాజాగా టీడీపీ అధినేత‌, ఫార్టీ ఇయ‌ర్స్ సీఎం చంద్రబాబు సిద్ధాంతాల‌పై క్లాస్ ఇచ్చారు.

ఊహించని విధంగా…..

ప్రస్తుతం ఏపీలో మండలి ర‌ద్దు వేడి పుట్టించింది. ఆ.. ఏం చేస్తాడులే.. ఓ ఏడాది ఆగితే.. అన్ని సీట్లూ త‌న‌వే క‌దా.. అనుకున్న టీడీపీకి జ‌గ‌న్ గ‌ట్టి ఝ‌ల‌క్ ఇచ్చారు. మండ‌లి ర‌ద్దు చేస్తూ తీర్మానం చేశారు. ఈ స‌మయంలో చంద్రబాబు మండ‌లిని ర‌ద్దు చేయ‌డం అన్యాయం అంటూ మీడియా ముందు దంచేశారు. దీనిని సభ‌లో ప్రస్తావించిన వైసీపీ ఎమ్మెల్యేలు ఈ క్రమంలోనే 2007లో అప్పటి సీఎం వైఎస్ పునః ప్రారంభించిన మండ‌లి గురించి బాబు చేసిన ప్రసంగాన్ని వీడియో రూపంలో ప్రసారం చేశారు.

కౌంటర్ ఇస్తూ….

మండ‌లి వ‌ల్ల ప్రయోజ‌నం లేద‌ని, ఖ‌ర్చు త‌ప్ప దానివ‌ల్ల వ‌చ్చేది కూడా ఏమీ లేద‌ని చంద్రబాబు అప్పట్లో సుదీర్ఘ ఉప‌న్యాసం ఇచ్చారు. ఇప్పుడు ఇవే విష‌యాన్ని జ‌గ‌న్ ప్రభుత్వం చెబుతోంది. దీనికి మ‌ద్దతుగానే చంద్రబాబు అప్పట్లో ఏమ‌న్నారో అసెంబ్లీలో ప్రస్తావించారు. అయితే, దీనికి కౌంట‌ర్‌గా చంద్రబాబు మ‌ళ్లీ ప్రెస్‌మీట్ పెట్టారు. అవును.. నేను అప్పుడు అన్నాన‌ని ఒప్పుకున్నారు (రికార్డులు ఉన్నాయి కాబ‌ట్టే) ఆ వెంట‌నే త‌న‌దైన శైలిలో మాట్లాడుతూ.. అప్పుడు సిద్ధాంతం అది. ఇప్పుడు మార్చుకున్నామ‌ని చెప్పారు.

కాలానికి అనుగుణంగా….

అయినా కాలానికి అనుగుణంగా సిద్ధాంతాలు మార్చుకుంటే త‌ప్పేంటి? అని ప్రశ్నించారు. ఆ వెంట‌నే సోష‌ల్ మీడియా జ‌నాలు ఆస‌క్తిగా స్పందిచారు. ఔను బాబూ.. సిద్ధాంతాలు మార్చుకోవాల్సిందే. కానీ, ప్రజ‌ల కోణాన్ని పూర్తిగా ప‌క్కన పెట్టి వ్యవ‌హ‌రిస్తే ఎలా? అంటూ త‌లంటారు. మొత్తంగా సిద్దాంతాలు మార్చుకుంటూ ప్రజ‌ల‌ను విస్మరిస్తే ఇలానే ఉంటుంద‌నే నీతిని బోధించార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News