ఇప్పట్లో లేనట్లే

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పొలిట్ బ్యూరోను మార్చాలనుకుంటున్నారు. క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి వరకూ పార్టీని ప్రక్షాళన చేయాలనుకుంటున్నారు. యువతకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నారు. [more]

Update: 2019-08-24 06:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పొలిట్ బ్యూరోను మార్చాలనుకుంటున్నారు. క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి వరకూ పార్టీని ప్రక్షాళన చేయాలనుకుంటున్నారు. యువతకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నారు. ఇదీ నిన్నటి వరకూ చంద్రబాబు, తెలుగుదేశం పార్టీపై విస్తృతంగా జరిగిన ప్రచారం. అంతేకాదు చంద్రబాబు జిల్లాల పర్యటనను కూడా ప్రారంభించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే దీనికి ఇంకా సమయం ఉందటున్నాయి పార్టీ వర్గాలు.

పార్టీ ప్రక్షాళన…

కానీ పార్టీ ప్రక్షాళన ఇప్పట్లో జరిగేలా లేదు. ఇందుకు కారణాలు అనేకం ఉన్నాయి. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ సంక్షోభ సమయంలో ఉంది. ఓటమి నుంచి ఇంకా అనేకమంది నేతలు తేరుకోలేదు. పైగా అనేక నియోజకవర్గాల్లో గతంలో చేసిన తప్పులు నేతలను వెంటాడుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం నియోజకవర్గాల వారీగా టీడీపీ నేతలపై కేసులు పెట్టడానికి రెడీ అవుతుంది. దీంతో ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన నేతలెవ్వరూ రాజకీయంగా యాక్టివ్ గా లేరు.

నేతలను మారిస్తే…..

వారి స్థానంలో కొత్త వారిని పెట్టాలన్నా సీనియర్లు అంగీకరించే ప్రసక్తి లేదు. జిల్లా కార్యవర్గం నుంచి పార్టీలో మార్పులు జరుగుతాయిని అందరూ భావించారు. కానీ జిల్లాల అధ్యక్షుల మార్పు ఇప్పట్లో జరిగే అవకాశం లేదని తెలుస్తోంది. ప్రకాశం జిల్లాను తీసుకుంటే అక్కడ దామచర్ల జనార్థన్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన స్థానంలో కరణం బలరాంను నియమించాలని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. కానీ చంద్రబాబు మనసులో మాజీ మంత్రి శిద్దారాఘవరావు ఉన్నారు. ఇదే జరిగితే కరణం అంగీకరించరు. దీంతో అధ్యక్షుడిని మార్చి రచ్చ ఎందుకని చంద్రబాబు భావిస్తున్నారు.

కొంతకాలం ఆగితే….

దాదాపు అన్ని జిల్లాల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాయలసీమ జిల్లాల్లోనూ జిల్లా అధ్యక్షులను మారిస్తే కొత్త పంచాయతీలు తప్పవని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే కొన్ని రోజుల పాటు పార్టీ ప్రక్షాళన చేయకుండా ఉండటమే మేలన్న నిర్ణయానికి వచ్చారు. దీంతో పాటు ఇప్పుడిప్పుడే వైఎస్ జగన్ సర్కార్ పై కొంత వ్యతిరేకత కన్పిస్తుండటంతో ఓటమి పాలయిన టీడీపీ నేతలు తిరిగి లైన్లోకి వస్తారని, అప్పటి వరకూ వేచి చూడాలన్న ధోరణిలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News