Chandrababu : రన్ బాబూ రన్.. నో టైమ్

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇక చేయాల్సిందల్లా ప్రజల్లోకి వెళ్లడమే. ప్రజలను తన నాయకత్వం వైపు తిప్పుకోవడమే. అలా కాకుండా సెంట్రల్ కార్యాలయానికే పరిమితమయితే ఇబ్బందులు తప్పవు. [more]

Update: 2021-11-11 12:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇక చేయాల్సిందల్లా ప్రజల్లోకి వెళ్లడమే. ప్రజలను తన నాయకత్వం వైపు తిప్పుకోవడమే. అలా కాకుండా సెంట్రల్ కార్యాలయానికే పరిమితమయితే ఇబ్బందులు తప్పవు. చంద్రబాబు మున్సిపల్ ఎన్నికలకు తప్ప రాష్ట్రంలో గత రెండున్నరేళ్లుగా పర్యటించింది లేదు. ఇసుక దీక్ష వంటి ఒకటి అరా తప్ప ప్రజా సమస్యలపై పోరాటం చేసింది లేదు. ఎంతసేపూ తన పార్టీనేతలను టార్గెట్ చేస్తున్నారని రోడ్డెక్కడమే జరిగింది. ఒక్క ప్రజాసమస్యపై కూడా స్పందించ లేదన్న విమర్శలున్నాయి.

జగన్ వలలో….

జగన్ అధికారంలోకి వచ్చిన తర్వత టీడీపీ నేతలను టార్గెట్ చేశారన్న మాట వాస్తవమే. ధూళిపాళ్ల నరేంద్ర చౌదరి, కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు వంటి నేతలను అరెస్ట్ చేసి చంద్రబాబును జగన్ సమర్థవంతంగా డైవర్ట్ చేయగలిగారు. ప్రజా సమస్యల నుంచి చంద్రబాబును పక్కకు తప్పించగలిగారు. చంద్రబాబు ఎప్పుడు పోరాటం చేసినా టీడీపీ నేతల కోసమేనన్నది జనంలో బలంగా పడిపోయింది.

హైదరాబాద్ కే….

జగన్ వేసిన వలలో చంద్రబాబు ఇరుక్కున్నారన్నది స్పష్టంగా తెలుస్తోంది. పార్టీ నేతల కోసం ఢిల్లీ చుట్టూ తిరిగే కన్నా రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు హస్తిన కు వెళితే బాగుండేదన్న కామెంట్స్ వినపడుతున్నాయి. గడచిన రెండున్నరేళ్లుగా చంద్రబాబు ఎక్కువగా హైదరాబాద్ కే పరిమితమయ్యారు. జిల్లాల పర్యటనను కూడా మానుకున్నారు. దీంతో జిల్లాల్లో పార్టీ పరిస్థిితి కూడా ఏమాత్రం బాగా లేదు.

పరుగు పెట్టకపోతే….?

ఇంకా ఎన్నికలకు మూడేళ్ల సమయం ఉంది. ఇప్పటికే టీడీపీ ప్రజలకు దూరమయిందన్న భావన ఉంది. కరోనా సమయంలోనూ టీడీపీ నేతలు ప్రజలకు చేరువ కాలేకపోయారు. ఇప్పటికైనా చంద్రబాబు జనం బాట పట్టాలని పార్టీ నేతలు కోరుతున్నారు. పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యలను ఫోకస్ చేయడంపై చంద్రబాబు దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అందుకే ఇక ఆయన అలుపెరగకుండా పరుగులు పెట్టాల్సి ఉంది.

Tags:    

Similar News