Chandrababu : చిరునామా ఏంటని ఎవరైనా అడిగితే?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పొరుగు రాష్ట్రం నేతగానే మిగిలిపోతారా? ఏపీలో నివాసం ఏర్పరచుకోరా? అంటే లేదనే అంటున్నారు. చంద్రబాబు రాష్ట్రం విడిపోయి ఏడేళ్లు దాటుతున్నా ఏపీలో [more]

Update: 2021-11-10 00:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పొరుగు రాష్ట్రం నేతగానే మిగిలిపోతారా? ఏపీలో నివాసం ఏర్పరచుకోరా? అంటే లేదనే అంటున్నారు. చంద్రబాబు రాష్ట్రం విడిపోయి ఏడేళ్లు దాటుతున్నా ఏపీలో స్థిర నివాసం ఏర్పరచుకోలేదు. తమ తాత, తండ్రులకు చెందిన ఇల్లు నారావారిపల్లె లో ఉండటంతో ఆయనను ఏపీ వాసిగానే చూడాలి. రాయలసీమ జిల్లాలో పుట్టినా ఆయనను అన్ని ప్రాంతాల ప్రజలు సమాదరిస్తారు.

జగన్ కూడా….

2014 కు ముందు జగన్ హైదరాబాద్ నుంచే రాజకీయాలు చేసేవారు. అప్పుడు చంద్రబాబు తరచూ విమర్శలు చేసేవారు. పొరుగు రాష్ట్రం నుంచి వచ్చి రాజకీయాలు చేయడమేంటని ప్రశ్నించారు. జగన్ కు కూడా పులివెందులలో సొంత ఇల్లు ఉంది. ఆయనను అన్ని ప్రాంతాల ప్రజలు ఆదరిస్తారు. పొరుగు రాష్ట్రం నుంచి వస్తుండటంతో ఆయనను 2014 ఎన్నికల్లో పొరుగు వాడిగానే చూశారు. ఇప్పుడు చంద్రబాబుకు కూడా అదే పరిస్థితి తలెత్తింది.

అద్దె భవనంలో…

చంద్రబాబుకు కరకట్ట మీద నివాసం ఉన్నా అది అద్దె భవనమే. చంద్రబాబు ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉంటున్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చంద్రబాబు హైదరాబాద్ లోనే సొంత ఇంటిని పునర్నించుకున్నారు తప్ప ఇక్కడకు వచ్చే ప్రయత్నం చేయలేదు. కాకుంటే ఇక్కడ పార్టీ కి శాశ్వత భవనాన్ని నిర్మించారు. సొంత ఇల్లు హైదరాబాద్ లోనే ఉండటం, కుటుంబ సభ్యులంతా అక్కడే ఉండటంతో హైదరాబాద్ టు విజయవాడ షటిల్ కొట్టాల్సి వస్తుంది.

ఫ్యామిలీ అంతా పొరుగున….

చంద్రబాబుకు తోడు ఆయన కుమారుడు నారా లోకేష్ సయితం హైదరాబాద్ లోనే ఎక్కువ గడుపుతున్నారు. అడపా దడపా వచ్చి ఏపీలో అలా తిరిగి వెళ్లిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో వైసీపీ నేతలు చంద్రబాబును అద్దె బాబుగానే పిలుస్తున్నారు. జగన్ ఇక్కడ సొంత ఇంటిని నిర్మించుకున్నారని, చంద్రబాబు మాత్రం తెలంగాణ ప్రభుత్వానికి శిస్తు కడుతున్నారని ఆరోపిస్తున్నారు. చంద్రబాబు ఇప్పటికైనా ఏపీనే శాశ్వత చిరునామాగా చేసుకుంటే బాగుంటుందన్న సూచనలు విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News