యాక్షన్ కు దిగరా…?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికీ క్విక్ డెసిషన్లు తీసుకోలేకపోతున్నారా? కఠిన నిర్ణయాలు తీసుకోలేక క్యాడర్ లో తప్పుడు సంకేతాలను పంపుతున్నారా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో [more]

Update: 2019-08-18 14:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికీ క్విక్ డెసిషన్లు తీసుకోలేకపోతున్నారా? కఠిన నిర్ణయాలు తీసుకోలేక క్యాడర్ లో తప్పుడు సంకేతాలను పంపుతున్నారా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఇదే చర్చనీయాంశంగా మారింది. గీత దాటిన వారినపై ఎటువంటి చర్యలు లేవు. ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీలో లేదు. తాజా ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమి తర్వాత అనేకమంది నేతలు పార్టీ లైన్ దాటుతున్నారు.

తప్పించాలని కోరుతున్నా…..

రాజ్యసభ సభ్యుడిగా ఉన్న టీజీ వెంకటేష్ పార్టీని వీడి వెళ్లారు. గత ఎన్నికల్లో ఆయన కోరిక మేరకు కుమారుడు భరత్ కు టిక్కెట్ ఇచ్చి ఎస్వీ మోహన్ రెడ్డిని చంద్రబాబు వదులుకున్నారు. టీజీ వెంకటేష్ బీజేపీలోకి వెళ్లిపోయినా ఆయన కుమారుడు టీజీ భరత్ మాత్రం ఇంకా టీడీపీలోనే కొనసాగుతున్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు. భరత్ ను ఇన్ ఛార్జిగా తప్పించాలని కర్నూలు నియోజకవర్గం టీడీపీ నేతలు మొత్తుకుంటున్నా చంద్రబాబు యాక్షన్ కు దిగలేదు.

రాయపాటి లాంటి నేతలు….

ఇక రాయపాటి సాంబశివరావు తాను పార్టీని వీడుతున్నానని బహిరంగంగానే చెబుతున్నారు. పైగా జగన్ పాలన భేష్ అంటూ తెగ ప్రశంసలు కురిపిస్తున్నారు. కానీ రాయపాటి కుటుంబాన్ని దూరం చేసుకునే ధైర్యం చంద్రబాబు చేయడం లేదు. రాయపాటి ఫ్యామిలీ పార్టీని వీడినా చంద్రబాబు చేయగలిగిందేమీ లేదు. అయితే ముందుగానే వారిపై సస్పెన్షన్ వేటు వేస్తే కార్యకర్తలకు క్లారిటీ వస్తుందన్నది కొందరి నేతల అభిప్రాయం.

పార్టీకి సహకరించని వారిని కూడా…..

ిఇక చంద్రబాబునాయుడు ఎన్నికల ఫలితాలు వెలువడక ముందు ఎవరెవరు పార్టీకి సహకరించలేదో? వారి పేర్లను ఇవ్వాలని పార్టీ నేతలకు సూచించారు. వారిని పార్టీ నుంచి బయటకు పంపుతానని హెచ్చరించారు. జాబితాలు కూడా చంద్రబాబు వద్ద ఉన్నాయి. అనేక నియోజకవర్గాల్లో నేతలు టీడీపీ విజయానికి కృషి చేయలేదు. అయినా సరే చంద్రబాబు వారిపై యాక్షన్ తీసుకోవడం లేదు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్న నేతలను కూడా చంద్రబాబు పట్టించుకోవడం లేదు. ఇలా గత ఎన్నికల్లో పార్టీకి వెన్నుపోటు పొడిచిన నేతలు ఇంకా పసుపు కండువా కప్పుకుని తిరుగుతూనే ఉండటాన్ని పార్టీ నేతలు కొందరు తప్పుపడుతున్నారు.

Tags:    

Similar News