ఏంటీ.. బాబుగారి రేటింగ్ పెరిగిందా.. క‌మ్మ త‌మ్ముళ్ల ఫోన్ టాక్‌

“అన్నా ఇది విన్నావా.. మ‌న అధినేత రేటింగ్ పెరిగిందంట‌గా!“.. “ఔను త‌మ్ముడు.. ఇప్పుడే తెలిసింది“-ఇదీ గ‌త కొద్ది రోజులుగా కృష్ణా.. గుంటూరు జిల్లాల‌కు చెందిన టీడీపీ సీనియ‌ర్లు [more]

Update: 2020-10-31 02:00 GMT

“అన్నా ఇది విన్నావా.. మ‌న అధినేత రేటింగ్ పెరిగిందంట‌గా!“.. “ఔను త‌మ్ముడు.. ఇప్పుడే తెలిసింది“-ఇదీ గ‌త కొద్ది రోజులుగా కృష్ణా.. గుంటూరు జిల్లాల‌కు చెందిన టీడీపీ సీనియ‌ర్లు ఒక‌రికి ఒక‌రు చెప్పుకొంటున్న మాట‌లు. మ‌రీ ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు సామాజిక వ‌ర్గానికి చెందిన కొంద‌రు నేతలు.. ఈ విష‌యాన్ని జోరుగా ప్రచారం చేస్తున్నారు. అయితే, దీనిలో రెండు కోణాలు ఉన్నాయ‌నే విశ్లేష‌ణ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. చంద్రబాబుకు రేటింగ్ పెరిగింద‌ని టీడీపీలో సీనియ‌ర్లకు మాత్రమే తెలియ‌డం.. అందునా క‌మ్మ వ‌ర్గానికే తెలియ‌డం, వారు ప్రచారం చేసుకోవ‌డం అనే అంశం కాగా.. నిజంగానే రేటింగ్ పెర‌గిందా ? అనే కోణంలోనూ విశ్లేషకులు ఈ విష‌యాన్ని ప‌రిశీలిస్తున్నారు.

ప్రభుత్వంపై విరుచుకు పడుతూ…..

గ‌డిచిన నాలుగు నెల‌ల కాలంలో టీడీపీ దూకుడు నిజంగానే పెరిగింది. ఈ విష‌యంలో ఎలాంటి సందేహం లేదు. చంద్రబాబు ప్రజ‌ల్లోకి రాక‌పోయినా.. అమ‌రావ‌తి విష‌యాన్ని ఆయ‌న ‌రాష్ట్ర , దేశ‌, అంత‌ర్జాతీయ స్థాయికి చేర్చారు. ఇక్కడ ఉద్యమం అనే దీపాన్ని ఆరిపోకుండా కాపు కాస్తున్నారు. అదే స‌మ‌యంలో జ‌గ‌న్ ప్రభుత్వంపై విరుచుకుప‌డుతున్నారు. నిత్యం త‌న పార్టీ శ్రేణుల‌ను ఉత్తేజ ప‌రుస్తున్నారు. ఇక‌, ఇటీవ‌ల పార్టీలోనూ సంస్కర‌ణ‌లు తీసుకువ‌చ్చారు. కీల‌క‌మైన పార్లమెంట‌రీ ప‌ద‌వులు అప్పగించారు. అంతేకాదు.. నేను మ‌ళ్లీ పుంజుకుంటాను.. అనే సంకేతాల‌ను ఇస్తున్నారు. ప్రభుత్వంపై దాడిలో జ‌న‌సేన‌, బీజేపీల‌ను త‌ల‌ద‌న్నేలా వ్యవ‌హ‌రిస్తున్నారు.

అదే ప్లస్ అట…..

అయితే లోకేష్‌ను చూశా, చంద్రబాబు జూమ్ మీటింగ్‌ల వ‌ల్లనో ఆ పార్టీ గ్రాఫ్ పెరిగింద‌ని చెప్పలేం.. చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో కీల‌క నేత‌లు ప్రజ‌ల్లోకి వెళ్లడం.. వైసీపీ ఎమ్మెల్యేల‌కు ప‌ద‌వులు, నిధులు లేక‌పోవ‌డంతో వారు నిస్తేజంలో ఉండ‌డం ఇవ‌న్నీ టీడీపీకి కాస్త ప్లస్ అయ్యేందుకు ఓ చ‌క్కని అవ‌కాశం ఇచ్చాయి. ఈ ప‌రిణామాల‌న్ని క‌లిసి చంద్రబాబుకు రేటింగ్ పెరిగింద‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీనినే త‌మ్ముళ్లు చ‌ర్చించుకుంటున్నార‌నేది ఓ వాద‌న‌. అయితే, దీనికి భిన్నంగా మ‌రో వాద‌న తెర‌మీదికి వ‌చ్చింది. పార్టీ పుట్టి మునిగిపోతున్న నేప‌థ్యంలో ఎలాగైనా కాపాడుకోవా ల‌నేది చంద్రబాబు వ్యూహం. ఇప్పటికే గెలిచిన ఎమ్మెల్యేలు జంప్ చేశారు.

ప్రచారమేనా?

ఈ క్రమంలో ఉన్నవారిలో మ‌రో ప‌ది మంది వ‌ర‌కు త‌మ‌కు ట‌చ్‌లో ఉన్నారంటూ.. వైసీపీ నేత‌లు, మంత్రులు లీకులు ఇస్తున్నారు. ఈ ప‌రిణామాల‌తో పార్టీ నేత‌ల్లో అభ‌యం నింపేలా.. వారు సైకిల్ దిగిపోకుండా చూసుకునే క్రతువులో భాగంగా చంద్రబాబు.. ఇలా రేటింగ్ ప్రచారం చేసుకుంటున్నార‌నే వాద‌న ఉంది. అయితే, ఈ విష‌యాలు తెలియ‌క‌పోవ‌డంతో ఏంటీ.. బాబుగారి రేటింగ్ పెరిగిందా ? అని పార్టీలోని కీల‌క క‌మ్మ నాయ‌కులు తెగ చ‌ర్చించుకుంటున్నారు. మ‌రి ఈ రేటింగ్ నిజ‌మేనా అనేది తెలియాలంటే మ‌రో రెండు మూడు నెల‌లు వెయిట్ చేయాల్సిందే.

Tags:    

Similar News