అందరూ దూరమయిపోతున్నారే

ఆయ‌న‌కునిన్న మొన్నటి వ‌ర‌కు తిరుగులేదు. ఆయ‌న మాటే వేదంగా, ఆయ‌న ఆదేశాల‌ను తూచ త‌ప్పకుండా అమ‌లు చేశారు. ఆయ‌న ద‌ర్శనమే భాగ్యమ‌నుకున్నారు. ఆయ‌న త‌మ‌కు ఏం చేసినా..ఓకే [more]

Update: 2019-09-02 14:30 GMT

ఆయ‌న‌కునిన్న మొన్నటి వ‌ర‌కు తిరుగులేదు. ఆయ‌న మాటే వేదంగా, ఆయ‌న ఆదేశాల‌ను తూచ త‌ప్పకుండా అమ‌లు చేశారు. ఆయ‌న ద‌ర్శనమే భాగ్యమ‌నుకున్నారు. ఆయ‌న త‌మ‌కు ఏం చేసినా..ఓకే అన్నారు. కానీ, ఒకే ఒక్క ప‌రాజ‌యం ఆయ‌న‌కు వారిని దూరం చేసేసింది. ఈ ఏడాది జ‌రిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. ఈ దెబ్బతో రెడ్డి వ‌ర్గం చంద్రబాబు కు దూర‌మైంది. ఒక్కరంటే ఒక్కరు కూడా రెడ్డి వర్గానికి చెందిన నాయ‌కులు అటు ఎంపీగానో, ఇటు ఎమ్మెల్యేగానో గెలిచింది లేదు. దీంతో వీరు ఇప్పుడు చంద్రబాబుకు ఆమ‌డ‌దూరం అంటున్నారు.

బాబుతో కలసి నడిచేందుకు….

అదే వైసీపీలో రెడ్డి వ‌ర్గం ఎమ్మెల్యేలు ఏకంగా 51 మంది గెలిచారు. టీడీపీలో అన్ని వ‌ర్గాల‌కు ప్రాధాన్యం అంటూనే బీసీ వ‌ర్గానికి చంద్రబాబు చాలానే చేశారు. అయిన‌ప్పటికీ.. రెడ్డి స‌హా కాపులు చంద్రబాబు రాజ‌కీయంగా ప్రాదాన్యం ఇచ్చారు. ఆయ‌న హ‌యాంలో త‌మ‌కు మేలు జ‌రిగినా.. జ‌ర‌గ‌క‌పోయినా.. చంద్రబాబు అనుభ‌వం, ఆయ‌న రాజ‌కీయం త‌మ‌కు మేలు చేస్తుంద‌ని భావించారు. అయితే, ఎన్నిక‌ల్లో ఒక్క రెడ్డి సామ‌జిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు కూడా గెల‌వ‌లేదు. ఎన్నిక‌ల త‌ర్వాత మారుతున్న రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో రెడ్లు టీడీపీతో క‌లిసి న‌డిచేందుకు ఆస‌క్తితో లేరు.

ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో….

దీనికితోడు ఇప్పుడు రాజ‌ధాని అమ‌రావ‌తిలో కేవ‌లం క‌మ్మ వ‌ర్గానికి మాత్రమే చంద్రబాబు ప్రాధాన్యం ఇవ్వడం కూడా వారికి న‌చ్చలేదు. ఇక‌, కాపు వ‌ర్గానికి చంద్రబాబు చాలానే చేశారు. కాపు కార్పొరేష‌న్ ను ఏర్పాటు చేసి వెయ్యి కోట్ల నిధులు కూడా కేటాయించారు. విదేశీ రుణాలు , విద్యారుణాలు అంటూ వారికి మేలు చేశారు. అయిన‌ప్పటికీ.. రిజ‌ర్వేష‌న్ అంశం విష‌యంలో మాత్రం చంద్రబాబు వారికి న్యాయం చేయ‌లేద‌ని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 10 శాతం ఈబీసీ రిజ‌ర్వేష‌న్ల‌లో 5 శాతం బాబు కాపుల‌కే ఇచ్చినా వారు ఈ ఎన్నిక‌ల్లో చంద్రబాబును విశ్వసించ‌లేదు.ఈ క్రమంలోనే ఈ వ‌ర్గం కూడా ఇప్పుడు చంద్రబాబుకు చాలా దూరం పాటిస్తోంది.

వరస గా ఒక్కొక్కరూ…..

ఇప్పటికే వ‌రుపుల రాజా వంటి వారు పార్టీకి రాజీనామా చేశారు. ఈ లైన్‌లో చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. తోట త్రిమూర్తులు, జ్యోతుల నెహ్రూ, గంటా శ్రీనివాస‌రావు లాంటి వాళ్లు లైన్లో ఉన్నార‌ని వార్తలు వ‌స్తున్నాయి. మ‌రోప‌క్క, బీసీ వ‌ర్గం కూడా జారీ పోతోంది. త‌మ‌కు ఏం చేశార‌ని ప్రశ్నిస్తోంది. ఐదేళ్ల పాటు చంద్రబాబు కాపు భ‌జ‌నే చేశార‌న్నది వాళ్ల ఆరోప‌ణ‌. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి అన్ని వ‌ర్గాలు కూడా చంద్రబాబుకు దూర‌మ‌య్యే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. పోనీ.. త‌న సొంత సామాజిక వ‌ర్గం అయినా.. ఆయ‌న వెంట ఉంటుందా ? అంటే .. అది కూడా ఆధిప‌త్య రాజ‌కీయాల నేప‌థ్యంలో దూర‌మ‌య్యే ప‌రిస్థితి స్పష్టంగా క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి చంద్రబాబు భ‌వితవ్యం స‌హా పార్టీ మ‌నుగ‌డ‌పై ప్రశ్నలు త‌లెత్తుతున్నాయి.

Tags:    

Similar News