Chandrababu : గెలవలేమని తెలిసీ.. పోటీ… అందుకేనా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇక అలా చూస్తూ ఉండిపోవాల్సిందే. ఓటమిని అంగీకరించని చంద్రబాబు అన్యాయం జరుగుతుందంటూ గొంతు చించుకోవాల్సిందే. కానీ ఎక్కడా చంద్రబాబుకు సానుకూల పరిస్థితులు [more]

Update: 2021-11-10 05:00 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇక అలా చూస్తూ ఉండిపోవాల్సిందే. ఓటమిని అంగీకరించని చంద్రబాబు అన్యాయం జరుగుతుందంటూ గొంతు చించుకోవాల్సిందే. కానీ ఎక్కడా చంద్రబాబుకు సానుకూల పరిస్థితులు కన్పించడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు పోటీ చేస్తారా? లేదా? అన్నది కూడా చర్చనీయాంశమైంది. డిసెంబరు 10వ తేదీన ఆంధ్రప్రదేశ్ లో 11 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

పదకొండు స్థానాలకు….

స్థానిక సంస్థల ఎన్నికల కోటాలో త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు దాదాపు అన్ని జిల్లాల్లో, మూడు ప్రాంతాల్లోనూ జరుగుతుండటం విశేషం. రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర లో ఈ ఎన్నికలు జరుగుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా మినీ సంగ్రామం జరుగుతుందనే చెప్పాలి. అనంతపురంలో ఒక స్థానానికి, కృష్ణా జిల్లాలో రెండు స్థానాలకు, తూర్పుగోదావరి జిల్లాలో ఒకటి, గుంటూరు జిల్లాలో రెండు, విజయనగరం జిల్లాలో ఒకటి, విశాఖపట్నంలో రెండు, విజయనగరంలో ఒకటి, ప్రకాశం, చిత్తూరు జిల్లాలో ఒక స్థానానికి ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి.

మూడు ప్రాంతాల్లో….

మూడు ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతుండటంతో తప్పనిసరిగా టీడీపీ నుంచి పోటీకి బరిలోకి దింపుతారన్న అభిప్రాయం పార్టీ నుంచి వ్యక్తం అవుతుంది. చంద్రబాబు పై కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? అన్న దానిపై సీనియర్ నేతలతో చర్చించనున్నారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత చంద్రబాబు దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశముంది. అయితే పదకొండు స్థానాల్లోనూ టీడీపీ గెలిచే అవకాశాలు లేవు.

ఇబ్బంది పెట్టడానికేనా?

వైసీపీని ఇబ్బంది పెట్టడానికి చంద్రబాబు తమ అభ్యర్థులను బరిలోకి దింపుతారంటున్నారు. పోటీ ఉంటే ఖచ్చితంగా అధికార వైసీపీ క్యాంపులు పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే కొంత ఖర్చు కూడా చేయాల్సి ఉంటుంది. వైసీపీని కొంత టెన్షన్ పెట్టేందుకు చంద్రబాబు ఈ 11 స్థానాలకు తమ అభ్యర్థులను బరిలోకి దింపుతారని, సామాజికవర్గాలకు అనుగుణంగా వైసీపీ అభ్యర్థులకు పోటీగా చంద్రబాబు ఈ ఎన్నికలకు క్యాండిడేట్ లను సిద్ధం చేస్తున్నారని చెబుతున్నారు.

Tags:    

Similar News