బాబు హ‌డావుడి క‌లిసి వస్తుందా?

రాష్ట్ర వ్యాప్తంగా త్వర‌లోనే స్థానిక సంస్థల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ క్రమంలో అధికార పార్టీ ప్రజ‌ల ను ప్రస‌న్నం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. సాధార‌ణ ఎన్నిక‌ల్లో [more]

Update: 2020-01-13 00:30 GMT

రాష్ట్ర వ్యాప్తంగా త్వర‌లోనే స్థానిక సంస్థల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ క్రమంలో అధికార పార్టీ ప్రజ‌ల ను ప్రస‌న్నం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. సాధార‌ణ ఎన్నిక‌ల్లో 151 మంది ఎ మ్మెల్యేల‌ను సొంతం చేసుకున్న వైసీపీ భారీ మెజారిటీతో అధికారంలోకి వ‌చ్చింది. ఏడు మాసాల పాల‌న తర్వాత జ‌గ‌న్ ప్రభుత్వం ఇప్పుడు కీల‌క‌మైన స్థానిక సంస్థల ఎన్నిక‌ల‌ను ఎదుర్కొన‌నుంది. ఈ క్రమంలో ఆ పార్టీ ఇప్పటికే ప్రవేశ పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు స‌హా అనేక ప‌థ‌కాల‌ను తెర‌మీదికి తెచ్చి జెండాపై జ‌రిగే ఎన్నిక‌ల్లో ప్రచారం చేసుకునేందుకు ప్రయ‌త్నిస్తోంది. మ‌రి ఈ సమ‌యంలో ప్రధాన ప్రతిప‌క్షంగా ఉన్న టీడీపీ ప‌రిస్థితి ఏంటి? అనే ప్రశ్న తెర‌మీదికి వ‌స్తోంది.

బాబు వెంట ఉంది….

గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీ ఘోరంగా ప‌రాజ‌యం పాలైంది. కేవ‌లం 23 మంది మాత్రమే టీడీపీకి ఎమ్మెల్యేలు మిగిలారు. అయితే, వారిలోనూ ఇద్దరు త‌ట‌స్థులుగా మారిపోయారు. దీంతో ఇక‌, మిగిలింది 21 మంది. వీరిలో ప్రత్యక్షంగా చంద్రబాబు వెంట తిరుగుతున్నది కేవ‌లం 10 మందికి మించ‌డం లేదు. దీంతో టీడీపీబలం కానీ, టీడీపీ వాయిస్‌కానీ ప్రభావం చూపించ‌డం లేదు., ఇదిలావుంటే, చాలా మంది నాయకులు పార్టీమారిపోయారు. దీంతో చాలా మేర‌కు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ, మండ‌ల స్థాయిలోనూ కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో స‌రైన నాయకులు లేని ప‌రిస్థితి ఏర్పడింది. దీంతో టీడీపీ గ‌డ్డు ప‌రిస్థితి ఎదుర్కొంటోంద‌ని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

నడిపించేవారేరీ?

ఇక మొత్తం 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో 20 నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ జెండా మోసి.. పార్టీని ముందుకు న‌డిపించే వాళ్లే లేరు. అస‌లు అక్కడ పార్టీ త‌ర‌పున స్థానిక ఎన్నిక‌ల బాధ్యత‌లు ఎవ‌రు చూస్తారో ? తెలియ‌క అయోమ‌యం నెల‌కొంది. అయితే, గ‌డిచిన 20 రోజులుగా చంద్రబాబు కొంత హడావుడి చేస్తున్నారు. రాజ‌ధాని విష‌యంలో ప్రభుత్వం వ్యూహాన్ని ఆయ‌న ముందుగానే ఎండ‌గ‌డుతూ నిరాహార దీక్షలు, నిర‌స‌న‌లు, ధ‌ర్నాల పేరుతో ప్రభుత్వంపై విమ‌ర్శలు గుప్పిస్తున్నారు. ఇక‌, ఇసుక స‌మ‌స్యల‌పైనా ఆయ‌న గ‌తంలో ప్రజ‌ల మధ్య ఉన్నారు. దీంతో ఇప్పుడు ఇవి ఫ‌లిస్తాయా? ఆయ‌న‌కు ప్లస్ అవుతాయా? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. అయితే, రాజ‌ధాని విష‌యంలో గుంటూరు, కృష్ణాజిల్లాల్లో చంద్రబాబు ఆందోళ‌న‌లు చేయ‌గ‌లుగుతున్నా విశాఖ స‌హా ఉత్తరాంధ్ర, సీమ ప్రాంతాల్లో మాత్రం ఆయ‌న హవా సాగ‌డం లేదు.

ఈ జిల్లాలో మాత్రం…..

మెజారిటీ ప్రజ‌లు విశాఖ‌కు ఓకే అన్నార‌ని, సీమ‌లో హైకోర్టుకు చాలా మంది నాయ‌కులు కూడా సై అన్నార‌ని వార్తలు వ‌స్తున్నాయి. దీంతో ప్రభుత్వ వ్యూహ‌మే అంతిమంగా స‌క్సెస్ అవుతోంద‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే, చంద్రబాబుపై ఉన్న సానుభూతి ఏమ‌న్నా ప‌నిచేస్తే మాత్రం పుంజుకునే అవ‌కాశం ఉంది. గోదావ‌రి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మాత్రం టీడీపీకి కొంత సానుకూల ఫ‌లితాలు రావొచ్చేమో ? చూడాలి.

Tags:    

Similar News