బాబు హెల్ప్ లెస్….అయ్యారా?

పిల్లి గుడ్డిదైతే ఎలుక ఎదురుగా వెళ్ళి డ్యాన్స్ చేస్తుందని సామెత. అధికారం లేని అధినేత కూడా అందుకే నాయకులకు అలుసు అయిపోతారని అంటున్నారు. చేతిలో దండం ఉంటే [more]

Update: 2019-12-14 08:00 GMT

పిల్లి గుడ్డిదైతే ఎలుక ఎదురుగా వెళ్ళి డ్యాన్స్ చేస్తుందని సామెత. అధికారం లేని అధినేత కూడా అందుకే నాయకులకు అలుసు అయిపోతారని అంటున్నారు. చేతిలో దండం ఉంటే భయపడతారు, లేకపోతే చెడుగుడే ఆడుతారు. ఇపుడు టీడీపీలో తమ్ముళ్ళ క్రమశిక్షణ కూడా అలాగే ఉంది. పార్టీ చూస్తే చరిత్రలో కనీ వినీ ఎరుగని విధంగా ఓడిపోయింది. బలమైన యువ నేత జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అన్ని వైపులా ప్రతికూల పరిస్థితులు. దాంతో ఏదో విధంగా కమలం పార్టీతో కరచాలనం చేయాలన్నది చంద్రబాబు ఆలోచన. అందుకే ఆయన ఆరు నెలలుగా కిమ్మకుండా ఉన్నారు.

బీజేపీని చేరేందుకు…..

బీజేపీని చేరేందుకు దారేదీ అని తెగ వెతుకుతున్నారు. రాజ్యసభ, లోక్ సభల్లో కూడా మోడీ ఏ బిల్లు పెట్టినా మాట్లాడ‌కుండా తమ ఎంపీల చేత ఓటేయించేస్తున్నారు. తాజాగా పౌరసత్వ సవరణ బిల్లుకు కూడా చంద్రబాబు తమ ఎంపీ తమ్ముళ్ళను బీజేపీకి ఓటేయమన్నారు. అయితే లోక్ సభలో ఉన్న ముగ్గురు ఎంపీల్లో ఒకే ఒక్కడుగా ఉన్న కేశినేని నాని ససేమిరా అంటూ తలాయించేశారు. గల్లా జయదేవ్, కింజరపు రామ్మోహననాయుడు ఓటు చేస్తే కేశినేని బయటకు వెల్ళిపోయారు. అంతటితో వూరుకోకుండా ఆయన ఇది నా మనస్సాక్షి చెప్పిన నిర్ణయం అని స్టేట్మెంట్ కూడా మీడియాకు ఇచ్చారు.

బాబుకు ఝలక్ …..

ఆరు నెలల క్రితం తనకు పార్టీ పదవి ఇవ్వలేదని అలిగిన కేశినేని మధ్యలో మెత్తబడ్డారని అంతా అనుకున్నారు కానీ ఆయన మాత్రం నేను బయటకు ఎలా ఉన్నా లోపల ఆ కోపం అసంతృప్తి అలాగే ఉందని తాజా సంఘటనతో చాటి చెప్పారు. చంద్రబాబుకు టైమ్ చూసి దెబ్బ కొట్టారు. నిజానికి లోక్ సభలో బీజేపీకి మద్దతు బాగానే ఉంది. పైగా 22 మంది వైసీపీ ఎంపీలు కూడా ఓటు చేశారు. అయితే ముగ్గురు మాత్రమే ఉన్న టీడీపీ నుంచి పూర్తిగా ఓట్లు వేయించలేకపోయరన్న నిందను మాత్రం చంద్రబాబు మోయాల్సివచ్చింది. బీజేపీ సైతం పార్టీపై చంద్రబాబు పట్టు జారుతోందన్న సంగతిని చూసి మరింత చులకన చేస్తుందని కంగారు పడుతున్నారు.

జేసీ మార్క్ షాక్….

మరో వైపు టీడీపీలో సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కూడా ఏకంగా అసెంబ్లీ లాబీల్లోనే చంద్రబాబును చేవలేని నేత అనేశారు. జగన్ కి ఉన్న తెగింపు చంద్రబాబుకు లేదని, జగన్ గుండె ధైర్యం ఉన్న నేత అంటూ కితాబు ఇచ్చాక చంద్రబాబు పరిస్థితి ఎలా ఉంటుందో వూహించుకోవచ్చు. అంతటితో ఆగకుండా చంద్రబాబు ఏమనుకున్నా సరే జగన్ డేరింగ్ లీడర్ అంటానని కూడా క్లారిటీగా చెప్పేశారు. జగన్ ఆరోగ్రశ్రీ స్కీం బాగుందని, ఆయన ఎదురుపడితే కోరి మరీ అభినందిస్తానని కూడా జేసీ అంటున్నారు. మరి జేసీ ధైర్యం కూడా చంద్రబాబు ఏమీ చేయలేడనే కదా.

నిస్సహాయతతో అలా….

చంద్రబాబు ఇపుడు పూర్తిగా నిస్సహాయతతో ఉన్నారు. చూస్తే ఎంపీలు తక్కువ, ఎమ్మెల్యేలు తక్కువ. రాజకీయంగా ముళ్ళ దారి తప్ప రాదారి కానరావడం లేదు. ఆరు నెలలు పూర్తి అయినా టీడీపీ బండి ట్రాక్ లో పడలేదు. రేపటి రోజులు ఎలా ఉంటాయో కూడా అర్ధం కావడంలేదు. దీంతో చంద్రబాబు తమ్ముళ్ళు ఎలా తోక జాడించినా ఏమనలేకపోతున్నారు. అదే అలుసుగా తీసుకుని ఎవరికి తోచిన విధంగా వారు మీడియా ముందుకు వచ్చేస్తున్నారు, చంద్రబాబు పరువు తీసేస్తున్నారు. మరి చంద్రబాబు చేతులు బలోపేతం అయ్యే అవకాశం ఉందా. లేకపోతే అధికారాంతమున ఇలాంటి అవమానాలు మరెన్ని చూడాలో కదా అని సొంత పార్టీలోనే కామెంట్స్ పడుతున్నాయి.

Tags:    

Similar News