బాబు వ్యూహం ఏంటి? క‌ష్టాలు తెచ్చుకున్న ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ

రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో చంద్రబాబు ఎలాంటి త‌ప్పు చేస్తున్నారో.. ఇప్పుడు మూడు రాజ‌ధానుల విష‌యంలోనూ అలాంటి త‌ప్పునే చేస్తు‌న్నార‌నే వాద‌న వినిపిస్తోంది. ఆయ‌న కోరుతున్నట్టు రాజ‌ధానిగా అమ‌రావ‌తి [more]

Update: 2020-08-11 14:30 GMT

రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో చంద్రబాబు ఎలాంటి త‌ప్పు చేస్తున్నారో.. ఇప్పుడు మూడు రాజ‌ధానుల విష‌యంలోనూ అలాంటి త‌ప్పునే చేస్తు‌న్నార‌నే వాద‌న వినిపిస్తోంది. ఆయ‌న కోరుతున్నట్టు రాజ‌ధానిగా అమ‌రావ‌తి ఉండాల‌నే వాద‌న‌ను కాద‌న‌క‌పోయినా.. అదే స‌మ‌యంలో జ‌గ‌న్ చెబుతున్నట్టుగా ఉత్తరాంధ్ర అభివృద్ధి, సీమ అభివృద్ధులపై చంద్రబాబు మాట‌మాత్రం మాట్టాడ‌క‌పోవ‌డంపై మాత్రం విమ‌ర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో చాన్నాళ్లు ఇలానే సాగ‌దీసి రెండు క‌ళ్ల సిద్ధాంతాన్ని తెర‌మీదికి తెచ్చారు. ఫ‌లితంగా తెలంగాణ‌లో పార్టీని స‌ర్వనాశ‌నం చేసుకున్నారు.

సీనియర్ల అభ్యంతరం….

దాని నుంచి పాఠాలు నేర్వని చంద్రబాబు ఇప్పడు మూడు రాజ‌ధానుల విష‌యాన్ని కూడా అలానే చూస్తున్నార‌ని పార్టీలోనే సీనియ‌ర్లు వాదిస్తున్నారు. ఇటీవ‌ల రాజ‌మండ్రి రూర‌ల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌద‌రి కీల‌క వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్రపై మా స్టాండును ఇప్పటికైనా చెప్పాల్సిన అవ‌స‌రం ఉంది. లేక‌పోతే.. తీవ్రంగా న‌ష్టపోతాం. కీల‌క‌మైన విజ‌య‌న‌గ‌రం, విశాఖ‌ల్లోనే పార్టీ దెబ్బ‌తిన్నది. ఈ విష‌యాలు మా పార్టీ అధినేత చంద్రబాబుకు తెలియ‌నివి కాదు. అన్నారు. దీనిని బ‌ట్టి చంద్రబాబు వైఖ‌రిని పార్టీలోని సీనియ‌ర్లు కూడా వ్యతిరేకిస్తున్న విష‌యం స్ప‌ష్టంగా తెలుస్తోంది.

రాయలసీమలో పూర్తిగా…..

ఇప్పటికే రాయ‌ల‌సీమ‌లో టీడీపీ పూర్తిగా దెబ్బతింది. ఇంకా చెప్పాలంటే అక్కడ పార్టీ నేత‌ల మాట‌ల్లోనే పార్టీ అక్కడ జీరో అయిపోయింది. గ‌త ఎన్నిక‌ల్లో మూడు సీట్లు వ‌చ్చిన‌ప్పటితో పోలిస్తే ఇప్పుడు మ‌రి కొంత మంది కీల‌క నేత‌లు అక్కడ ఇత‌ర పార్టీల్లోకి వెళ్లిపోగా.. మ‌రి కొంద‌రు సైలెంట్ అయిపోయారు. ఇంకా మిగిలిన వారు రాజ‌కీయాల‌కు దూర‌మైపోయారు. ఇలాంటి టైంలో పార్టీకి బ‌లంగా ఉన్న కొమ్మ అయిన ఉత్తరాంధ్ర‌పై జ‌గ‌న్ గురి చూసి దెబ్బకొట్ట‌డంతో ఇప్పుడు టీడీపీ విల‌విల్లాడిపోతోంది. ఉత్తరాంధ్రలో ఇటీవ‌ల కాలంలో జ‌గ‌న్ పాటించిన అనేక ఈక్వేష‌న్లు టీడీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. మ‌త్స్యకార వ‌ర్గానికి చెందిన ప‌లాస ఎమ్మెల్యే సీదిరి అప్పల‌రాజుకు మంత్రి ప‌ద‌వి ఇవ్వడం ద‌గ్గర నుంచి ఉత్తరాంధ్రకు రాజ‌ధానిని త‌ర‌లించ‌డం ఇలా అనేక అంశాలు టీడీపీని అక్కడ కూడా చాలా వ‌ర్గాల‌కు దూరం చేసేశాయి. ఇప్పుడు ఈ భారీ న‌ష్టం పూడ్చుకునే ప‌రిస్థితి బాబుకు లేద‌నే అక్కడ పలువురు కీల‌క నేత‌లు కూడా పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారు.

నిర్ణయం తీసుకోకుంటే…?

ఇక‌, తూర్పుగోదావ‌రి జిల్లాలోని చాలా మంది టీడీపీ నాయ‌కులే విశాఖ‌ను రాజ‌ధానిగా చేస్తే.. త‌మ‌కు కూడా ఏదో ఒక ల‌బ్ధి ఉంటుంద‌ని భావిస్తున్నారు. కానీ, య‌న‌మ‌ల వంటి కొంద‌రు నేత‌లు మాత్ర‌ బాబుకు వంత పాడుతున్నార‌నే వాద‌న ఉంది. శ్రీకాకుళం జిల్లాలో కింజార‌పు ఫ్యామిలీ రాజ‌కీయ భవిష్య‌ కూడా అగ‌మ్య‌చ‌రంగానే ఉంది. ఇప్ప‌ వ‌ర‌కు రాజ‌ధాని కోసం చంద్ర‌బు ఇచ్చిన పిలుపులో భాగంగా ఆందోళ‌న‌ల‌కు వ‌చ్చిన తూర్పుగోదావ‌రి నేత‌ల్లో ప‌ట్టుమ‌ని ప‌దిమంది కీల‌క నేత‌లు లేక‌పోవ‌డం కూడా దీనిని రుజువుచేస్తోంది. ఇక‌, విజ‌య‌న‌గ‌రం, విశాఖ‌ల్లో ఒక్క అశోక్‌గ‌జ‌ప‌తి రాజు వంటి ఔట్‌డేటెడ్ నాయ‌కులు మాత్ర‌ బాబుకు మ‌ద్ద‌గా బ‌య‌ట‌కు వ‌స్తున్నారు త‌ప్స మిగిలిన నాయ‌కులు అంద‌రూ కూడా బాబుతో విభేదిస్తున్నారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఉత్తరాంధ్రపై బాబు ఏదో ఒక నిర్ణయం తీసుకోక‌పోతే.. రాబోయే రోజుల్లో ఆయ‌న‌కు, పార్టీకి ఇక్కడ గండం త‌ప్పద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి.

Tags:    

Similar News