ఓటమి కంటే ఇదే విషాదమా?

చంద్రబాబునాయుడు పరిస్థితి చూస్తే కొత్త ఏడాది వేడుకలను కూడా జరుపుకోలేకుండా పోవడం అంటే దానికి ఆయనే ప్రధాన కారణమని చెప్పాలి. ఈ ఏడాది టీడీపీ మహానాడు కూడా [more]

Update: 2020-01-01 06:30 GMT

చంద్రబాబునాయుడు పరిస్థితి చూస్తే కొత్త ఏడాది వేడుకలను కూడా జరుపుకోలేకుండా పోవడం అంటే దానికి ఆయనే ప్రధాన కారణమని చెప్పాలి. ఈ ఏడాది టీడీపీ మహానాడు కూడా చంద్రబాబు జరపలేదు. పార్టీకి జోష్ ఇచ్చే అతి పెద్ద పార్టీ కార్యక్రమం అది. ఎన్నికల్లో ఘోరంగా ఓడిన వెంటనే వచ్చిన ఈ వేడుకను రద్దు చేశేశారు. ఇక ఇపుడు 2020 లోకి అడుగుపెడుతున్న వేళ విషాదం ముఖం నిండా పులుముకుంటున్నారు. ఎవరి చేసినది వారినే వెంటాడుతుందన్నట్లుగా చంద్రబాబు ఇపుడు సమస్యల సుడిగుండంలో పడిపోయారు. గట్టిగా చెప్పాలంటే గత రెండేళ్ళుగా ఆయన ఆందోళనలోనే ఉన్నారు. దానికి ఓడిన తరువాత వచ్చిన బాధలు పెద్ద బోనస్.

పార్టీ కంటే ….

నిజానికి పరిణితి చెందిన నాయకుడు ఎవరైనా పార్టీని ముందు చూసుకుంటాడు. అనుభవం ఉన్న వారు ప్రాంతీయ స్థాయి భేదాలను అధిగమిస్తారు. చంద్రబాబు వరకూ చూసుకుంటే ఆయన ఒకపుడు 23 జిల్లాలకు చెందిన పెద్ద నాయకుడు. మరిపుడు ఆయన కేవలం రెండు జిల్లాల పోరాటానికే మద్దతుగా నిలబడడం అంటే ఎంతటి అనివార్యత ఆయన్ని అలా నెట్టిందో చూడాలి. సొంత సామాజికవర్గం మద్దతుతోనే టీడీపీ రాజకీయాలను ఆయన చేయగలరు. అర్ధబలం, అంగబలం అక్కడ నుంచే వస్తాయి. అలాంటి కుంభస్థలాన్నే జగన్ కొడుతున్నారన్న ఆందోళన‌తో చంద్రబాబు మిగిలిన ప్రాంతాల ఊసు అసలు తలవడంలేదు. ఇక్కడ వదిలేస్తే టీడీపీ జీరో అన్నది ఆయనకు అర్ధమైపోతోంది. అదే సమయంలో మిగిలిన ప్రాంతాలలో పార్టీకి ఇబ్బందులు ఉన్నా ఆయనకు పట్టడంలేదు.

బాధ్యుడేనా…?

అమరావతిలో రాజధాని అని ప్రకటించిన సమయానికి చంద్రబాబు రాజు అంటే ముఖ్యమంత్రి సీట్లో ఉన్నారు. ఆయన ఆడింది ఆనాడు పాట. తాను ఓడిపోతానని కలలో కూడా అనుకోలేదు. దాంతో సొంత సామాజికవర్గానిక మేలు చేద్దామ‌నుకున్నారు. దానికి తోడు అస్మదీయుల విషయంలో ఉదారంగా వ్యవహరించారు. మరి ఇపుడు జగన్ సీఎం. ఆయన చంద్రబాబు హామీలకు ఒక్కొటిగా పాతర వేస్తున్నారు. అమరావతిని మూడింట ఒక రాజధాని అంటున్నారు. దాంతో చంద్రబాబును నమ్మి భూములు కొని మునిగిన వారు తమ గతేం కానంటూ గట్టిగానే తగులుకుంటున్నారు. ఇది పార్టీ కంటే కూడా చంద్రబాబు ఎదుర్కుంటున్న అతి పెద్ద సవాల్. వారి వత్తిళ్ళతో చంద్రబాబు సైతం బ్యాలన్స్ తప్పుతున్నారని అంటున్నారు.

జీవన్మరణమేనా?

ఓ విధంగా జగన్ చంద్రబాబుకు అతి పెద్ద చాలెంజ్ విసిరారు. అమరావతి రాజధాని మూడుగా చేయడంలో జగన్ మాట నెగ్గితే చంద్రబాబు రాజకీయంగా, ఆర్ధికంగా, సామాజికంగా కూడా కుదేలు అయిపోతారు. పైగా ముఖ్యమంత్రిగా తాను శాసించిన అమరావతి కళ్ళ ముందు కరుగుతుంది. భవిష్యత్తులో చంద్రబాబు పేరిట ఏపీలో ఏమీ చెప్పుకోవడానికి ఉండదు, సైబరాబాద్ అభివ్రుధ్ధి చేశానని బాబు అంటున్నా రాష్ట్రమే మారిన చోట బాబుకు పెద్ద పీట అక్కడ వేయరు. సొంత గడ్డ మీద అదే పరిస్థితి ఎదురుకావడమే చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు. ఓ విధంగా ఆయన‌కు జీవన్మరణ సమస్యగా అమరావతి రాజధాని వివాదం ఉంది. అందుకే ఎన్నడూ లేనిది ఆయన కంటతడి కూడా పెడుతున్నారు. ఎన్నికల్లో ఘోర ఓటమి కంటే ఇది అతి పెద్ద విషాదంగా చంద్రబాబు పరిగణిస్తున్నారు.

Tags:    

Similar News