Chandrababu : ఇంకా మల్లెల బాబ్జి కాలం రాజకీయాలేనా బాబూ?

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎప్పటికీ మారేలా లేరు. ఆయన ఇంకా మల్లెల బాబ్జి కాలంనాటి రాజకీయాల్లోనే ఉన్నారు. మల్లెల బాబ్జీతో ఎన్టీఆర్ పై దాడి చేయించి [more]

Update: 2021-10-20 06:30 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎప్పటికీ మారేలా లేరు. ఆయన ఇంకా మల్లెల బాబ్జి కాలంనాటి రాజకీయాల్లోనే ఉన్నారు. మల్లెల బాబ్జీతో ఎన్టీఆర్ పై దాడి చేయించి రాజకీయ లబ్ది పొందినట్టు ఇప్పుడు కూడా తన సొంత మనుషులతో చెత్త పనులు చేయించి, సానుభూతి పొంది తద్వారా రాజకీయలబ్ది పొందాలని చూస్తున్నారు. ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు దేవస్థానాలపై దాడులు జరిగాయి. అలాగే కొన్ని చోట్ల దేవుళ్ళ విగ్రహాలపై, దేవాలయాల నిర్మాణాలపై, దేవతల బొమ్మలపై దాడులు జరిగాయని టీడీపీ నాయకత్వం పెద్దఎత్తున ప్రచారం చేసింది. అయితే వివిధ ప్రాంతాల్లో టీడీపీ నాయకుల ప్రమేయం వెలుగులోకి రావడంతో ఆ తర్వాత దేవాలయాలపై దాడులు ఒక్కసారిగా ఆగిపోయాయి.

తేలుకుట్టిన దొంగల్లా….

రాజమండ్రిలో టీడీపీ నేతల హస్తం బయటపడిన వెంటనే తేలుకుట్టిన దొంగల్లా టీడీపీ నేతలు మౌనం దాల్చారు. అలాగే అక్రమ ఇసుక, అక్రమ మద్యం వంటి కార్యక్రమాల్లో పలువురు టీడీపీ నేతలు, సానుభూతిపరుల ప్రమేయం ఎప్పటికప్పుడు కనిపిస్తూనే ఉంది. ఇటీవల కాలంలో సినిమా రంగం నుండి తీసుకొచ్చిన పెయిడ్ ఆర్టిస్టులతో వీడియోలు చేసి రాష్ట్ర ప్రభుత్వం వరదల నివారణలో విఫలం అయిందని చెప్పి అడ్డంగా దొరికిపోయారు. అబద్దాల వీడియోలు చేసిన పెయిడ్ ఆర్టిస్టులు దొరికిపోయారు. అప్పట్లో మల్లెల బాబ్జీ తో ఆడించిన డ్రామా లాగే ఈ పెయిడ్ ఆర్టిస్టులతో డ్రామా చేసి అభాసుపాలయ్యారు చంద్రబాబు. అయినా ఎదురు దాడి చేస్తూనే రాజకీయ లబ్దికోసం టీడీపీ నేతలు, చంద్రబాబు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

బాబు వెంట ఉన్నదెవరు?

విజయవాడలో కాల్ మని – సెక్స్ రాకెట్ లో దొరికిన వాళ్ళంతా టీడీపీ నేతలే అనేది అప్పట్లోనే బహిరంగం అయింది. ఈ విషయం అప్పట్లోనే ప్రజలు అర్ధం చేసుకున్నారు. ఇసుక దొంగతనం క్రమంలో ఓక మహిళా ఎమ్మార్వోను కూడా జుట్టుపట్టి లాగి కింద పడేసిన సందర్భంలోనే ఇసుక మాఫియా టీడీపీ కనుసన్నల్లోనే ఉందనే విషయం ప్రజలకు తెలిసిపోయింది. అయినా ఇప్పటికీ ఇసుక మాఫియా అంటూ ప్రత్యర్థులపై దాడి చేయడం చంద్రబాబుకు ఆయన అనుచరులకు అలవాటయింది. ఇప్పుడు గంజాయి వ్యాపారం అంటూ కొత్తగా మొదలు పెట్టిన ఎదురు దాడి సందర్భంగా చంద్రబాబు వెంట ఉన్నదెవరు అని ఆలోచిస్తే ఇంతకు ముందు ఒకటి రెండు సందర్భాల్లో గంజాయి కేసుల్లో ఇరుక్కున్న వ్యక్తులే అని తేలి పోయింది.

గంజాయి కేసుల్లోనూ….

గుంటూరు జిల్లా చుండూరు గ్రామంలో గంజాయి కేసులు, రౌడీ షీట్ ఉన్న బాలాకోటిరెడ్డి అనే వ్యక్తి నిన్న ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో బూతులు మాట్లాడాడు. ఇలాంటి వాళ్ళను పక్కన పెట్టుకుని చంద్రబాబు మళ్ళీ మల్లెల బాబ్జీ కాలం నాటి రాజకీయాలు చేసి లబ్ధిపొందాలని చూస్తున్నారు. పార్టీ లో ఇప్పుడు అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తూ నిత్యం మీడియాలో కనిపిస్తున్న కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పూర్వాశ్రమంలో లాడ్జి నడిపిస్తూ చిన్న స్థాయిలో వ్యభిచారం నిర్వహిస్తూ అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి. ఇంతటి గొప్ప వ్యక్తి 2019 వరకూ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడా కనిపించిన దాఖలాలు లేవు.

నేలబారు రాజకీయాలు….

పార్టీ ఓడిపోగానే చంద్రబాబుకు ఇలాంటి వ్యక్తుల అవసరం వచ్చింది. వాళ్ళతోనే రాజకీయం నడిపిస్తున్నాడు. ఈ వ్యక్తులు ఇంత నేలబారు వాళ్ళు కావడం వల్లనే వాళ్ళ నోటినుండి బోస్ డీకే, పాలేరు వంటి పదాలతో ముఖ్యమంత్రిని, డీజీపీని దూషించగలుగుతారు. అయితే చంద్రబాబు తెలుసుకోవాల్సిందేమంటే ఇలాంటి నేలబారు వ్యక్తులతో, ఇలాంటి కుట్రలతో ఎల్లకాలం చీకటి రాజకీయాలు నడపలేము అని. ఈ విషయం తెలుసుకున్న రోజున చంద్రబాబు ఈ రాష్ట్రంలో రాజకీయాలు నడపలేరు.

Similar News