సెట్ చేయలేక…వారిని ఉంచలేెక…?

కృష్ణా జిల్లాలో కొన్ని ద‌శాబ్దాలుగా ఒక వెలుగు వెలిగిన తెలుగుదేశం పార్టీ నేడు అక్కడ నానా ఇబ్బందులు పడుతోంద‌నేది వాస్తవం. బలమైన నాయకత్వం ఉండి కూడా కొంత [more]

Update: 2019-12-07 09:30 GMT

కృష్ణా జిల్లాలో కొన్ని ద‌శాబ్దాలుగా ఒక వెలుగు వెలిగిన తెలుగుదేశం పార్టీ నేడు అక్కడ నానా ఇబ్బందులు పడుతోంద‌నేది వాస్తవం. బలమైన నాయకత్వం ఉండి కూడా కొంత మంది నేత‌ల‌ అనవసర పెత్తనం ఆ పార్టీని తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. బలమైన నియోజకవర్గాలుగా ఉన్న చోట్ల కూడా తెలుగుదేశం ఓడిపోయింది. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది బందరు పార్లమెంట్ సీటు. ఈ పార్లమెంట్ సెగ్మెంట్‌లో వరుసగా రెండు సార్లు కొనకళ్ళ నారాయణ విజయం సాధించారు. 2009లో ప్రజారాజ్యం, నాటి కాంగ్రెస్ ప్రభంజ‌నంలో సైతం ఇక్కడ టీడీపీ జెండాయే ఎగిరింది. ఈ ఎన్నికల్లో కూడా ఆయన ఘన విజయం సాధిస్తారని భావించినా వైసీపీ అభ్యర్ధి వల్లభనేని బాలశౌరి చేతిలో ఓటమి పాలయ్యారు.

సీన్ రివర్స్…..

ఇక టీడీపీ ఓట‌మితో బంద‌రు పార్లమెంటులో ఆ పార్టీ సీన్ పూర్తిగా రివ‌ర్స్ అయ్యింది. పార్ల‌మెంటు సెగ్మెంట్ అంతా ప్రభావం చేసే బలమైన నేత మాత్రం దొరకడం లేదు. కొనకళ్ళ నారాయణ వచ్చే ఎన్నికల్లో వయోభారంతో పోటి చేసే అవకాశం లేదు. ఇప్పటికే ఆ ఫ్యామిలీ క‌న్ను పెడ‌న‌పై ప‌డింది. కొన‌క‌ళ్ల త‌న త‌న‌యుడికి పెడ‌న పార్టీ ప‌గ్గాలు అప్పగించేలా చంద్రబాబుపై ఒత్తిడి చేస్తున్నారు. దీంతో బంద‌రు పార్లమెంటు ప‌గ్గాలు చంద్రబాబు ఎవ‌రికి ఇస్తారో ? తెలియదు.

క్యాడర్ ఉన్నప్పటికీ….

కొద్ది రోజుల క్రితం క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన యువ‌నేత‌కు బంద‌రు పార్లమెంటు ప‌గ్గాలు అప్పగించాల‌ని చంద్రబాబు అనుకున్నారు. అయితే విజ‌య‌వాడ పార్లమెంటుతో పాటు బంద‌రు పార్లమెంటు కూడా ఇదే వ‌ర్గానికి ఇస్తే సామాజిక స‌మ‌తుల్యత నేప‌థ్యంలో ఇబ్బంది ఎదుర‌వు తుంద‌నే మ‌ళ్లీ వెన‌క్కు త‌గ్గార‌ని తెలిసింది. పార్టీకి నియోజకవర్గంలోని అన్ని సెగ్మెంట్ల‌లో బలమైన క్యాడర్ ఉన్నా.. ఇప్పుడు వాళ్ళని నడిపించే నాయకులు మాత్రం లేరు.

ఎవరికిద్దామనుకున్నా…..

ఇక బీసీ కోటాలో మాజీ మంత్రి కొల్లు ర‌వీంద్ర పేరు వినిపించినా ఆయనకు అంత సామర్ధ్యం లేదని పార్టీలోనే అంటున్నారు. ఇక ఇదే సెగ్మెంట్ ప‌రిధిలో ఉన్న గుడివాడ‌, గ‌న్నవ‌రం నేత‌లు టీడీపీని వీడ‌డంతో ఇప్పుడు ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో ముందు స‌రైన అభ్యర్థుల‌ను ఎంపిక చేయాల్సి ఉంది. ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాలే చంద్రబాబుకు క‌త్తిమీద సాములా మారాయి. ఇక అవ‌నిగ‌డ్డలోనూ బుద్ధ ప్రసాద్ యాక్టివ్‌గా ఉండ‌డం లేదు. ముందు చంద్రబాబు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కుల‌ను సెట్ చేస్తేనే బంద‌రు పార్లమెంటులో పార్టీ ప‌రిస్థితి ఓ కొలిక్కి వ‌స్తుంది. అప్పుడే ఎవ‌రైనా ఇక్కడ ప‌గ్గాలు చేప‌ట్టేందుకు ఆస‌క్తి చూపుతారు.

Tags:    

Similar News