డీలా పడ్డారే…?

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. కర్నూలు జిల్లాలో చంద్రబాబు మూడు రోజుల పాటు బస చేయనున్నారు. నియోజకవర్గాల వారీగా సమీక్షలు [more]

Update: 2019-12-02 06:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. కర్నూలు జిల్లాలో చంద్రబాబు మూడు రోజుల పాటు బస చేయనున్నారు. నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేయనున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి అనంతరం చంద్రబాబు జిల్లాల వారీగా సమీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. హేమాహేమీలు సయితం ఓటమి పాలయ్యారు.

వన్ సైడ్ గా వైసీపీకి…..

ఈ నేపథ్యంలో చంద్రబాబు కర్నూలు పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. కర్నూలు జిల్లాలో కేఈ కృష్ణమూర్తి, భూమా అఖిలప్రియ, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తదితర కీలక నేతలున్నారు. నిజానికి కేఈ కృష్ణమూర్తి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిలు ఏకమయిన తర్వాత కర్నూలు జిల్లాలో టీడీపీ కనీస స్థానాలను గెలుచుకుంటుందని భావించారు. కానీ ప్రజలు వన్ సైడ్ గా వైసీపీ పక్షాన నిలవడంతో టీడీపీకి జీరో రిజల్ట్ మిగిలింది.

యాక్టివ్ గా లేకపోవడంతో….

మరోవైపు కర్నూలు జిల్లాలో కీలక నేతలంతా యాక్టివ్ గా లేరు. గత ఆరు నెలలుగా కేఈ కృష‌్ణమూర్తి, కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి, బీసీ జనార్థన్ రెడ్డి, బుడ్డా రాజశేఖర్ రెడ్డి, భూమా బ్రహ్మానందరెడ్ వంటి నేతలు పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడం లేదు. అలాగే కర్నూలు పట్టణంలో బలమైన నేత, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన తనయుడు టీజీ భరత్ మాత్రం టీడీపీలోనే కొనసాగుతున్నారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు సమీక్షలకు ఎవరు హాజరవుతారు? ఎవరు డుమ్మా కొడతారన్న టెన్షన్ టీడీపీ నేతల్లో ఉంది.

బాబు పర్యటనను …..

దీంతో పాటుగా రాయలసీమ ప్రత్యేక హక్కుల కోసం విద్యార్థి సంఘాలు, హైకోర్టు ఏర్పాటుకు న్యాయవాదుల సంఘాలు చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామని ఇప్పటికే హెచ్చరించాయి. దీంతో కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటన ఉద్రిక్తతల మధ్య కొనసాగనుంది. పోలీసులు విస్తృత బందోబస్తును ఏర్పాటు చేశారు. డీలా పడిన నేతల్లో జోష్ నింపేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి మరి.

Tags:    

Similar News