డైలీ పాలిటిక్స్ ఇక అలాగేనా? అలాగయితే ఎలా?

తెలుగుదేశం పార్టీ చరిత్ర దాదాపుగా నాలుగు దశాబ్దాలు. ఇక అధినాయకుడు చంద్రబాబుది ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ. అంటువంటి అనుభవం కలిగిన పార్టీ ఎలా వెలిగిపోవాలి. కానీ టీడీపీ [more]

Update: 2020-06-10 08:00 GMT

తెలుగుదేశం పార్టీ చరిత్ర దాదాపుగా నాలుగు దశాబ్దాలు. ఇక అధినాయకుడు చంద్రబాబుది ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ. అంటువంటి అనుభవం కలిగిన పార్టీ ఎలా వెలిగిపోవాలి. కానీ టీడీపీ పరిస్థితి ఇపుడు నానాటికి తీసికట్టు అన్నట్లుగా తయారయింది. గత ఏడాది ఎన్నికల్లో కొట్టిన దెబ్బను తమ్ముళ్ళు మాత్రమే కాదు, అధినాయకుడూ ఇంకా మరచిపోలేకపోతున్నారు. కేవలం 23 సీట్లు వచ్చాయంటే అది చిన్నతనమే కాదు, పార్టీ పసలేని తనాన్ని కూడా సూచిస్తోంది. ఇవన్నీ ఇలా ఉంటే చంద్రబాబు ఇపుడు జనంలో ఉండడంలేదు. పైగా ప్రవాసాంధ్రుడిగా కొత్త అవతారం ఎత్తేశారు.

కొడుకు బాటలో ….

తనలా ఇరవైనాలుగు గంటలూ పార్టీ కోసం కష్టపడమని చంద్రబాబు ఇన్నాళ్ళూ కొడుకు లోకేష్ కి చెప్పేవారంటారు. ఇపుడు అది రివర్స్ అయింది. చంద్రబాబు సైతం కొడుకు రూట్లోకి వెళ్ళిపోయారు. ఇన్నాళ్ళూ ట్విట్టర్ పిట్ట లోకేష్ అని అటు తెలంగాణా, ఇటు ఆంధ్రాలోని ప్రత్యర్ధి పార్టీ నాయకులు అంతా కామెంట్స్ చేసేవారు. ఇపుడు చంద్రబాబు సైతం ట్విట్టర్ పిట్టగా మారిపోవడంతో వైసీపీ నేతలు మరింతగా బాణాలు ఎక్కుపెడుతున్నారు. దీన్ని చూసిన తమ్ముళ్ళు తలపట్టుకుంటున్నారు. ఇన్నేళ్ళ అనుభవం ఉన్న చంద్రబాబు కూడా ట్విట్టర్ రాజకీయం చేస్తే ఇక పార్టీ పైకిలేచినట్లేనని నిరాశను వ్యక్తం చేస్తున్నారు.

ఆన్ లైన్ పార్టీ….

తెలుగుదేశానికి ఎన్నో పేర్లు, పచ్చ పార్టీ, సైకిల్ పార్టీ, తెలుగు ద్రోహుల పార్టీ, వెన్నుపోటు పార్టీ ఇలా సెటైర్లు వేసే వైసీపీ ఇపుడు కొత్తగా మరో పేరు జత చేసింది. అదే ఆన్ లైన్ పార్టీ అట. శ్రీకాకుళం జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే సీదరి అప్పలరాజు టీడీపీ జనంలో అసలు ఎక్కడ ఉంది అంటున్నారు. సోషల్ మీడియాని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తూ ఆన్ లైన్ పార్టీగా మారిపోయిందని అంటున్నారు. టీడీపీ గత ఏడాది ఓడిపోయి చాలావరకూ దూరమైందని, ఇపుడు ఆన్ లైన్ లోనే ఉంటూ పూర్తిగా కనుమరుగు అయిందని కూడా హాట్ కామెంట్స్ చేస్తున్నారు.

కష్టమేనా…?

ఏ రాజకీయ పార్టీ అయినా జనంలోనే ఉండాలి. అపుడే వారి దయ కలిగేది. మన జనంలో నూటికి తొంబై శాతం ఓటర్లు సోషల్ మీడియాకు దూరంగానే ఉంటారు. ఓట్లేసే వారు పూర్తిగా వాటిని పట్టించుకోరు. తన కళ్ళ ముందే ఉంటూ ప్రత్యక్ష రాజకీయాలను చేసేవారినే ఆదరిస్తారు. పట్టణ ఓటర్లు, విద్యావంతులు మాత్రమే ఆన్ లైన్ రాజకీయానికి ప్రభావితం అవుతారు. వారిని నమ్ముకుని ఏ పార్టీ గెలిచిన దాఖాలు లేవు. అందువల్ల ప్రజా క్షేత్రంలో గట్టింగా నిలబడిన పార్టీకే భవిష్యత్తు ఉంటుంది. కానీ ఇపుడు చంద్రబాబు, చినబాబు ట్విట్టర్ నే నమ్ముకుని డైలీ పాలిటిక్స్ కి తెరతీశారు. దీని ఫలితాలు,పర్యవశానాలు ఎలా ఉంటాయోనని తమ్ముళ్ళు ఆందోళన చెందుతున్నారు.

Tags:    

Similar News