టూ ప్రాబ్లమ్స్.. సాల్వ్ అయితే మళ్లీ సీఎం

చంద్రబాబుకు ఇప్పుడు క్యాడర్ తో పాటు కుటుంబం కూడా సమస్యగా మారింది. చంద్రబాబు ముందు వచ్చే ఎన్నికల నాటికి అనేక ఛాలెంజ్ లు ఉన్నాయి. వీటిని అధిగమిస్తేనే [more]

Update: 2021-03-22 03:30 GMT

చంద్రబాబుకు ఇప్పుడు క్యాడర్ తో పాటు కుటుంబం కూడా సమస్యగా మారింది. చంద్రబాబు ముందు వచ్చే ఎన్నికల నాటికి అనేక ఛాలెంజ్ లు ఉన్నాయి. వీటిని అధిగమిస్తేనే 2024లో జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి విజయం దక్కే అవకాశాలున్నాయి. అయితే చంద్రబాబు ముందు రెండు సవాళ్లున్నాయి. అందులో రెండు సక్సెస్ అయితే చంద్రబాబుకు మరోసారి ముఖ్యమంత్రిగా ఛాన్స్ లభించినట్లేనని విశ్లేషకుల అంచనా.

ఎన్నడూ లేని సంక్షోభం….

చంద్రబాబు నాయుడు గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. నేతలను కాపాడుకోవడం, క్యాడర్ లో ధైర్యాన్ని నింపడం ఆయన ముందున్న లక్ష్యం. అందుకోసం అన్ని జిల్లాల పర్యటన చేస్తున్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబుకు ముఖ్య అవసరం రెండే రెండు. ఒకటి తనతో కలసి వచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకోవడం. అందులో ప్రధానంగా టీడీపీ, జనసేన తనతో కలసి వచ్చేలా చేసుకోవడం.

బీజేపీ, జనసేనలతో కలిసి….

బీజేపీ, జనసేనలు తనతో కలసి వస్తాయా? అన్న సందేహం చంద్రబాబుకు ఇప్పుడు కూడా ఉంది. కానీ ప్రయత్నాలు మాత్రం చేస్తూనే ఉన్నారు. జనసేన చంద్రబాబుతో కలసి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నా, బీజేపీ మాత్రం ససేమిరా అంటోంది. చంద్రబాబుతో పొత్తుకు బీజేపీ రాష్ట్ర నేతలు ససేమిరా అంటున్నారు. చంద్రబాబు కంటే పవన్ కల్యాణ‌్ తో జత కట్టి ముందుకు వెళితే పార్టీ భవిష‌్యత్ బాగుంటుందని భావిస్తున్నారు. చంద్రబాబు మాత్రం ఆ రెండు పార్టీలు కలసి రావాలని కోరుకుంటున్నారు.

నందమూరి కుటుంబం నుంచి….

ఇక చంద్రబాబుకు మరోసమస్య కుటుంబం. నందమూరి కుటుంబం చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో పూర్తిగా సహకరించాల్సి ఉంటుంది. బాలయ్య మద్దతు ఉన్నా ఎన్నికల వేళ పెద్దగా ప్రయోజనం ఉండదు. జూనియర్ ఎన్టీఆర్ మద్దతు చంద్రబాబుకు అత్యవసరం. అయితే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అయితే ఎన్నికల నాటికి జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీ ప్రచారానికి ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. నందమూరి కుటుంబం మొత్తాన్ని ప్రచారంలోకి దించేందుకు సిద్దమవుతున్నారు. మొత్తం మీద ఈ రెండు విషయాలలో సక్సెస్ అయితే చంద్రబాబుకు ఈసారి ప్రజలు ఛాన్స్ ఇచ్చే అవకాశముందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా.

Tags:    

Similar News