తిరుపతిలో పాత వ్యూహాలు పనిచేయవట

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక త్వరలో జరగబోతోంది. అయితే ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పరిస్థితి ఏంటన్న చర్చ జరుగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో [more]

Update: 2021-04-09 15:30 GMT

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక త్వరలో జరగబోతోంది. అయితే ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పరిస్థితి ఏంటన్న చర్చ జరుగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసి జోరు మీదున్న వైసీపీని చంద్రబాబు ఎలా నిలువరించగలరన్న ప్రశ్న తలెత్తుతోంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలను చంద్రబాబు ఊహించలేదు. కనీస స్థానాలను సాధిస్తామని చంద్రబాబు నమ్మకంతో ఉన్నారు. అయినా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఘోర పరాజయం ఎదురయింది.

నిన్న మొన్నటి వరకూ…

నిన్న మొన్నటి వరకూ చంద్రబాబుకు తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికపై కొంత హోప్స్ ఉండేవి. జగన్ పాలనపై వ్యతిరేకత ఉందని ఆయన అంచనా వేశారు. గత ఇరవై నెలలుగా అభివృద్ధి బాగా లేకపోవడంతో జగన్ పై అసంతృప్తితో ఉన్నారని చంద్రబాబు భావించారు. కానీ ఈ అంచనాలన్నీ మున్సిపల్ ఎన్నికల్లో తప్పయ్యాయి. దీంతో తిరుపతి ఉప ఎన్నికకు చంద్రబాబు ప్రత్యేక స్ట్రాటజీతోనే వెళ్లాల్సి ఉంటుంది.

సానుభూతి కూడా రాలేదే…..

చంద్రబాబు తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలపై బాగానే ఆశలు పెట్టుకున్నారు. తనను తిరుపతి ఎయిర్ పోర్టులో పోలీసులు నిర్భంధించడంతో దాదాపు పది గంటలు విమానాశ్రయంలోనే ధర్నా కు దిగారు. కింద కూర్చున్నారు. నిరసన తెలియజేశారు. చివరకు తనను నిర్భంధించిన తిరుపతి కార్పొరేషన్ లోనే టీడీపీ అభ్యర్థులు గల్లంతయ్యారు. దీంతో ఏమాత్రం సానుభూతి వర్క్ అవుట్ కాలేదని అర్థమయింది. కనీసం జిల్లా వాసిగా కూడా అక్కడ ఓటర్లు గుర్తించలేదన్న మనో వేదన చంద్రబాబుకు ఉంది.

కొత్త స్ట్రాటజీతోనే…..

తిరుపతి ఉప ఎన్నికకు అభ్యర్థిని చంద్రబాబు ముందుగానే ప్రకటించి పార్టీని జనంలోకి మరింతగా తీసుకెళ్లాలని భావించారు. నాలుగు నెలలక్రితమే పనబాక లక్ష్మిని అభ్యర్థిగా ప్రకటించారు. సొంత జిల్లా కావడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నా ఫలితం కన్పించడం లేదు. పనబాక లక్ష్మి ఇప్పటి వరకూ ప్రజల్లోకే వెళ్లలేకపోయారు. ఇక తిరుపతి ఉప ఎన్నికలలో చంద్రబాబు పాత విధానాలకు స్వస్తిచెప్పి కొత్త వ్యూహంతో వెళ్లాల్సిందేనని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. కాని ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే చంద్రబాబుకు తిరుపతిలోనూ దారుణ ఓటమి తప్పేట్లు లేదు. ఎందుకంటే ఇప్పుడు జగన్ హవా నడుస్తుంది.

Tags:    

Similar News