Chandrababu : బాబు పక్కనే కోవర్టులు… బిగించేస్తున్నారా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఏదో ఒక విధంగా ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఆయనకు అనుకూలంగా లేవు. అధికారంలో ఉన్న [more]

Update: 2021-11-09 06:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఏదో ఒక విధంగా ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఆయనకు అనుకూలంగా లేవు. అధికారంలో ఉన్న వైసీపీకే ఎక్కువ శాతం మున్సిపాలిటీలు దక్కే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలు సజావుగా జరగడం లేదని ఆరోపిస్తూ ముందుగానే చంద్రబాబు తన ఓటమిని, నిస్సహాయతను అంగీకరిస్తున్నట్లు కనపడుతూనే ఉంది.

బలహీనమన అభ్యర్థులను…

తెలుగుదేశం పార్టీ దీన స్థితి నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలను చూస్తే అర్థమవుతుంది. వైసీపీ తో టీడీపీ నేతలు కుమ్మక్కయ్యారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. బలహీనమైన అభ్యర్థులను ఖరారు చేసి ఎన్నికల వాతావరణాన్ని వైసీపీకి టీడీపీ స్థానిక నేతలు అనుకూలంగా మార్చివేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 54 డివిజన్లు ఉన్న నెల్లూరు కార్పొరేషన్ లో బలహీన మైన అభ్యర్థులను బరిలోకి దింపారని చంద్రబాబుకు ఫిర్యాదులు అందాయి.

సీనియర్ నేతలను….

దీంతో ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో నెల్లూరు ఎన్నికను రద్దు చేయాలని చంద్రబాబు కోరుతున్నారు. అక్కడ రెండు నియోజకవర్గాలకు ఇన్ ఛార్జులుగా ఉన్న అజీజ్, కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డిలపై పార్టీ సీనియర్ నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎవరినీ సంప్రదించకుండానే గెలిచే అభ్యర్థులను వీరిద్దరూ పక్కన పెట్టారని స్వయంగా సీనియర్ నేతలే ఆరోపిస్తుండటం విశేషం.

ప్రజల్లోకి వెళ్లి….

ఈ నేపథ్యంలో చంద్రబాబు నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపై ముందుగానే ఆశలు వదులుకున్నారు. అందుకే ఎన్నికల కమిషన్ కు నెల్లూరు ఎన్నికను రద్దు చేయాలని కోరుతున్నారు. దీంతో పాటు ప్రజల్లోకి వెళ్లేందుకు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు సిద్ధమయ్యారు. పెట్రోలు, డీజిల్ పై వ్యాట్ తగ్గించాలని కోరుతూ నేడు రాష్ట్ర వ్యాప్త ధర్నాలకు దిగడం కూడా కొద్దో గొప్పో ఓటర్లు తమకు అనుకూలంగా మారతారనే. మొత్తం మీద చంద్రబాబుకు సొంత పార్టీ లోనే కోవర్టులు తయారయినట్లు స్పష్టమయింది. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది చూడాలి.

Tags:    

Similar News