బాబుకు భ‌లే స‌మస్య.. నేత‌ల‌తోకాదు..వార‌సుల‌తోన‌ట

టీడీపీ అధినేత బాబుకు భ‌లే స‌మస్య.. నేత‌ల‌తోకాదు..వార‌సుల‌తోన‌ట కు మ‌రో త‌ల‌నొప్పి స్టార్టయింద‌ని పార్టీలో పెద్దలు చెవులు కొరుక్కుంటున్నారు. నిన్న మొన్నటి వ‌ర‌కు గెలిచిన ఎమ్మెల్యేలు ఆయ‌న‌కు [more]

Update: 2020-06-06 15:30 GMT

టీడీపీ అధినేత బాబుకు భ‌లే స‌మస్య.. నేత‌ల‌తోకాదు..వార‌సుల‌తోన‌ట
కు మ‌రో త‌ల‌నొప్పి స్టార్టయింద‌ని పార్టీలో పెద్దలు చెవులు కొరుక్కుంటున్నారు. నిన్న మొన్నటి వ‌ర‌కు గెలిచిన ఎమ్మెల్యేలు ఆయ‌న‌కు షాక్ ఇస్తూ.. వ‌చ్చారు. దీంతో కొంద‌రితో మంత‌నాలు చేశారు.. ఫ‌లిస్తే.. ఫ‌లించిన‌ట్టు.. లేక‌పోతే.. లేన‌ట్టని వారిని ఇక వ‌దిలేశారు. ఉన్నవారితోనే స‌రిపెట్టుకుందాం.. అనుకున్నారు. గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ మారిపోగా ఇప్పుడు పార్టీకి కేవ‌లం 20 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. పోనీ.. అంత‌గా పోయేవారు పోయినా.. ప్రస్తుతం త‌న‌కు, త‌న పార్టీకి ఉన్న ప్రధాన ప్రతిప‌క్ష హోదా లేకుండా చేయాల‌ని వైసీపీ నాయ‌కులు అనుకున్నా.. చంద్రబాబు బేఫిక‌ర్ అంటున్నార‌ట‌. తెలంగాణ‌లో కాంగ్రెస్ నుంచి 17 మందిని ఒకే సారి గంప‌గుత్తగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీసేసుకుంటే.. అక్కడ కూడా కాంగ్రెస్‌కు ఇదే స‌మస్య వ‌చ్చింది.

కోర్టుకు వెళ్లి….

దీంతో కాంగ్రెస్ నాయ‌కులు మూకుమ్మడిగా (మిగిలిన‌వారు) హైకోర్టుకు వెళ్లి కోరం లేక‌పోయినా.. ఉన్నది ఆ ఒక్కపార్టీనే కాబ‌ట్టి ప్రధాన ప‌క్షం హోదా క‌ట్టబెట్టాల‌ని కోర్టునుంచి తీర్పు తెచ్చుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు ఇక్కడ కూడా అదే ఫార్ములా అవ‌లంభించాల‌ని ఇప్పటికే డిసైడ్ అయ్యారు. మ‌రి ఇంకేంటి స‌మ‌స్య.. అంటే.. కురువృద్ధ నేత‌లు చాలా మంది ఇప్పటికే కాడి ప‌డేశారు. ఇన్నాళ్లు వేగాం .. ఇక‌, మా వారసులు చ‌క్రం తిప్పుతారు.. అంటూ.. అనంతపురం, క‌ర్నూలు.. స‌హా ప‌లు జిల్లాల్లో వార‌సులను రంగంలోకి దింపారు. చాలా మంది గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో పోటీ కూడా చేశారు. అయితే, వారిలో ఏ ఒక్కరూ గెలుపు గుర్రం ఎక్కలేక పోయారు. ఇక‌, ఏడాది గ‌డిచిపోయింది. యువ‌త‌కు పార్టీలో 33 శాతం ప‌దవులు ఇస్తాన‌న్న చంద్రబాబు.. ఇప్పటి వ‌ర‌కు దీనిపై స్పందించ‌లేదు.

పదవుల కోసం….

ప్రస్తుతం తెలుగు యువ‌త అధ్యక్ష ప‌ద‌వి ఖాళీగా ఉంది. ఎన్నిక‌ల‌కు ముందు ఈ ప‌ద‌వి బాధ్యత‌లు చేప‌ట్టిన దేవినేని అవినాష్ గుడివాడ నుంచి పోటీ చేసి ఓడిపోయి ఇప్పుడు వైసీపీలోకి జంప్ చేసి విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వయ‌క‌ర్తగా ఉన్నారు. అదే స‌మ‌యంలో జిల్లాల్లో ఇంచార్జుల పీఠాలు కూడా ఖాళీగా ఉన్నాయి. ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు జంప్ చేయ‌డంతో అక్కడ కూడా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తాజాగా ముగిసిన మ‌హానాడులో అయినా యువ‌త‌కు ప‌ద‌వుల కేటాయింపుపై ఎలాంటి నిర్ణయ‌మైనా తీసుకుంటార‌ని యువ నాయ‌కులు బోలెడు మంది ఎదురు చూశారు. వీరి జాబితా చాంతాడంత ఉంద‌నుకోండి. అయితే, చంద్రబాబు మాత్రం జ‌గ‌న్‌పై దుమ్మెత్తి పోసి.. మ‌హానాడును ముగించారు. ఈ ప‌రిణామాలు ఇప్పుడు పార్టీ యువ‌నేత‌ల్లో సెగ రేపుతున్నాయి. “ఇంక న‌న్ను ఆప‌కు డాడీ. నా దారి నేను చూసుకుంటా!“ అంటూ వార‌సులు ధీర్ఘాలు పెడుతున్నారు.

తండ్రులు బుజ్జగిస్తుండటంతో….

అయితే, తండ్రులు, త‌ల్లులు మాత్రం వారిని ఆపేందుకు ప్రయ‌త్నిస్తునారు. “ఇంకొన్నాళ్లు ఓర్చుకో.. చంద్రబాబు మార‌తాడులే!“ అంటూ బుజ్జగిస్తున్నారు. మ‌రి యువ ర‌క్తం .. వెయిట్ చేస్తుందా ? అనేది స‌మ‌స్య. ఇప్పుడు వీరికి అవ‌కాశం ఇవ్వక‌పోతే.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి త‌న కుమారుడు లోకేష్ ను బ‌ల‌ప‌రిచే నాయ‌క‌త్వం కోసం వెతుక్కోవాలి. మొత్తంగా ఇప్పుడు యువ వార‌సుల స‌మస్య చంద్రబాబు త‌ల‌బొప్పిక‌ట్టించేలా మార‌నుంద‌ని అంటున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

Tags:    

Similar News