చంద్రబాబు సక్సెస్… బిగ్ రిలీఫ్… తాత్కాలికమేనా?

వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ కు పడిపోకుండా తెలుగుదేశం అధినేత చంద్రబాబు తన ఎమ్మెల్యేలను కొంత కాపాడుకోగలిగారు. మహానాడుకు ముందే చంద్రబాబుకు గట్టి షాక్ ఇద్దామనుకున్న జగన్ కు [more]

Update: 2020-06-05 06:30 GMT

వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ కు పడిపోకుండా తెలుగుదేశం అధినేత చంద్రబాబు తన ఎమ్మెల్యేలను కొంత కాపాడుకోగలిగారు. మహానాడుకు ముందే చంద్రబాబుకు గట్టి షాక్ ఇద్దామనుకున్న జగన్ కు వీలవ్వకుండా చంద్రబాబు వ్యూహాన్ని రచించారు. తన ఎమ్మెల్యేలు గడప దాటకుండా కాపాడుకోవడంలో సక్సెస్ అయ్యారు. అయితే వైసీపీ మాత్రం ఇది చంద్రబాబుకు తాత్కాలిక ఉపశమనమే అంటుంది. ఎమ్మెల్యేలు వచ్చేందుకు పెట్టిన షరతులపై చర్చిస్తున్నామని ఆఫ్ ది రికార్డుగా చెబుతుండటం విశేషం.

మహానాడుకు ముందే…..

మహానాడుకు ముందే చంద్రబాబును దెబ్బతీయాలని వైసీపీ ప్రయత్నించింది. చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలన్నది వైసీపీ వ్యూహం. అందుకోసం టీడీపీ ఎమ్మెల్యేల కోసం ప్రయత్నాలు చేసింది. ప్రధానంగా ప్రకాశం జిల్లాకు చెందిన ఏలూరు సాంబశివరావు, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ లు తమ పార్టీలోకి వస్తున్నట్లు వైసీపీ ప్రచారం చేసింది. మంత్రులతో వీరు టచ్ లో ఉన్నట్లు ఫిల్లర్స్ వదిలింది. ఈ ఇద్దరితో పాటు మరో ముగ్గురు కూడా పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని వైసీపీ నేతలు పదే పదే చెప్పారు.

ఎమ్మెల్యేలు వెళ్లకపోవడంతో….

దీంతో మహానాడుకు ముందే చంద్రబాబు ఇబ్బందుల్లో పడతారని అందరూ భావించారు. కానీ ఈ ఇద్దరిలో ఏ ఒక్క ఎమ్మెల్యే పార్టీలోకి రాలేదు. పైగా తాము టీడీపీని వీడే ప్రసక్తి లేదని ప్రకటించారు. కార్యకర్తల సమావేశం పెట్టి మరీ తాము పార్టీని వీడబోవడం లేదని ప్రకటించారు. దీంతో చంద్రబాబు రిలీఫ్ ఫీలయ్యారు. చంద్రబాబు మహానాడుకు ముందు నుంచే టీడీపీ ఎమ్మెల్యేలతో టచ్ లో ఉన్నారు.

రాజ్యసభ ఎన్నికల తర్వాత అని…..

మరోవైపు వైసీపీ నేతల వత్తిడి టీడీపీ లీడర్లపై ఎక్కువగానే ఉంది. ప్రకాశం జిల్లాలో గొట్టిపాటి రవికుమార్, మాజీ ఎమ్మెల్యేల శిద్ధా రాఘవరావు, పోతుల రామారావుల గ్రానైట్ వ్యాపారాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఎగుమతుల పర్మిట్లను రద్దు చేసింది. దీంతో వీరికి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతోంది. అయినా వీరు వైసీపీలో చేరేందుకు ససేమిరా అంటున్నారు. కానీ వైసీపీ నేతల ప్రయత్నాలు మాత్రం ఆగక పోవడంతో టీడీపీ అధినేత చంద్రబాబు లో మాత్రం టెన్షన్ వదలడం లేదు. రోజూ ఏదో ఒక సమయంలో వీరితో చంద్రబాబు మాట్లాడుతున్నారు. వారికి పార్టీకి అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నారు. అయితే రాజ్యసభ ఎన్నికల తర్వాత పార్టీలోకి ఎమ్మెల్యేలు వస్తారన్న ప్రచారం మరోసారి ఊపందుకుంది. ఈ నెల 19వ తేదీ అనంతరం ఎమ్మెల్యేలు టీడీపీని వీడతారన్న ప్రచారం మరోసారి చంద్రబాబును కలవరం పడుతోంది.

Tags:    

Similar News