ఇదే రైట్ టైమ్ బాబు గారూ… సీనియ‌ర్ నేత ఫోన్‌..?

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో తెలియ‌దు క‌దా! నిన్నటి వ‌రకు ఏపీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్ అంటే హ‌డ‌లిపోతున్నార‌ని, జ‌గ‌న్‌ను ఎదిరించి మాట్లాడే ద‌మ్ము పార్టీలో [more]

Update: 2020-06-09 13:30 GMT

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో తెలియ‌దు క‌దా! నిన్నటి వ‌రకు ఏపీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్ అంటే హ‌డ‌లిపోతున్నార‌ని, జ‌గ‌న్‌ను ఎదిరించి మాట్లాడే ద‌మ్ము పార్టీలో ఎవ‌రికీ లేద‌ని పెద్ద ఎత్తున ప్రచారం జ‌రిగింది. జ‌గ‌న్ ను దైవంతో స‌మానంగా చూస్తున్నామ‌ని చెప్పుకొన్న నాయ‌కులను కూడా చూశాం. ఎన్నిక‌ల‌కు ముందు త‌ర్వాత కూడా జ‌గ‌న్ అంటే.. త‌మ‌కు అత్యంత ఆరాధ‌న ఉంద‌ని.. పొద్దునే లేవ‌గానే ముందు జ‌గ‌న్ బొమ్మనే చూసుకుంటామ‌ని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్న వైసీపీ నేత‌ల‌ను మ‌నం చూశాం.

ఏడాది తిరిగేసరికి…..

ఏడాది తిరిగే స‌రికి.,. ఇప్పుడు అలా పొగిడిన నోళ్లతోనే జ‌గ‌న్‌ను ప‌రోక్షంగా ఉతికి ఆరేస్తున్న మ‌హానుభావులు మ‌న‌కు క‌నిపిస్తున్నారు. జ‌గ‌న్ త‌మ‌కు నిధులు ఇవ్వడం లేద‌ని, నియోజ‌క‌వ‌ర్గంలో ప‌నులు సాగ‌డం లేద‌ని, దీంతో తాము త‌ల ఎత్తుకోలేక పోతున్నామ‌ని.. ఇలా.. వైసీపీ ఎమ్మెల్యేలు రోడ్డెక్కారు. ఒక‌వైపు హైకోర్టు ఇస్తున్న తీర్పుల‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జ‌గ‌న్‌ ఇప్పుడు సొంత పార్టీ నేత‌ల నుంచి ఎదుర‌వుతున్న విమ‌ర్శల‌తో మ‌రింత ఫీల‌వుతున్నారు. అయితే, నేత‌ల్లో ఈ ఆవేద‌న శాశ్వత‌మా? లేక నిధులిస్తే.. స‌ర్దుకుంటారా?

అసంతృప్తి నేతలను…..

చెప్పలేని ప‌రిస్థితి ఉంది. కొంద‌రికి మంత్రి ప‌ద‌వులు ఇవ్వలేద‌ని అసంతృప్తి ఉంది. మ‌రికొంద‌రికి నిధులు ఇవ్వడం లేద‌నే అసంతృప్తి ఉంది. ఈ నేప‌థ్యంలో వీరి అసంతృప్తిని త‌గ్గించేందుకు జ‌గ‌న్‌కు కొంత సంక‌ట స్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుకు సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి అయిన తూర్పు గోదావ‌రికి చెందిన ఓ నాయ‌కుడు ఫోన్ చేశారు. సార్‌.. ఈ స‌య‌మంలో మ‌నం రెచ్చిపోదామా? అని ప్రశ్నించార‌ట‌! అసంతృప్తితో ఉన్న నేత‌ల‌ను మ‌న‌వైపున‌కు తిప్పుకుందామా ? అని కూడా అన్నార‌ని టీడీపీలోనే పెద్ద ఎత్తున ప్రచారం జ‌రుగుతోంది.

వైసీపీ నేతలకు వల వేసి….

ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవ‌స‌ర‌మైన మెజారిటీ లేక‌పోయినా.. జ‌గ‌న్‌కు ఉన్న మెజారిటీని త‌గ్గించ‌డం ద్వారా వ్యూహాత్మకంగా పావులు క‌దిపి.. ఎన్నిక‌ల‌కు వెళ్లేందుకు ఉన్న అవ‌కాశం ఏర్పాటు చేస్తే.. చాల‌ని స‌ద‌రు నేత సూచ‌న‌. దీనికి బాబు కూడా సానుకూలంగానే స్పందించార‌ని అంటున్నారు. అంతేకాదు.. స‌ద‌రు నాయ‌కుడు మ‌రో మాట కూడా చెప్పార‌ట‌. ప్రజ‌ల్లో మీపై వ్యతిరేక‌త లేదు. కేవ‌లం క్షేత్రస్థాయిలో నేత‌ల‌పై ఉన్న వ్యతిరేక‌త వ‌ల్లే పార్టీ ఓడిపోయింది. అని కూడా చెప్పార‌ట‌.

పెద్ద ఆశే మరి…..

అయితే, దీనికి ఇంకా కొంత స‌మ‌యం ఉంద‌ని, మ‌రో రెండు మూడు నెల‌లు ప‌రిస్థితులు ఇలానే ఉండేలా మ‌నం వ్యవ‌హ‌రిద్దామ‌ని బాబు చ‌క్కని సూచ‌న ప‌డేశార‌ట‌. అంటే.. మ‌రో ఐదారు మాసాల్లో వైసీపీ క‌నుక స‌ర్దుబాటు చేసుకోక పోతే.. చంద్రబాబు చ‌క్రం తిప్పి.. జ‌గ‌న్‌కు ఎస‌రు పెడ‌తార‌ని టీడీపీలో చ‌ర్చ న‌డుస్తోంది. అస‌లు చంద్రబాబు, టీడీపీ నేత‌ల ఆశలు ఇలా ఉంటే జ‌గ‌న్, వైసీపీ వాళ్లు మాత్రం టీడీపీ వాళ్లను మ‌రి కొంత‌మందిని లాగేసి బాబుకు ప్ర‌ధాన ప్రతిప‌క్ష నేత హోదా లేకుండా చేసే ప్రయ‌త్నాలు చేస్తున్నారు.

Tags:    

Similar News