Chandrababu : కుప్పంకు అలా వెళ్లి వచ్చారో లేదో?

చంద్రబాబు అలా వచ్చి వెళ్లారో లేదో కుప్పం మున్సిపాలిటీ ఎన్నికకు షెడ్యూల్ విడుదలయింది. చంద్రబాబు కుప్పం పర్యటన విజయవంతమయిందని టీడీపీ నేతలు చెబుతున్నారు. అదే నిజమైతే ఎన్నికల్లో [more]

Update: 2021-11-02 03:30 GMT

చంద్రబాబు అలా వచ్చి వెళ్లారో లేదో కుప్పం మున్సిపాలిటీ ఎన్నికకు షెడ్యూల్ విడుదలయింది. చంద్రబాబు కుప్పం పర్యటన విజయవంతమయిందని టీడీపీ నేతలు చెబుతున్నారు. అదే నిజమైతే ఎన్నికల్లో గెలిచి తీరాల్సి ఉంటుంది. ఆ బాధ్యత ఇప్పుడు చంద్రబాబు జిల్లా పార్టీ నేతలపైనే పెట్టారు. చంద్రబాబు ఇక కుప్పం నియోజకవర్గంలో పర్యటించరు. గెలుపు కోసం కృషి చేయాల్సింది అక్కడి నేతలే. ఇక్కడి నుంచి ఒక టీమ్ ను కుప్పంకు పంపే యోచనలో చంద్రబాబు ఉన్నారు.

భరోసా ఇచ్చి వచ్చి….

కుప్పం మున్సిపాలిటీకి ఈ నెల 15వ తేదీన ఎన్నిక జరగనుంది. నిజానికి చిన్న ఎన్నికగానే చూడాలి. 25 వార్డులున్న మున్సిపాలిటీలో ఇప్పటికే ప్రచారం చేసి వెళ్లారని చంద్రబాబుపై విమర్శలు విన్పిస్తున్నాయి. వాటిన్నంటిని పక్కన పెట్టి చంద్రబాబు టీడీపీ నేతలతో సమావేశమై వారితో చర్చించారు. ఆర్థికంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అంతేకాదు ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టినా తాను వెంట ఉంటానని మాట ఇచ్చి వచ్చారు.

స్థానిక నేతలపై….

కానీ కుప్పం టీడీపీ నేతలపై చంద్రబాబుకు నమ్మకం లేదనే చెప్పాలి. వరసగా అక్కడ ఓటములు ఎదురవుతుండటంతో అక్కడి నేతల వైఫల్యంగానే చంద్రబాబు గుర్తిస్తున్నారు. కుప్పం టీడీపీ నేతలను చంద్రబాబు ఏనాడు నిర్లక్ష్యం చేయలేదు. వారికి ఆర్థికంగా ఎప్పటికప్పుడు ఆదుకుంటూనే వస్తున్నారు. పూర్తిగా వారిపైనే ఆధారపడటంతో వారికి పార్టీ పరంగా అన్ని రకాలుగా నేతలను ఆదుకున్నారు. కానీ వారిలో అనైక్యత పార్టీ కొంపముంచిందంటున్నారు.

ఒక టీంను పంపి….

అందుకే ఈసారి చంద్రబాబు లోకల్ నాయకత్వంపై కుప్పం ఎన్నికను వదిలేయదలచుకోలేదు. ఇక్కడి నుంచి ఒక టీంను పంపాలన్న యోచనలో ఉన్నారు. బుద్దా వెంకన్న వంటి నమ్మకమైన నేతలను కుప్పంకు పంపాలని, అలాగే ప్రచారానికి కూడా రాష్ట్ర స్థాయి నేతలను పంపాలన్న యోచనలో ఉన్నారు. మొత్తం మీద కుప్పంలో పర్యటించి వచ్చినా చంద్రబాబుకు మాత్రం దిగులు వదలకుండా ఉంది. అందుకే ఇక్కడి నుంచే కుప్పం నేతలను మానిటర్ చేయాలని నిర్ణయించారు.

Tags:    

Similar News