ఇంకా అర్థం కానట్లుంది

చంద్రబాబు నాయుడు ఇప్పటికీ తాను ఓటమి పాలయ్యానన్న స్పృహలో లేనట్లుంది. బోస్టన్ కమిటీ ని నియమించే అధికారం ఎవరిచ్చారంటారు? అసలు నా విజన్ ను పక్కన పెట్టి [more]

Update: 2020-01-04 11:00 GMT

చంద్రబాబు నాయుడు ఇప్పటికీ తాను ఓటమి పాలయ్యానన్న స్పృహలో లేనట్లుంది. బోస్టన్ కమిటీ ని నియమించే అధికారం ఎవరిచ్చారంటారు? అసలు నా విజన్ ను పక్కన పెట్టి కొత్తగా ఈ బోస్టన్ కమిటీ ఏంటని చికాకు పడతారు. తాను అన్ని జిల్లాలను అభివృద్ధి చేయాలని భావిస్తే అన్నీ ఈ వైసీపీ నేతలు చెడగొడుతున్నారంటారు. విశాఖలో ఆఫ్టర్ హుద్ హుద్ పోస్ట్ హుద్ హుద్ ప్రస్తావన ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. నిజానికి చంద్రబాబు ఇప్పుడు ప్రతిపక్ష నేత మాత్రమే. రాత్రంతా బీసీజీ కమిటీని చదివుతూనే ఉన్నానని చంద్రబాబు చెప్పారు.

అమరావతిని కొనసాగించమనడంలో…..

ఆయన రాజధానిని అమరావతిలో కొనసాగించాలని డిమాండ్ చేయడంలో ఎటువంటి తప్పులేదు. అయితే తాను తెస్తామనుకున్న వాటన్నింటినీ జగన్ ప్రభుత్వం తొలగిస్తామని చెబుతుండటం విశేషం. ప్రకాశం జిల్లాలో తాను 25 కోట్లతో పేపర్ పరిశ్రమను తేవాలని నిర్ణయించుకుంటే జగన్ పక్కన పెట్టేశారన్నారు. విశాఖపట్నంలో అదానీ గ్రూపును, లూలూ గ్రూపును పంపేశారని చెప్పారు. అమరావతిలో తాను ప్రముఖ విద్యాసంస్థలు, ఆస్పత్రులు ఎన్నో వచ్చాయని, అవి కార్యరూపం దాల్చి ఉంటే అమరావతి ఎక్కడికో వెళ్లేదన్నారు చంద్రబాబు.

మొత్తం నాశనం చేస్తున్నాడంటూ….

జగన్ వచ్చి అన్నీ నాశనం చేస్తున్నాడన్నారు. కర్నూలు ఓర్వకల్లులో తాను ఎయిర్ పోర్టు కడితే కనీసం జగన్ అక్కడకు ఫ్లైట్ కూడా వేయలేకపోయారన్నారు. ఐదు కోట్ల మంది ప్రజలు జీవితాలతో ఆటలాడుకుంటున్నారన్నారు. రీ ఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం డిస్ట్రిబ్చూషన్ క్యాపిటల్స్ ఎక్కడైనా ఉందా? అని చంద్రబాబు ప్రశ్నించారు. గ్రీన్ ఫీల్డ్ సిటీలన్నీ ప్రపంచ వ్యాప్తంగా ఫెయిలయ్యాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. హైదరాబాద్ తానే కట్టానని చెప్పారు. అర్థం కానిదొకటే చంద్రబాబు ప్రతిరోజూ మీడియా సమావేశం పెట్టి అమరావతికి ఉన్న అనుకూల అంశాలు చెబితే జగన్ వింటాడా? అమరావతిని కొనసాగిస్తాడా? బాబు పిచ్చి గాని.

జగన్ కు విశ్వసనీయత లేదంటూ….

జగన్ కు అసలు విశ్వసనీయత లేదని, ప్రావీణ్యత కూడా లేదన్నారు. తన హయాంలో జీడీపీ పెరిగితే జగన్ వచ్చాక పూర్తిగా పడిపోయిందన్నారు. అమరావతిని నిర్మించాల్సిందేనని చెప్పారు. ఎవరిని మోసం చేయడానికి హై పవర్ కమిటీ అని ప్రశ్నించారు. మొత్తం మీద చంద్రబాబు మీడియా సమావేశం చూస్తే జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏమీ చేయలేదని తేల్చారు. జగన్ కు ఎటువంటి అధికారాలు లేవన్నారు. బోస్టన్ కమిటీ పై కూడా చంద్రబాబు మండిపడ్డారు. తాను చేసిన అభివృద్ధి బోస్టన్ కమిటీకి కనపడలేదా? అని ప్రశ్నించారు. బోస్టన్ కమిటీ రిపోర్ట్ వచ్చినప్పుడే చంద్రబాబు ఇలా స్పందిస్తే రేపు అసెంబ్లీలో తీర్మానం వరకూ వస్తే ఎలా రియాక్ట్ అవుతారో? అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News