రోడ్డెక్కినప్పుడల్లా ఓ ఎమ్మెల్యేనట

చంద్రబాబునాయుడు ఓ వైపు చెలరేగిపోతున్నారు. జగన్ ని నానా మాటలూ అంటున్నారు. గూగుల్లో సెర్చ్ చేస్తే జగన్ ఖైదీ నంబర్ బయటకు వస్తుందని, ఆయనా మనకు ముఖ్యమంత్రి [more]

Update: 2020-01-03 05:00 GMT

చంద్రబాబునాయుడు ఓ వైపు చెలరేగిపోతున్నారు. జగన్ ని నానా మాటలూ అంటున్నారు. గూగుల్లో సెర్చ్ చేస్తే జగన్ ఖైదీ నంబర్ బయటకు వస్తుందని, ఆయనా మనకు ముఖ్యమంత్రి అంటూ దారుణంగా సెటైర్లు వేస్తున్నారు. జగన్ ఏపీకి పట్టిన విలన్ అంటున్నారు. జగన్ ని ఎన్నుకోవద్దు బాబూ అని తాను ఎంతలా మొత్తుకున్నా కూడా వినలేదని, ఇపుడు అనుభవిస్తున్నారని కూడా ఓటేసిన ప్రజలకే శాపనార్ధాలు పెడుతున్నారు. ఓ విధంగా చంద్రబాబు చెవిలో జోరీగలా వైసీపీ సర్కార్ కి మారారు. దాంతో వైసీపీ కూడా రివర్స్ లో అటాక్ స్టార్ట్ చేసింది.

జగన్ వద్దకు తమ్ముళ్ళు….

బాబు ఇసుక, ఇంగ్లీష్ అని తెగ సతాయిస్తున్న వేళ ఆయనకు నమ్మిన బంటుగా ఉన్న కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చంద్రబాబు మీద విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఇసుక దీక్ష చేస్తూంటే ఆయన్ని చెడా మడా కడిగేస్తూ వంశీ ఇచ్చిన షాక్ అలా ఇలా కాదుగా. ఏకంగా జగన్ ని కలసి వచ్చి ఆయన మంచి ముఖ్యమంత్రి అనేశారు. ఈ దెబ్బతో టీడీపీ ఊపు దారుణంగా తగ్గిపోయింది. మళ్ళీ శక్తి కూడదీసుకుని ఇపుడు అమరావతి అంటూ చంద్రబాబు నానా యాగీ చేస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో గుంటూర్ వెస్ట్ ఎమ్మెల్యే గిరి జగన్ ని కలిశారు. అంతేనా చంద్రబాబుని ఆత్మ విమర్శ చేసుకోమన్నారు. అది సున్నితంగా చెప్పలేదు, అచ్చం వైసీపీ భాషలోనే చెపారు. దాంతో మరో వికెట్ టీడీపీ నుంచి పడిందని అంతా అంటున్నారు.

కులతత్వం బురద….

చంద్రబాబు మీద వైసీపీ చేస్తున్నది అదే ఆరోపణ, అసలు అమరావతి రాజధాని వెనక చంద్రబాబు సొంత కులోధ్ధరణే ఉందని వైసీపీ గట్టిగా నాడూ నేడూ వాదిస్తోంది. దాన్ని నిజం చేస్తూ టీడీపీ ఎమ్మెల్యే తమ్ముడే గట్టిగా ఆరోపణలు చేస్తే జనంలోకి బాగా వెళ్తాయి కదా. ఇపుడు అదే జరుగుతోంది. ఎమ్మెల్య్హే గిరి చంద్రబాబుకు కులం రంగు పూశారు. గుంటూరులో 17 ఎమ్మెల్యే సీట్లు ఉంటే చంద్రబాబు తన సొంత సామాజికవర్గానికి పది సీట్లు ఇచ్చారని, ఇంతకంటే కులతత్వం ఉంటుందా అని గిరి సంధించిన బాణానికి పసుపు పార్టీ అధినేత విలవిలలాడాల్సిందేగా. మరి ఇక చంద్రబాబు అమరావతి రైతులతో కలసి చేసిన రాజధాని ధర్నాలో తనకు కులం అంటగడతారా అంటూ జగన్ మీద గట్టిగా హూంకరించారు. దానికి బదులు చెప్పింది వైసీపీ నేతలు కాదు, చంద్రబాబు టికెట్ ఇచ్చి గెలిపించిన ఎమ్మెల్యే తమ్ముడే. ఈ రిటార్ట్ సరిపోతుందేమో కదా అంటోంది వైసీపీ.

హోదాకూ ఎసరు….

ఈ జోస్యాన్ని శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రి ధర్మాన కృష్ణ దాస్ చెబుతున్నారు. ఇప్పటికి ఇద్దరు దూరమయ్యారు. మరో నలుగురు లైన్లో ఉన్నారని కూడా కృష్ణ దాస్ అంటున్నారు. వారు కనుకు కంచె దాటితే చంద్రబాబు హోదా గోవిందా అంటున్నారు. ఇప్పటికే తమతో చాలా మంది ఎమ్మెల్యే త‌మ్ముళ్ళు టచ్ లో ఉన్నారని కూడా ఆయన చెబుతున్నారు. మొత్తానికి చంద్రబాబు ఒక్కో అంశం మీద రోడ్డు మీదకు వస్తూంటే అది జనాలకు ఎందుకో రీచ్ కావడం లేదు సరికదా ఒక్కో ఎమ్మెల్యే పార్టీ నుంచి దూరమైపోతున్నారు. రానున్న రోజుల్లో చంద్రబాబుకు ఇలా ఎంత మంది షాకులు ఇస్తారో, మంత్రి దాసన్న జోస్యం నిజం అవుతుందో లేదో చూడాలి.

Tags:    

Similar News