అంతా ఒట్టిదేనా…?

ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీ ఘోరంగా విఫ‌ల‌మైంది. పార్టీ ఓట‌మిపాలైనా.. టీడీపీ అధినేత చంద్రబాబు స్థాయికి త‌గిన‌న్ని సీట్లు కూడా రాబ‌ట్టుకోలేక పోయారు. కొన్ని జిల్లాల్లో [more]

Update: 2019-11-02 00:30 GMT

ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీ ఘోరంగా విఫ‌ల‌మైంది. పార్టీ ఓట‌మిపాలైనా.. టీడీపీ అధినేత చంద్రబాబు స్థాయికి త‌గిన‌న్ని సీట్లు కూడా రాబ‌ట్టుకోలేక పోయారు. కొన్ని జిల్లాల్లో తుడిచి పెట్టుకు పోయారు. రెండో సారి కూడా ఘ‌న విజ‌యం సాధించి అధికారం నిల‌బెట్టుకుంటామ‌నుకున్న చంద్రబాబుకు ప్రజ‌లు భారీగా ఝ‌ల‌క్ ఇచ్చారు. దీంతో రెండోసారి అధికారం మాట దేవుడెరుగు గౌర‌వ ప్రద‌మైన స్థానాల‌ను కూడా చంద్రబాబు రాబ‌ట్టుకోలేక పోయారు. ఆయ‌న ఎన్ని వంగి వంగి ద‌ణ్ణాలు పెట్టినా .. ప్రజ‌లు క‌నీసం ఆయ‌న‌ను క‌నిక‌రించ‌లేదు. ఆఖ‌రుకు ఆయ‌న సొంత జిల్లా చిత్తూరులోనే ఆయ‌న త‌ప్ప మ‌రెవ్వరూ గెల‌వ‌లేని ప‌రిస్థితి ఏర్పడింది.

నలుగురు గెలిచినా….

అలాంటి ప‌రిస్థితిలో ఒక్క విశాఖ‌ప‌ట్నం, రెండోది ప్రకాశం జిల్లాల్లో మాత్రమే టీడీపీ మెరుగైన ఫ‌లితాలు రాబ‌ట్టింది. ఈ రెండు జిల్లాల్లోనూ నాలుగేసి నియోజ‌క‌వ‌ర్గాల్లో న‌లుగురు చొప్పున ఎమ్మెల్యేల‌ను చంద్రబాబు గెలిపించుకున్నారు. ఇక తూర్పుగోదావ‌రి జిల్లాలోనూ ఆ పార్టీ నుంచి న‌లుగురు ఎమ్మెల్యేలు గెలిచారు. విశాఖ‌లో వాసుప‌ల్లి గ‌ణేష్‌, గంటా శ్రీనివాస‌రావు, గ‌ణబాబు, వెల‌గ‌పూడి విజ‌యం సాధించారు. అదే స‌మ‌యంలో ప్రకాశంలో అద్దంకి, పర్చూరు, చీరాల, కొండపి ల నుంచి గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, కరణం బలరాం, డోలా బాల వీరాంజనేయస్వామి విజ‌యం సాధించారు. తూర్పుగోదావ‌రిలో సీనియ‌ర్లు బుచ్చయ్య చౌదరి, జోగేశ్వర‌రావు, చిన‌రాజ‌ప్పతో పాటు ఆదిరెడ్డి భ‌వానీ గెలిచారు.

మూడు జిల్లాలే….

ఇలా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి ఎదురు గాలులు వీచినా.. ఈ మూడు జిల్లాలుచంద్రబాబును ఒకింత ఆదుకున్నాయి. మ‌రి ఇప్పుడు ఈ గెలిచిన ఎమ్మెల్యేలు ఎంత మంది ఈ జిల్లాలో పార్టీని న‌డిపించేందుకు సిద్ధంగా ఉన్నారు? అనేది కీల‌క ప్రశ్న. అంతేకాదు, పార్టీ అధినేత చంద్రబాబు ఇస్తున్న పిలుపు మేర‌కు జ‌గ‌న్ ప్రభుత్వంపై ప్రతిప‌క్ష ఎమ్మెల్యేలుగా ఎంత‌మంది వీరిలో పోరాటం చేస్తున్నారు? చంద్రబాబు పిలుపున‌కు ఎంత మంది స్పందిస్తున్నారు? అనే ప్రశ్న తెర‌మీదికి వ‌స్తోంది. గ‌డిచిన మూడు మాసాల కింద‌ట అన్న కేంటీన్ల కోసం జ‌రిగిన ఉద్య‌మం త‌ర్వాత అదే రేంజ్‌లో తాజాగా ఇసుక విధానంపై తెలుగు దేశం నాయ‌కులు క‌దం తొక్కాల‌ని, జ‌గ‌న్ వైఖ‌రిని ఎండ‌గ‌ట్టాల‌ని చంద్రబాబు పిలుపునిచ్చారు.

పార్టీ కార్యక్రమాల్లో….

ఈ క్రమంలోనే ఇటీవ‌ల రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించారు. అయితే విశాఖ‌, ప్రకాశం జిల్లాల విష‌యానికి వ‌స్తే ఒక్క వెల‌గ‌పూడి రామ‌కృష్ణబాబు త‌ప్ప.. మిగిలిన వారు ఎక్కడా క‌నిపించ‌క పోవ‌డం గ‌మ‌నార్హం. అయితే, వీరేమైనా విదేశాల్లో ఉన్నారా? అంటే.. అదీ లేదు. గెలిచిన వారంతా నియోజ‌క‌వ‌ర్గం కేంద్రాల్లోనే ఉన్నప్పటికీ.. చంద్రబాబు పిలుపు తెలిసి కూడా ప‌ట్టించుకోలేదు. దీంతో వీరి ప్రవ‌ర్తన ఏంటి? చంద్రబాబును చాలా లైట్ తీస్కొంటున్నారా ? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. ఇక వీరిలో చాలా మంది పార్టీ నుంచి జంప్ చేసే ఆలోచ‌న‌లో ఉన్నట్టు కూడా ప్రచారం జ‌రుగుతోంది. మ‌రి భ‌విష్యత్తులో ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News