Chandrababu : బాబు కోరుకుంటున్నది… సాధ్యమయ్యేనా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఆత్రం ఎక్కువ. అసహనం ఎక్కువే. ఇప్పటికిప్పుడు అర్జంట్ గా జగన్ ముఖ్యమంత్రి కుర్చీ నుంచి దిగిపోవాలని నిత్యం భావిస్తుంటారు. అది జరగదని [more]

Update: 2021-11-10 08:00 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఆత్రం ఎక్కువ. అసహనం ఎక్కువే. ఇప్పటికిప్పుడు అర్జంట్ గా జగన్ ముఖ్యమంత్రి కుర్చీ నుంచి దిగిపోవాలని నిత్యం భావిస్తుంటారు. అది జరగదని తెలిసినా ఆయన మాత్రం ఆ డిమాండ్ ను వదలరు. వరస ఎన్నికలలో ఓటమి పాలవుతున్నా అసెంబ్లీని రద్దు చేయాలని కోరుతుంటారు. ఇక జగన్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడాలని చంద్రబాబు నిత్యం పిలుపులు ఇస్తూనే ఉన్నారు.

ఒక జిల్లాలో ఘటనతో….

అనంతపురంలో ఒక కళాశాలలో జరిగిన ఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి లోకం తిరబడిందని చంద్రబాబు భావించడాన్ని ఏమనుకోవాలి. ఒక్క జిల్లాలో విద్యార్థులు తమ పై జరిగిన లాఠీ ఛార్జికి నిరసనగా బంద్ కు పిలుపునిస్తే దానికి ప్రభుత్వంపై తిరుగుబాటుగా చంద్రబాబు అంచనా వేస్తున్నారన్నమాట. చంద్రబాబు నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ఘటనలు ఎన్ని చూసి ఉంటారు. అవి తిరుగుబాటు కావు. నిరసన అని ఆయనకు తెలుసు.

భరోసా నింపేందుకేనా?

కానీ క్యాడర్ లో భరోసా నింపేందుకే చంద్రబాబు ఇలాంటి కామెంట్స్ చేస్తుంటారు. చంద్రబాబు అధికారం కోల్పోయిన మరుసటి రోజు నుంచే ప్రజలు తప్పు చేశారంటూ వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. తప్పు చేసిన వాళ్లే అనుభవించాలని శాపనార్థాలు కూడా పెట్టారు. ఇక ప్రజలు తిరగబడే రోజు ఎంతో దూరంలో లేదని కూడా ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పోరాటం తన కోసం, తన పార్టీ కోసం కాదని ప్రజల కోసమేనని పదే పదే చెబుతున్నారు.

తిరుగుబాటు చేయాలని…

అధికారం కోల్పోయినప్పటికీ చంద్రబాబు తాను చెప్పిందే రాష్ట్రంలో అమలు జరగాలంటున్నారు. అసలు ఆ అధికారం జగన్ కు ఎవరిచ్చారని ప్రశ్నిస్తున్నారు. ప్రజల ఇచ్చిన అధికారంతోనే జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న విషయాన్ని చంద్రబాబు విస్మరిస్తున్నారు. తాను తప్ప ఈ రాష్ట్రాన్ని మరెవ్వరూ బాగు చేయలేరని ఆయన భ్రమలో ఉండి, నాయకులను కూడా అదే భ్రమలో ఉంచుతున్నారు. మొత్తం మీద చంద్రబాబుకు ఇప్పుడు కావాల్సింది ప్రజల్లో తిరుగుబాటు. ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీయాలి. అది జరిగే పనేనా?

Tags:    

Similar News