నీ గూడు చెదిరింది…?

ఏపీ రాజధాని గా అమరావతిని గత సర్కార్ లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ఎంపిక చేసేసారు. రాజధాని ఎంపిక కోసం కేంద్రం నియమించిన శివరామ కృష్ణన్ తో [more]

Update: 2019-12-18 06:30 GMT

ఏపీ రాజధాని గా అమరావతిని గత సర్కార్ లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ఎంపిక చేసేసారు. రాజధాని ఎంపిక కోసం కేంద్రం నియమించిన శివరామ కృష్ణన్ తో కూడిన నిపుణుల కమిటీ నివేదికను చెత్తబుట్టలో వేసేసారు చంద్రబాబు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించింది చాలక కాంగ్రెస్ రాజధానిని ఎక్కడ నిర్మించాలో మాకు చెప్పాలా అంటూ అధికార దర్పాన్ని ప్రదర్శించారు. ఎలాంటి అనుభవం లేని పూర్తి వ్యాపార వేత్తలతో కూడిన మంత్రి నారాయణ, గల్లా జయదేవ్ వంటివారితో మరో కమిటీ ఏర్పాటు చేసి తన మనసులో ఏముందో అదే వారిచేత మమ అనిపించేశారు. అంతే కృష్ణా, గుంటూరు నడుమ అమరావతి మన ప్రపంచ రాజధాని అంటూ ప్రచారం మొదలు పెట్టేశారు. చంద్రబాబు వ్యూహానికి నాడు విపక్షంలో వున్న వైసిపి అధినేత జగన్ సైతం జై కొట్టక తప్పలేదు. వ్యతిరేకిస్తే రెండు జిల్లాల్లో పార్టీకి తీరని నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని నాటి అసెంబ్లీలో జగన్ టిడిపి సర్కార్ నిర్ణయాన్ని సమర్ధించేశారు. ఎన్డీయే లో భాగస్వామి ఆహ్వానాన్ని మన్నించి ప్రధాని మోడీ పార్లమెంట్ లోని మట్టి పవిత్ర జలం ఇవిగో అంటూ చంద్రబాబు కి ఇచ్చి చక్కా పోయారు.

బాబు వరుస తప్పులు …

ఆ తరువాత చంద్రబాబు రాజధానిపై తప్పులు మీద తప్పులు చేసుకుంటూ రావడం వైసిపికి వరంగా మారింది. ఓటుకు నోటు కేసు తరువాత హైదరాబాద్ లో ఏపీకి పదేళ్ళపాటు అన్ని హక్కులు వున్నా అమరావతికి చంద్రబాబు వచ్చేయడం మరింతగా రాజకీయంగా వైసిపి కి కలిసివచ్చింది. ఎలాంటి నిర్మాణాలు లేకుండా ఎపి హక్కులను వదులుకోవడం టిడిపి కి పెద్ద మైనస్ గా మారింది. ఇది చంద్రబాబు కి వ్యక్తిగతంగా చెడ్డపేరు తెచ్చిపెట్టింది. మూడు పంటలు పండే సారవంతమైన చోట రాజధాని నిర్మాణాన్ని ఎవ్వరు ఊహించలేదు. అది కూడా ల్యాండ్ పూలింగ్ అంటూ రైతుల నుంచి భూమి సేకరించి అభివృద్ధి చేసి ఇస్తామంటూ వారితో వ్యాపార ధోరణిలోనే చంద్రబాబు నడిపిన వ్యవహారం విమర్శలు, ఆరోపణల పాలు అయ్యింది. అమరావతి చుట్టు పక్కల వేలఎకరాల ప్రభుత్వ భూమిని నిర్మాణాల ఎంపికకు గత టిడిపి సర్కార్ ప్రయత్నం చేయకపోవడం నేటి వైసిపి సర్కార్ కి మరింత కలిసి వచ్చింది. నాటి సర్కార్ కి ఇచ్చిన భూములను నేటి ప్రభుత్వం వెనక్కి ఇచ్చేయడం ఇప్పుడు పెద్ద నష్టం చేకూర్చేదేమీ కాదంటున్నారు నిపుణులు. మహా అయితే రైతులు, రియల్ ఎస్టేట్ వారు కోర్టు లకు ఎక్కుతారని అలా చేస్తే వారి భూములే లిటిగేషన్ లో పడతాయని చెబుతున్నారు.

ఫ్లై ఓవర్ కట్టేందుకే దిక్కులేదు …

ఆ తరువాత రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు ప్రపంచ దేశాలు చుట్టి రావడం వచ్చాకా రోజుకో దేశం అక్కడి రాజధాని పేరు చెబుతూ కాలక్షేపం చేయడం డిజైన్ల కోసం అంతర్జాతీయ నిపుణులకు కాంట్రాక్ట్ ఇవ్వడం మరోపక్క సింగపూర్ జపం వెరసి వాస్తవంగా చూస్తే అమరావతిలో అన్ని తాత్కాలిక నిర్మాణాలు చేపట్టడం నాలుగు దశాబ్దాల చంద్రబాబు అనుభవాన్ని ప్రజలు ప్రశ్నించే స్థాయికి తీసుకువెళ్ళింది వైసిపి. కట్టిన తాత్కాలిక నిర్మాణాలు సైతం వర్షాలు పడితే కారిపోవడం తో వున్న ప్రతిష్ట మంటగలిసింది. ఇది గాక దుర్గగుడి ఫ్లై ఓవర్ నుంచి విజయవాడలో కీలకమైన ట్రాఫిక్ సమస్యలకు చంద్రబాబు చెక్ పెట్టకపోవడం తో అందరిలో అనుమానాలు మొదలయ్యాయి. జనంలో అనుమానాలు వచ్చినప్పుడల్లా సినిమా డైరెక్టర్ లతోను నార్మన్ పోస్టర్స్ తో గ్రాఫిక్స్ పదేపదే చూపడంతో రాజధాని మరో యాభై ఏళ్ళు అయినా చంద్రబాబు పూర్తి చేయలేరని ఎపి వాసులు భావించే పరిస్థితి ఏర్పడిపోయింది. దీనికి తోడు వైసిపి విపక్షం లో వుంటూ చంద్రబాబు అమరావతిపై చేస్తున్న తప్పులను సమర్ధవంతంగా ప్రజల్లోకి చొప్పించింది. రాజధానిలో రైతులను మోసం చేసి టిడిపి ఇన్ సైడ్ ట్రేడింగ్ కి పాల్పడిందంటూ నిత్యం గట్టి ప్రచారమే సాగిస్తూ వచ్చింది.

ఆయన తప్పే చేశారన్న సుజనా …

రాజధాని మారుస్తారంటూ ఆ మధ్య పెద్ద రచ్చ నడిచిన సందర్భంలో చంద్రబాబు కి కుడిభుజంగా ఒకప్పుడు వ్యవహరించిన ప్రస్తుత బిజెపి నేత ఎంపి సుజనా చౌదరి ఘాటుగానే తన గురువు పై వ్యాఖ్యలు చేశారు. అమరావతిని అభివృద్ధి చేయకుండా చంద్రబాబు కాలక్షేపం చేయడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని సుజనా వాపోయారు. బాబే కనుక ఐదేళ్లల్లో అమరావతికి ఒక రూపం తెస్తే జగన్ ఏమి చేయలేకపోయేవారని అన్నారు. ఆయన వ్యాఖ్యలు తాజాగా నిజమే అని నిరూపించారు ముఖ్యమంత్రి జగన్. ప్రభుత్వ భూముల్లో చంద్రబాబు నిర్మాణాలు మొదలు పెట్టినా శాశ్వత రాజధాని భవనాలను చంద్రబాబు నిర్మించి ఉంటే జగన్ ఇప్పుడు చేసేదేమి లేకపోయేది. అలా కాకుండా అరచేతిలో వైకుంఠం చూపించి తాను తిరిగి అధికారంలోకి వస్తేనే రాజధాని పూర్తి అవుతుందని ప్రజలు ఓట్లు వేస్తారని బలంగా చంద్రబాబు విశ్వసించడం ఆయన డ్రీం ప్రాజెక్ట్ కొంప ముంచింది. ఆయనతో పాటు ఆయన్ను నమ్ముకున్న వారిని పూర్తిగా ముంచేసిందని వైసిపి లోనే కాదు టిడిపి లోను వినిపిస్తున్న టాక్.

అధికారంలోకి రావడంతోనే …

ఇలా అనేక తప్పులు అమరావతిలో చేయడంతో వైసిపి సర్కార్ వచ్చి రావడంతోనే రాజధానిపై తమ వైఖరి నెమ్మది నెమ్మదిగా బయటపెట్టింది. ముందుగా బొత్స వంటి మంత్రులు ఎమ్యెల్యేలు రాజధానిపై తలోరకంగా మాట్లాడటం మొదలు పెట్టారు. ఆ తరువాత దీనిపై పెద్ద చర్చకే తెరలేపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల మనోభావాలను అంచనా వేసుకున్నారు. దీనికి తోడు రాయలసీమ లో హై కోర్టు ఉద్యమం మొదలు కావడం మరింత కలిసి వచ్చింది. అటు రాయలసీమ ఇటు ఉత్తరాంధ్ర అభివృద్ధి వికేంద్రీకరణలపై పెద్దఎత్తున అందరిలో చర్చ మొదలు కావడంతో టిడిపి పోరాటానికి క్షేత్ర స్థాయిలో ప్రజల నుంచి మద్దతు లభించలేదు. ఇవన్ని లెక్కేసి శీతాకాల సమావేశాల్లో ధర్మాన ప్రసాదరావు చేత చంద్రబాబు అమరావతి పాపాల చిట్టాను చదివించి జగన్ జరగబోయేది ఏమిటో వెల్లడించి టిడిపిపై మూడు ప్రాంతాలనుంచి మూడు బాంబులు వేసి ముగించారు. ఇందంతా వైసిపి అధినేత పక్కా ప్లాన్ తోనే అమలు చేశారని ఇప్పుడు అర్ధమైన తమ్ముళ్ళు వేడెక్కిపోతున్నా

Tags:    

Similar News