అది లేకుండా చేద్దామనే

ఏపీలో ప్రధాన ప్రతిప‌క్షంగా ఉన్న టీడీపీకి డేంజ‌ర్ బెల్స్ మోగుతున్నాయా ? ఈ నెల 9వ తేదీ నాడు అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే, వైసీపీ [more]

Update: 2019-12-07 03:30 GMT

ఏపీలో ప్రధాన ప్రతిప‌క్షంగా ఉన్న టీడీపీకి డేంజ‌ర్ బెల్స్ మోగుతున్నాయా ? ఈ నెల 9వ తేదీ నాడు అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే, వైసీపీ అంత‌ర్గత స‌మావేశాల్లో తీసుకున్న నిర్ణయం మే ర‌కు ఈ స‌మావేశాల నాటికి టీడీపీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యా బ‌లాన్ని దాదాపు త‌గ్గించడంతోపాటు .. పార్టీ కి అతి క‌ష్టం మీద సంక్రమించిన ప్రధాన ప్రతిప‌క్షం అనే హోదాను ప‌క్కన పెట్టేలా చూడడం జ‌రిగితే.. పార్టీ ప‌రిస్థితి ఏంటి? అనే చ‌ర్చ జోరుగా జ‌రుగుతోంది. ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో చంద్రబాబు, ఆయ‌న వియ్యంకుడు బాల‌య్యల‌తో క‌లిపి మొత్తం 23 మంది ఎమ్మెల్యేలు విజ‌యం సాధించారు.

ముకుతాడు వేయాలని….

వీరిలో 11 మంది క‌మ్మ వ‌ర్గానికి చెందిన వారే ఉన్నారు. మిగిలిన వారిలో కాపు, బీసీ, ఎస్సీ స‌హా ఇత‌ర వ‌ర్గాలకు చెందిన నాయ‌కులు ఉన్నారు. అయితే, చంద్రబాబు ఓట‌మి నుంచి తేరుకుని వైసీపీ స‌ర్కారును టార్గెట్ చేస్తున్న నేప‌థ్యంలో ఎలాగైనా ఆయ‌న‌కు ముకుతాడు వేయాల‌ని వైసీపీ భావిస్తోంది. ఈ క్రమంలో కొంత కాలం వేచి చూసిన వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. ఇటీవ‌ల మాత్రం పార్టీకి ప్రధాన ప్రతిప‌క్ష హోదా లేకుండా చేయ‌డ‌మే క‌రెక్ట్ అని నిర్ణయించుకున్నట్టు వైసీపీ వ‌ర్గాలు చెబుత‌ున్నాయి.

ఆరుగురిని తప్పిస్తే…..

ఈ క్రమంలో ప్రజాప్రాతినిధ్యం చ‌ట్టం మేర‌కు ఎమ్మెల్యేల సంఖ్యా బలంలో 10% మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీకి ప్రధాన ప్రతిప‌క్షం అనే హోదా వ‌స్తుంది. అయితే, ఇప్పుడు త‌మ పార్టీలోకి నేరుగా చేర్చుకోక‌పోయినా.. టీడీపీ నుంచి గెలిచిన 23 మందిలో ఐదుగురు లేదా ఆరుగురు ఎమ్మెల్యేల‌ను ప‌క్కకు త‌ప్పిస్తే.. జ‌గ‌న్ ప‌నిసులువు అవుతుంద‌ని అంటున్నారు. ప్రధాన ప్రతిప‌క్షం హోదా లేకుండా చేస్తే.. ఇప్పటి వ‌ర‌కు చంద్రబాబుకు ద‌క్కుతున్న సౌక‌ర్యాల్లో పూర్తిగా కోత పెట్టడంతోపాటు సెక్యూరిటీని కూడా త‌గ్గించే ప‌ని చేయొచ్చు. ఈ దిశ‌గా వైసీపీ ప్రభుత్వం వ‌డివ‌డిగా పావులు క‌దుపుతోంద‌ని అంటున్నారు.

కోర్టు తీర్పు ఉందిగా….

ఇప్పటికే గ‌న్నవ‌రం ఎమ్మెల్యే వంశీ టీడీపీకి దూరం అయ్యారు. ఇక ఇప్పుడు మ‌రో ముగ్గురు, న‌లుగురు ఎమ్మెల్యేల పేర్లు కూడా ఈ లిస్టులో ప్రముఖంగా విన‌ప‌డుతున్నాయి. అయితే, దీనిని ముందుగానే ప‌సిగ‌ట్టిన చంద్రబాబు త‌న ప్రతిప‌క్ష హోదాను ఎలా కాపాడుకోవాలో ? త‌న‌కు తెలుసునంటూ.. ఇటీవ‌ల వ్యాఖ్యానించారు. ఇటీవ‌ల తెలంగాణ హైకోర్టు తీర్పు మేర‌కు ఏ ప‌క్షానికీ ప్రతిప‌క్ష హోదా సాధించే స్థాయిలో ఎమ్మెల్యేలు లేక‌పోయినా.. ఏ పార్టీకి స‌భ‌లో అధికార పార్టీ త‌ర్వాత ఎక్కువ మంది ఎమ్మెల్యే లు ఉంటే వారికి ఇవ్వాలంటూ తీర్పు చెప్పింది. ఇప్పుడు చంద్రబాబు ఈ తీర్పును ఆస‌రా చేసుకుని న్యాయ‌పోరాటానికి దిగే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. చంద్రబాబు ఏదోలా ప్రతిప‌క్ష హోదా ద‌క్కించుకున్నా కీల‌క ఎమ్మెల్యేలు పార్టీ వీడితే ఆయ‌న రెక్కలు తెగిన ప‌క్షి మాదిరిగా మారిపోవ‌డం ఖాయం.

Tags:    

Similar News