భూములన్నీ బ్లాక్ చేశారటగా

అదేంటి చంద్రబాబు తెల్లారిలేచిన దగ్గర నుంచి అమరావతి అంటూ కలవరిస్తారు కదా. ఆయన కలల రాజధాని అదే కదా అన్న సందేహం ఎవరికైనా వస్తుంది. డౌట్ ఇంకా [more]

Update: 2020-01-05 12:30 GMT

అదేంటి చంద్రబాబు తెల్లారిలేచిన దగ్గర నుంచి అమరావతి అంటూ కలవరిస్తారు కదా. ఆయన కలల రాజధాని అదే కదా అన్న సందేహం ఎవరికైనా వస్తుంది. డౌట్ ఇంకా ఉందేమోనని తన సతీమణి భువనేశ్వరి ద్వారా కూడా చంద్రబాబు ఇంట్లో తాను అమరావతి గురించే పదే పదే మాట్లాడుతానని చెప్పించుకున్నారు. మరి ఇంత చేసిన చంద్రబాబుకు అమరావతి కాకుండా విశాఖ అయినా రాజధానిగా ఓకేనా అంటే. అవును బాగానే ఉంటుందని మంత్రి బొత్స సత్యనారాయణ అంటున్నారు. ఆయన చంద్రబాబుమనసులో ఎలా దూరారో కానీ విశాఖ రాజధాని అయినా చంద్రబాబుకు వచ్చిన నష్టం లేదని, పైగా మహా ఇష్టం కూడానని తేల్చేశారు.

అన్నింటా వారేనటగా…?

విశాఖ అయినా విజయవాడ అయినా పెద్దగా తేడా ఏముంది, అక్కడా ఇక్కడా కూడా చంద్రబాబు సామాజికవర్గం డామినేషనే కదా అని బొత్స రాజకీయ వేదాంతం వల్లిస్తున్నారు. చంద్రబాబుకు విశాఖలో ఏం తక్కువని కూడా ఆయన అంటున్నారు. ఎటు చూసిన తన సొంత కులస్థులే కనిపిస్తారని, వారు కూడా రాజధాని వచ్చిందని తెగ సంబరపడుతున్నారని కూడా బొత్స చెప్పుకొస్తున్నారు. అందువల్ల చంద్రబాబుకు విశాఖ అయినా బాగా ఇష్టమేనని అయితే అమరావతిలో అమాయ‌క రైతులను రియల్ ఎస్టేట్ ముగ్గులోకి దించి భూ దందా చేసిన ఫలితంగానే అక్కడ పెడబొబ్బలు పెడుతున్నారని బొత్స హాట్ కామెంట్స్ చేశారు.

నిజమే కదా..?

విషయానికి వస్తే విశాఖ నిండా కూడా వ్యాపార వాణిజ్య కేంద్రాలు టీడీపీ సొంత సామాజికవర్గం చేతుల్లోనే ఉన్నాయి. వారే భూములను దగ్గర వుంచుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని మూడు జిల్లాలూ కూడా దాటేసి ఒడిషా వరకూ తీసుకుపోయారు. ఇపుడు రాజధాని పేరిట భూములకు ఒక్కసారిగా రెక్కలు వస్తే లాభపడేది కూడా వారే. ఆ సంగతే బొత్స తనదైన శైలిలో చెప్పేశారు. మరి జగన్ భావిస్తున్నట్లుగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో నూటికి ఎనభై శాతం పైగా ఉన్న బీసీలు రాజధాని రాకతో బాగుపడతారా అంటే వారికి వలసలు కొంత తప్పి ఇక్కడ కూలి దొరకుతుందని మేధావులు కూడా అంటున్నారు. అంటే ఎక్కడ రాజధాని అయినా కూడా అధికార కేంద్రాలకు దగ్గరగా ఉండేవారిదే హవా అని ఉత్తరాంధ్ర మంత్రి బొత్స స్వయంగా చెప్పేశాక ఇక ఆ జోష్ ఈ ప్రాంత వాసుల్లో ఏమ్నుంటుంది మరి.

బ్లాక్ చేశారా…?

ఇదిలా ఉండగా నిన్నటి వరకూ విశాఖ చుట్టుపక్కల ప్రాంతాలలో భూముల ధరలు బాగా పడిపోయాయి. దానికి తోడు రియల్ బూమ్ స్తబ్దుగా ఉంది. దాంతో ఇక్కడ ఇక కష్టమేనని అంతా అనుకున్నారు. సరిగ్గా ఈ సమయంలో జగన్ చేసిన రాజధాని ప్రకటనతో ఒక్కసారిగా రెక్కలు విప్పుకున్నట్లైంది. భూములను సైతం బ్లాక్ చేసిన ఘటనలూ ఉన్నాయి. మంచి రేటు కోసం అట్టేపెట్టుకుని రియల్టర్లు ఆ ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నరు. మొత్తానికి ఉత్తరాంధ్ర మంత్రిగా వర్తమాన పరిస్థితులను సరిగ్గానే అంచనా వేసిన బొత్స చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చారని అంటున్నారు.

Tags:    

Similar News