చెప్పినట్లే… చేసినట్లే జరగాలా?

చంద్రబాబు నాయుడు అప్పుడు ముఖ్యమంత్రి. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి రాజధాని ఎక్కడ ఉండాలో ఆయన, ఆయన పార్టీయే నిర్ణయించింది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి రాజధాని ఎక్కడ ఉండాలో [more]

Update: 2019-12-09 08:00 GMT

చంద్రబాబు నాయుడు అప్పుడు ముఖ్యమంత్రి. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి రాజధాని ఎక్కడ ఉండాలో ఆయన, ఆయన పార్టీయే నిర్ణయించింది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి రాజధాని ఎక్కడ ఉండాలో చంద్రబాబు ఎవరితోనూ చర్చించలేదు. అధికారంలో ఉన్న ఆయన విపక్ష నేతలతో అఖిలపక్షం ఏర్పాటు చేయనూలేదు. కొన్నాళ్లు నూజివీడు అని ప్రచారం జరిగింది. తర్వాత అమరావతిని చంద్రబాబు ఫైనల్ చేశారు. అయితే ఇప్పుడు జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబుకు అఖిలపక్షం గుర్తుకొచ్చిందన్నది వైసీపీ నేతల విమర్శ.

అదే డిజైన్లతో అమరావతిని….

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పటి వరకూ రాజధాని అమరావతిని మారుస్తామని చెప్పలేదు. అయినా చంద్రబాబు రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టి రాజధాని అమరావతి నిర్మాణం చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. అంతవరకూ బాగానే ఉన్నా చంద్రబాబు రాజధాని డిజైన్లను కూడా మార్చడానికి వీలులేదని ఏకంగా రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానం చేశారు. అంటే చంద్రబాబు రాజధాని కోసం రూపొందించిన డిజైన్లనే జగన్ కంటిన్యూ చేయాలన్న మాట.

ప్రకటనకు ముందే…..

అయితే వైసీపీ నేతలు మాత్రం రాజధానిలో పెద్ద కుంభకోణం జరిగిందంటున్నారు. రాజధానిగా అమరావతిని ప్రకటించకముందే పెద్దయెత్తున టీడీపీ నేతలు భూములు కొనుగోలు చేశారని కూడా చెబుతున్నారు. కొన్ని పేర్లను కూడా వైసీపీ బయటపెట్టింది. కేవలం నేతలే కాకుండా వారి డ్రైవర్లు, పీఏల పేర్లను కూడా 2014 డిసెంబరుకు ముందు కొనుగోలు చేసినట్లు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ ఖచ్చితంగా రాజధాని డిజైన్లను మారుస్తారంటున్నారు. జగన్ తొలినుంచి సింగపూర్ తరహా రాజధాని అనవసరమనే భావనలోనే ఉన్నారు.

తమకు తెలుసంటున్న…..

ఇటీవల సీఆర్డీఏ సమీక్షలోనూ జగన్ అవసరమైన పనులు మాత్రమే చేయమని ఆదేశించడం కూడా ఇందులో భాగమే. రాజధాని అమరావతిని జగన్ మార్చే అవకాశంలేదని, అయితే అన్ని సంస్థలు అమరావతికే పరిమితం చేయడం సరికాదన్నది జగన్ అభిప్రాయం. జగన్ అమరావతిని రాజధానిగా ఉంచకూడదనుకుంటే తాడేపల్లిలో సొంత నివాసం ఎందుకు ఏర్పరచుకుంటారని కూడా వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు చేసిన డిజైన్లను ఎప్పుడో పక్కన పడేసినట్లు వారు చెబుతున్నారు. రాజధానిపై నియమించిన నిపుణుల కమిటీ సిఫార్సులనే జగన్ అమలు చేస్తారని, చంద్రబాబు డిజైన్లు ఆయన ఇంటికి వాడుకోవచ్చని సెటైర్లు వేస్తున్నారు. మొత్తం మీద రాజధాని అమరావతి అంశంలో టీడీపీ, వైసీీపీల మధ్య మాటల యుద్ధం మరికొంత కాలం కొనసాగే అవకాశముంది.

Tags:    

Similar News