బాబు అవుట్ డేట్ అయినట్లేనా?

ఒక ఉద్యోగి పదవీ విరమణ వయసు వెనకటికి 55 ఏళ్ళు మాత్రమే. సగటు జీవిత కాలం పెరిగింది కాబట్టి ఇపుడు 60 ఏళ్ళు. మరి రాజకీయ నాయకులకు [more]

Update: 2019-09-15 05:00 GMT

ఒక ఉద్యోగి పదవీ విరమణ వయసు వెనకటికి 55 ఏళ్ళు మాత్రమే. సగటు జీవిత కాలం పెరిగింది కాబట్టి ఇపుడు 60 ఏళ్ళు. మరి రాజకీయ నాయకులకు రిటైర్మెంట్ లేదా అన్న ప్రశ్న ఎపుడూ వస్తూంటుంది. స్వచ్చందంగా తప్పుకుంటే ఉత్తమ నాయకులుగా మిగులుతారు. లేకపోతే జనమే వారిని పక్కన పెడతారు. దేశంలో ఇపుడు అదే జరుగుతోంది. డెబ్బయి రెండేళ్ల స్వతంత్ర భారతావనిలో ఇపుడు కొత్త యుగం నడుస్తోంది. ఇదివరకులా నాయకులను సుదీర్ఘకాలం భరించే ఓపిక తీరిక ఇప్పటి జనాల్లో లేవు, పైగా అంచనాలు కూడా భారీగా ఉంటున్నాయి. వాటిని అందుకోవడంతో గెలిచిన వాళ్ళు శరవేగంతో పరుగులు తీయాల్సివస్తొంది. ఈ నేపధ్యంలో అనేక సార్లు ఎన్నికల్లో గెలిచి పదవులు పట్టాలంటే ఎవరికో తప్ప అందరికీ సాధ్యమయ్యే విషయం కావడంలేదు.

బాబు తరం ముగిసిందా…?

చంద్రబాబు రాజకీయాల్లోకి 1975లో వచ్చారు. ఆయన యువజన కాంగ్రెస్ నాయకుడిగా ఉంటూ అప్పట్లో కాంగ్రెస్ పార్టీ పెట్టిన కోటా మూలంగా యువకులకు 20 శాతం సీట్లు దక్కి తానూ 28 ఏళ్ల వయసులో ఎమ్మెల్యేగా అయ్యారు. 30 ఏళ్ల వయసులో మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తరువాత అంజయ్య జంబోజెట్ మంత్రులు 70 మంది కధలాగానే చంద్రబాబు రాజకీయం ముగిసేదో ఏమో కానీ అన్న నందమూరి అల్లుడు కావడం వల్లనే ఆయనకు సుదీర్ఘ రాజకీయ జీవితం ప్రాప్తించిందని అన్న వారూ ఉన్నారు. ఎన్టీయార్ టీడీపీలో చేరి రెండవస్థానానికి ఎగబాకి చివరికి పార్టీ పెట్టిన పుష్కర కాలం తరువాత అదే కుర్చీ నుంచి మామను తొల‌గించి ముఖ్యమంత్రి అయిపోయారు చంద్రబాబు. నాటి నుంచి నేటి వరకూ గెలుపు ఓటములను చంద్రబాబు చూస్తూనే మూడు మార్లు ముఖ్యమంత్రి పదవి పూర్తి చేశారు. ఇపుడు చూస్తే చంద్రబాబు వయసు డెబ్బయ్యళ్ళు. ఆయన ఎంత చురుకుగా ఉన్నారనుకున్నా ఈనాటి తరంతో కనెక్ట్ కాలేని పరిస్థితి. ఆయన జమిలి ఎన్నికలు ఎంతలా కోరుకున్నా జగన్ కనీసంగా మూడేళ్ళ పాటు సీఎం గా ఉండడం ఖాయం. అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయో. చంద్రబాబు సైతం ఎంతవరకూ పార్టీని నడిపిస్తారో కూడా తెలియదు. ఈ కారణంగానే తమ్ముళ్లు పార్టీకి దూరంగా జరుగుతున్నారు.

ఆ పోలిక తెస్తే కష్టమే…..

చంద్రబాబు అనుకుంటున్నట్లుగా 2022లో ఎన్నికలు వచ్చి పోటీ చేసినా అప్పటికీ యువకుడిగా ఉన్న జగన్ తో చంద్రబాబు పోటీ పడాలి, అనుభవం కార్డు ఇద్దరికీ ఉంటుంది. మరి వయసు విషయంలో జగన్ ని తట్టుకుని తాను మరో అయిదేళ్ళు ఏపీని నిబ్బరంగా పాలించగలనని చంద్రబాబు ఎంతవరకూ జనానికి భరోసా ఇవ్వగలరన్నది కూడా చూడాలి. ఏ విధంగా చూసుకున్నా జగన్ అప్పటికి రాజకీయంగా రాటుదేలివుంటారు. చంద్రబాబు ఎత్తులకు పై ఎత్తులు వేసే స్థితిలో ఉండడమే కాదు, అధికారం, అంగబలం, అర్ధబలంతో ఢీ కొట్టేందుకు కూడా సిధ్ధంగా ఉంటారు. చంద్రబాబు తన పార్టీని సంతరించుకుంటూ జగన్ తో పోటీ పడి గెలవడం అంటే ఓ విధంగా కష్టసాధ్యమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇవన్నీ చూసినపుడు చంద్రబాబుకు 2019 ఓటమి ఓ విధంగా రిటైర్మెంట్ కి దగ్గర దారి చూపించిందా అన్న ఆలోచన వస్తుంది. రాజకీయాల్లో ఉన్నాక పదవుల లాలస సహజం. కానీ ఎక్కడో ఓ చోట ఫుల్ స్టాప్ దేనికైనా ఉంటుంది, అది ఎవరు కోరుకున్నా కోరుకోకపోయినా జరిగి తీరుతుంది. ఏపీలో జగన్ గెలవడం ద్వారా నవతరానికి బాటలు వేశారు, అందువల్ల రాజకీయం అలా ముందుకు పోతుంది తప్ప వెనక్కు మళ్ళడం అంటే కష్టసాధ్యమే.

Tags:    

Similar News